ETV Bharat / state

రాష్ట్ర వ్యాప్తంగా సూపర్​ సిక్స్​ స్కీమ్స్ ప్రచారంతో దూసుకెళ్తోన్న టీడీపీ - TDP Candidates State Wide Campaigns

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 13, 2024, 7:45 PM IST

tdp_mla_candidates_state_wide_campaigns
tdp_mla_candidates_state_wide_campaigns

TDP MLA Candidates State Wide Campaigns : సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కూటమి అభ్యర్థులు ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. గడపగడపకూ తిరుగుతూ గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనను ఎండగడుతూ ముందుకు సాగుతున్నారు. అనేక ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ నుంచి తెలుగుదేశంలోకి చేరికలు భారీగా పెరిగాయి.

TDP MLA Candidates State Wide Campaigns : సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కూటమి అభ్యర్థులు ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. గడపగడపకూ తిరుగుతూ గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనను ఎండగడుతూ ముందుకు సాగుతున్నారు. అనేక ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ నుంచి తెలుగుదేశంలోకి చేరికలు భారీగా పెరిగాయి.

TDP Campaigns in Anantapur District : ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూటమి అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. శింగనమల నియోజకవర్గం నార్పల మండలంలో కూటమి అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ ప్రచారం నిర్వహించారు. మహిళలు, వృద్ధులకు తెలుగుదేశం సూపర్‌ సిక్స్‌ పథకాలు వివరించారు. ఇంటింటికీ తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతపురంలో కూటమి అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ 42వ డివిజన్‌లో ప్రచారం చేశారు. ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. పుట్టపర్తి ఏడో వార్డు వైఎస్సార్సీపీ కౌన్సిలర్‌ లక్ష్మీపతి ఆయన సోదరుడు రామారావు అనుచరులతో కలిసి తెలుగుదేశంలో చేరారు. మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకున్నారు. అంతకుముందు పట్టణంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

'స్టీల్​ ఫ్యాక్టరీ పరిరక్షిస్తాం- షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తాం' ఎన్నికల ప్రచారంలో కూటమి జోరు - Election Campaign in AP

Election Campaigns Road Shows in Nadyala : నంద్యాల జిల్లా డోన్ మండలం కమలాపురం వైకాపా సర్పంచ్ అర్జున్‌రెడ్డితో కలిసి 50 కుటుంబాలు తెలుగుదేశంలో చేరాయి. కూటమి అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి సమక్షంలో వీరు పార్టీ కండువా కప్పుకున్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారంలో నిరసన సెగ తగిలింది. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కుమార్తె ప్రియాంకను కౌతాళంలో మహిళలు నిలదీశారు. కాలనీలో సీసీ రోడ్డు, డ్రైనేజీల నిర్మాణం, తాగునీటి సమస్య పరిష్కరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రచార జోరు పెంచిన కూటమి అభ్యర్థులు- అధికార పార్టీ నుంచి భారీగా వలసలు - TDP intensify campaigns

Alliance Public Meeting in Avanigadda : కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్‌ కుమారుడు వెంకటరామ్‌ నాగాయలంకలో ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం సూపర్‌సిక్స్‌ పథకాలు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. గుడివాడ వైఎస్సార్సీపీ సీనియర్‌ నాయకుడు షేక్‌ మోలాలి కూటమి అభ్యర్థి వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో తెలుగుదేశంలో చేరారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో కూటమి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ భార్య కృష్ణ తులసి మహిళలతో కలిసి డోర్‌ టూ డోర్‌ ప్రచారం నిర్వహించారు.

రాష్ట్రంలో జోరందుకున్న ప్రచారం - హామీలు ఇస్తున్న పార్టీలు - All Parties Election Campaign

Ganta Srinivas Campaign in Visakha : విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలంలో మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు పర్యటించారు. రోడ్‌షో నిర్వహించి జగన్ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. అనకాపల్లి పార్లమెంటు పరిధిలో కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్‌ సతీమణి శ్రీదేవి మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సతీమణి పద్మావతి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. శ్రీకాకుళం ఎంపీ రామ్మెహన్‌ నాయుడు ఆధ్వర్యంలో సింగుపురం వైఎస్సార్సీపీ నేత గుండ మోహన్‌రావు అనుచరులతో కలిసి తెలుగుదేశంలో చేరారు.

జోరుగా ఎన్నికల ప్రచారం - ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్న నేతలు - ALL PARTIES ELECTION CAMPAIGN

రాష్ట్ర వ్యాప్తంగా సూపర్​ సిక్స్​తో టీడీపీ ప్రచార జోరు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.