ETV Bharat / snippets

తిరుమలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి - స్వాగతం పలికిన టీటీడీ ఈవో

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 21, 2024, 8:22 PM IST

Telangana CM Revanth Tirumala Visit
Telangana CM Revanth Tirumala Visit (ETV Bharat)

Telangana CM Revanth Reddy Tirumala Visit: శ్రీవారి దర్శనార్థం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి నగర్​లోని రచన అతిథి గృహం వద్దకు చేరుకున్న రేవంత్ రెడ్డి దంపతులకు తితిదే ఈవో ధర్మారెడ్డి (TTD EO Dharma Reddy) స్వాగతం పలికారు. మంగళవారం రాత్రి తిరుమలలో రేవంత్ రెడ్డి బస చేయనున్నారు. మనవడికి పుట్టు వెంట్రుకల మొక్కుబడిని స్వామివారికి తీర్చనున్నారు. బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో రేవంత్ రెడ్డి దంపతులు స్వామివారిని దర్శించుకొని తిరుగు ప్రయాణం కానున్నారు. తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి కుటుంబ సమేతంగా తిరుమలకు బయల్దేరడంతో, నేటి ఆయన కార్యక్రమాలన్నీ రద్దయినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. బుధవారం ఉదయం స్వామివారిని దర్శనానంతరం హైదరాబాద్‌కు తిరిగి వెళ్తారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.