ETV Bharat / state

జోరుగా టీడీపీ నాయకుల ఎన్నికల ప్రచారం - గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల వ్యూహం - Election Campaign in AP

TDP Leaders Election Campaign in AP : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నాయకులు ప్రచార జోరును పెంచారు. రాష్ట్రాభివృద్ధి, భవిష్యత్తు తరాలకు బంగారుబాట వేయాలంటే చంద్రబాబుకోనే సాధ్యం అంటూ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఇంటింటా తిరుగుతూ తమ పార్టీకి ఓటు వేయవలసిందిగా ఓటర్లును అభ్యర్థిస్తున్నారు.

election_campaign
election_campaign
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 27, 2024, 4:50 PM IST

TDP Leaders Election Campaign in YSR District : సీఎం జగన్​ ఐదేళ్ల పరిపాలనతో ప్రజలు బాగా విసుగు చెంది స్వచ్ఛందంగా తెలుగుదేశంలో చేరుతున్నారని తెలుగుదేశం అభ్యర్థి బీటెక్ రవి అన్నారు. కడప జిల్లా వేంపల్లి మండలం ముత్తుకూరులో 15 కుటుంబాలను పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం గ్రామంలో పర్యటిస్తూ సూపర్‌సిక్స్‌ పథకాలను ప్రజలకు వివరించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామంలోని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

Kurnool District : మే 13న జరిగే ఎన్నికల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ 14 ఎమ్మెల్యేలు, రెండు ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటుందని కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి బస్తిపాడు నాగరాజు తెలిపారు. రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారని నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.

హోరెత్తుతున్న ఎన్నికల ప్రచారం - ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థిస్తున్న నేతలు - Election Campaign In AP

Nellore District : నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతుల ప్రచారం జోరుగా సాగుతుంది. రామతీర్థంలో టీడీపీ-జనసేన-బీజేపీ కార్యకర్తలు వేమిరెడ్డి దంపతులకు ప్రజలు బ్రహ్మరధం పట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. రాక్షస పాలనను అంతమొందించేందుకు ఎన్నికల్లో ఐక్యంగా కష్టపడాల్సిన అవసరం ఉందని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ప్రజలు ప్రశాంతంగా జీవించాలన్నా, రాష్ట్రం అభివృద్ధి జరగాలన్నా కూటమి అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు.

జోరుగా టీడీపీ నాయకుల ఎన్నికల ప్రచారం - గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల వ్యూహం

వైఎస్సార్సీపీ 'వాలంటీర్లు'- ఎన్నికల ప్రచారంలో 'తగ్గేదేలే'- ఈసీ ఆదేశాలంటే లెక్కేలేదు! - Volunteers In Election Campaign

East Godavari District : రాబోయేది ఎన్నిక కాదు, రాష్ట్ర ప్రజల స్వేచ్ఛ కోసం జరుగుతున్న యుద్ధం అని తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో వైసీపీ కౌన్సిలర్​ షైక్​ ఫైజున్​తో పాటు మరో 120 కుటుంబాలు వైసీపీ వీడి టీడీపీలోకి చేరారు. వీరిని తాడిపత్రి అభ్యర్థి జేసీ అష్మిత్​ రెడ్డి, జేసీ ప్రభాకర్​ రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

NTR District : సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి కలిసి పనిచేసి ఘన విజయం సాధించాలని ఎన్టీఆర్​ జిల్లా నందిగామ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి సౌమ్య పేర్కొన్నారు. గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. టీడీపీ కార్యకర్తలంతా సమష్టిగా పని చేసి టీడీపీ కూటమి గెలిపించాలని అనంతపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్​ చౌదరి శ్రేణులకు పిలుపునిచ్చారు. టీడీపీ కూటమి అధికారంలో రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందో ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత పార్టీ శ్రేణుల మీద ఉందని పేర్కొన్నారు.

ఎన్నికల వేళ మళ్లీ జనం బాట పట్టిన జగన్ - ఇడుపులపాయ నుంచి బస్సుయాత్ర - JAGAN BUS YATRA

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.