ETV Bharat / state

అంబరాన్నంటుతున్న తమ్ముళ్ల సంబరాలు- విజయంపై ధీమా

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 25, 2024, 12:17 PM IST

TDP Leaders Celebrations in Overall State
TDP Leaders Celebrations in Overall State

TDP Leaders Celebrations in Overall State: శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణుల సంబరాలు మిన్నంటాయి. టికెట్ దక్కించుకున్న నేతలు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ నేతలు, కార్యకర్తలు బాణాసంచా కాలుస్తూ, స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు. ఎన్నికల్లో విజయం సాధిస్తామని పలువురు నేతల ధీమా వ్యక్తం చేశారు.

TDP Leaders Celebrations in Overall State: రాష్ట్రలో టీడీపీ- జనసేన తొలి జాబితా విడుదల సందర్భంగా టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. రాజమహేంద్రవరంలో తెలుగుదేశం తరఫున అర్బన్​ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదిరెడ్డి వాసును ప్రకటించడంతో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. తిలక్ రోడ్​లోని ఆదిరెడ్డి వాసు ఇంటి వద్ద భారీగా బాణాసంచా కాల్చి సంబరాలు చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్​ తనను టీడీపీ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు వాసు ధన్యవాదాలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీను ఓడించి తీరుతామని వాసు ధీమా వ్యక్తం చేశారు.

అంబరాన్నంటుతున్న టీడీపీ నేతల సంబరాలు- గెలుపు కోసం కృషి చేస్తామని వెల్లడి

Satya Sai Constituency: శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ టీడీపీ అభ్యర్థిగా సవితమ్మను ప్రకటించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నెలకొంది. పెనుకొండ పట్టణంలో ప్రధాన కూడల్లో బాణాసంచా పేల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సవితమ్మ మాట్లాడుతూ టీడీపీ బీసీల పార్టీగా మరోసారి నిరూపించుకుందన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ భారీ మెజార్టీతో గెలిచి చంద్రబాబు, లోకేశ్​కు మంచి గిఫ్ట్ ఇస్తామని పేర్కొన్నారు.

అంబరాన్నంటిన టీడీపీ- జనసేన నేతల సంబరాలు

Vizianagaram Constituency: విజయనగరం నియోజకవర్గ అభ్యర్ధిగా పూసపాటి అదితిగజపతి రాజు, గజపతినగరం అభ్యర్ధిగా కొండపల్లి శ్రీనివాసరావు పేర్లను ప్రకటించింది. ఇరువురిని పార్టీ కేడర్ శుభాకాంక్షలు తెలిపి పుష్పగుచ్చాలు అందజేశారు. బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కార్యకర్తలు భరోసా నిచ్చారు. రాజాం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసేందుకు మాజీ మంత్రి కోండ్రు మురళీమోహనకు అవకాశం కల్పించడంపై టీడీపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు.

వెనకబడిన వర్గాలకే టీడీపీ-జనసేన తొలి జాబితాలో పెద్దపీట

Kurnool Constituency: కర్నూలు జిల్లా పాణ్యం నియెజకవర్గం అభ్యర్థిగా గౌరు చరితారెడ్డి పేరును ప్రకటించడంతో కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. గౌరు చరితారెడ్డి ఇంటి వద్ద బాణా సంచా కాల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. పాణ్యంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేస్తామని టీడీపీ నేత పురుషోత్తంరెడ్డి అన్నారు.

Ananthapuram Constituency: అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్​ పేరును ప్రకటించడంతో ఉరవకొండ పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు బాణాసంచా కాల్చుతూ సంబరాలు జరుపుకున్నారు. జై పయ్యావుల జైజై పయ్యావుల అంటూ నినాదాలు చేశారు. కళ్యాణదుర్గం టీడీపీ టికెట్ గుత్తేదారు అమిలినేని సురేంద్రబాబుకు కేటాయించడంతో కార్యకర్తలు టీ కూడలికి చేరుకుని టపాసులు పేల్చి సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం తమవంతు కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. పొన్నూరు నియోజకవర్గం అభ్యర్థిగా ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పేరును చంద్రబాబు ప్రకటించడంతో నియోజకవర్గంలో సంబరాలు నిర్వహించారు. పట్టణంలోని ఐలాండ్ సెంటర్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ నాయకులు మిఠాయిలు పంపిణీ చేసుకున్నారు.

ఉభయగోదావరి జిల్లాలపైనే జనసేన ఫోకస్​ - భీమవరం నుంచే పవన్​ !

Tirupati Constituency: తిరుపతి జిల్లా సూళ్లూరుపేట అభ్యర్థిగా నెలవల విజయశ్రీ పేరు ప్రకటించడంతో ఇన్​ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం నివాసం వద్ద సంబరాలు జరుపుకున్నారు. వైద్యురాలు అయిన నెలవల విజయశ్రీ రాజకీయ ప్రవేశం చేపట్టారు. ఆమె తండ్రి నెలవల సుబ్రహ్మణ్యం నాలుగేళ్లుగా ఇన్​ఛార్జి కొనసాగుతున్నారు. యువతకు ప్రాధాన్యత ఇస్తూ నా కుమార్తెకు సీటు ఇవ్వడం జరిగిందని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి సమిష్టి గా కృషి చేస్తామన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ అభ్యర్థిగా ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిని ప్రకటించడంతో స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద టపాకాయలు కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం కనిగిరి పట్టణంలో పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు.

టీడీపీ తొలి జాబితాలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం

Mummidivaram Constituency: కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం అభ్యర్థిగా బుచ్చిబాబు పేరును ప్రకటించడంతో నియోజవర్గపరిధిలోని నాలుగు మండలాల్లో పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.. స్థానిక ఆలయాల్లో నాయకులు కొబ్బరికాయలు కొట్టి ముక్కులు చెల్లించుకున్నారు. భారీ కేక్​ను కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. మండల కార్యాలయాల వద్ద బాణసంచా పేల్చి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. కోనసీమ జిల్లాలో మొదట గెలిచే అభ్యర్థి బుచ్చిబాబు అని కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

తొలిసారి అసెంబ్లీకి పోటీ చేస్తున్న అభ్యర్థులు వీరే

Kadapa Constituency: కడప నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా మాధవి రెడ్డిని ప్రకటించారు. చంద్రబాబు సీట్లను ప్రకటించగానే నగరంలో ఇంటింటికి ప్రచారం చేస్తున్న మాధవి రెడ్డి, పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి పార్టీ నేతలు సంబరాలు జరుపుకున్నారు. కడప అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి నగర అభివృద్ధి కోసం కృషి చేస్తానని మాధవి రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కడపని వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడంలేదని ఎక్కడికక్కడ మురుగు కాలువలు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని అన్నారు. కడప పార్లమెంటు పరిధిలోని మెజార్టీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంటుందని శ్రీనివాసరెడ్డి భీమా వ్యక్తం చేశారు.

టీడీపీ-జనసేన తొలి జాబితాపై అభ్యర్థుల హర్షం - నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని స్పష్టం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.