ETV Bharat / state

ఏపీలో కొత్త ముఖ్యమంత్రితో సత్సంబంధాలు నెలకొల్పుతాం - శ్రీవారి సన్నిధిలో తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్య - CM REVANTH VISITED TIRUMALA TODAY

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 22, 2024, 1:01 PM IST

Telangana CM Revanth Visited Tirumala Temple : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి వారికి స్వాగతం పలికి దర్శనానికి ఏర్పాట్లు చేశారు.

Telangana CM Revanth Reddy Visits Tirumala Temple
Telangana CM Revanth Reddy Visits Tirumala Temple (ETV Bharat)

Telangana CM Revanth Reddy Visits Tirumala Temple : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన కుటుంబసభ్యులతో కలిసి ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. రేవంత్‌ ఇవాళ ఉదయం శ్రీవారికి తన మనవడి పుట్టువెంట్రుకలను మొక్కుగా చెల్లించారు. అనంతరం 8.30 గంటలకు వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత రంగనాయకుల మండపంలో ఆయన కుటుంబానికి పండితులు ఆశీర్వచనం అందించారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్ర పటాన్ని అందజేశారు.

దర్శనం అనంతరం సీఎం రేవంత్​రెడ్డి మీడియోతో మాట్లాడారు. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం భవన నిర్మాణం, కల్యాణ మండపం నిర్మించి స్వామివారి సేవలో తరించేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. అందుకు త్వరలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి తిరుమల శ్రీవారి సేవలో తెలంగాణ ప్రభుత్వాన్ని భాగస్వామిగా చేయాలని విజ్ఞప్తి చేస్తానని తెలిపారు.

గత సంవత్సరంలో వర్షాలు కురవకపోయినా ప్రస్తుతం రాష్ట్రంలో నీటి సమస్యలు తీరాయని చెప్పారు. కాంగ్రెస్​ పాలనలో తెలంగాణ రైతులు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. ఏపీలో ఏర్పడే ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండాలని ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. స్వామివారి ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని వ్యాఖ్యానించారు.

'రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఏర్పడాలి, అభివృద్ధి పథం వైపు నడవాలి. తెలంగాణ ప్రభుత్వం తరఫున కొండ మీద ఒక సత్రం, కల్యాణ మండపం నిర్మించి భక్తులకు సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది'- రేవంత్​రెడ్డి, ముఖ్యమంత్రి

ఏపీలో కొత్త ముఖ్యమంత్రితో సత్సంబంధాలు నెలకొల్పుతాం - శ్రీవారి సన్నిధిలో తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్య (ETV Bharat)

CM Revanth Reddy Tirumala Visit : ఈ నెల 21న సీఎం రేవంత్​రెడ్డి హైదరాబాద్‌ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట ఎయిర్‌పోర్టుకు కుటుంబ సమేతంగా చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గాన శ్రీవారి దర్శనం కోసం తిరుమల వెళ్లారు. తర్వాత రచనా అతిథి గృహానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌కు టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఘన స్వాగతం పలికారు. మంగళవారం రాత్రికి తిరుమలలో ఆయన బస చేసి ఇవాళ శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.

మరోవైపు తిరుమలలో నరసింహస్వామి జయంతి సందర్భంగా ఆలయంలో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నరసింహస్వామికి ప్రత్యేక అభిషేకం చేశారు. వసంత మండపంలో మధ్యాహ్నం నరసింహస్వామికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. నాద నీరాజనం వేదికపై గరిమెళ్ల బాలకృష్ణ, బుల్లెమ్మ బృందం వెంగమాంబ సంకీర్తనలు ఉంటుంది. సాయంత్రం నారాయణగిరి ఉద్యానవనాల్లో వెంగమాంబ సంకీర్తనల గానం నిర్వహిస్తారు.

తిరుమలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి - స్వాగతం పలికిన టీటీడీ ఈవో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.