ETV Bharat / state

ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై మా ప్రశ్నలకు సమాధానం ఎక్కడ జగన్: నీలాయపాలెం - Land Title Act in AP

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 6, 2024, 4:45 PM IST

TDP Leader Nilayapalem Vijayakumar on Land Titling Act: ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్​పై తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా చంద్రబాబు, లోకేశ్​పై కేసులు పెడతారా అని నీలాయపాలెం విజయకుమార్ మండిపడ్డారు. ప్రజల ఆస్తుల భూమి పత్రాలు ప్రైవేటు సంస్థలకు అప్పగించడంలో జగన్ ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు.

land_title_act
land_title_act (Etv Bharat)

TDP Leader Nilayapalem Vijayakumar on Land Titling Act: ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై తాము అడిగిన ప్రశ్నలకు నేటికీ సమాధానం లేదెందుకు జగన్ అని టీడీపీ నేత నీలాయపాలెం విజయకుమార్ నిలదీశారు. తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా చంద్రబాబు, లోకేశ్​పై కేసులు పెడుతారా అని మండిపడ్డారు. ఆస్తి క్రయ విక్రయాల తర్వాత భూమి పత్రాలు ఎక్కడ, ఎవరి వద్ద ఉంటాయని ప్రశ్నించారు. రివర్స్ బిడ్డింగ్ ద్వారా తమకు కాంట్రాక్టు వచ్చిందని క్రిటికల్ రివర్ సంస్థ బహిరంగ ప్రకటన ఇచ్చిందని అన్నారు.

జగన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా ప్రమాదకరం- నేనూ బాధితుడినే: విశ్రాంత ఐఏఎస్ అధికారి - IAS pv ramesh on land titling act

రివర్స్ టెండరింగ్ అని క్రిటికల్ రివర్ బహిరంగ ప్రకటన ఇచ్చింది అంటే క్రిటికల్ రివర్ కాంట్రాక్టు విలువ 100 కోట్లు దాటిందా అని విజయ్‌కుమార్‌ నిలదీశారు. భూమి పత్రాలు డిజిటలైజ్ చేసి భద్రపరిచేందుకు ముందుగా ఎన్ఐసీ పిలిచి తర్వాత క్రిటికల్ రివర్​కు ఎందుకిచ్చారని ప్రశ్నించారు. ఉచితంగా సాప్ట్ వేర్ ఇస్తామని వచ్చిన భాతర ప్రభుత్వ సంస్థ ఎన్ఐసీని కాదని కోట్లు ఖర్చు పెట్టి ఒక అన్ లిస్టెడ్ కంపెనీకి ఎందుకు కట్టబెట్టారని మండిపడ్డారు. ప్రజల ఆస్తులకు సంబంధించిన భూమి పత్రాలు యాజమాన్య బాధ్యతలు ప్రైవేటు సంస్థలకు అప్పగించడంలో జగన్ రెడ్డి ఉద్దేశం ఏంటని నిలదీశారు.

కౌలు రైతుల గోడు ప్రభుత్వానికి పట్టదా? - ఐదేళ్లుగా అప్పుల ఊబిలో రైతులు - Tenant farmers situation in AP

ప్రజల ఆస్థి పత్రాల భద్రతకు సంభందించిన అతి కీలకమైన పనిని జగన్‌ ఇష్టం వచ్చిన కంపెనీకి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ప్రజల ఆస్తులకు సంబంధించిన వ్యవహారంపై నిర్ణయం తీసుకునే ముందు బహిరంగ ప్రకటన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని విజయ్ కుమార్ నిలదీశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్​ను రద్దు చేస్తామని తెలిపారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్టుకు (Land Title Act in AP) అనుబంధంగా ఇచ్చిన ప్రతీ టెండర్ కూడా ఆటోమేటిక్ రద్దవుతాయని విజయ్‌ కుమార్‌ స్పష్టం చేశారు.

ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై మా ప్రశ్నలకు సమాధానం ఎక్కడ జగన్: నీలాయపాలెం (Etv Bharat)

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టుపై వ్యతిరేకత - రిజిస్ట్రేషన్లకు భయపడుతున్న జనం - Land Titling Act Problems

ఆస్తి క్రయ విక్రయాల తర్వాత భూమి పత్రాలు ఎక్కడ, ఎవరి వద్ద ఉంటాయి. రివర్స్ బిడ్డింగ్ ద్వారా తమకు కాంట్రాక్టు వచ్చిందని క్రిటికల్ రివర్ సంస్థ బహిరంగ ప్రకటన ఇచ్చింది. రివర్స్ టెండరింగ్ అని క్రిటికల్ రివర్ బహిరంగ ప్రకటన ఇచ్చిందంటే ఆ కాంట్రాక్టు విలువ 100 కోట్లు దాటిందా. భూమి పత్రాలు డిజిటలైజ్ చేసి భద్రపరిచేందుకు ముందుగా ఎన్ఐసిని పిలిచి తర్వాత క్రిటికల్ రివర్​కు ఎందుకు ఇచ్చారు. ఉచితంగా సాప్ట్ వేర్ ఇస్తామని వచ్చిన భాతర ప్రభుత్వ సంస్థ ఎన్ఐసీని కాదని కోట్లు ఖర్చు పెట్టి ఒక అన్ లిస్టెడ్ కంపెనీకి ఎందుకు కట్టబెట్టారు.- నీలాయపాలెం విజయకుమార్, టీడీపీ నేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.