ETV Bharat / state

జగన్​కు తల్లి, చెల్లి, బాబాయ్ అనే తేడా లేదు - షర్మిలకు భద్రత పెంచాలి: అయ్యన్నపాత్రుడు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 30, 2024, 3:48 PM IST

TDP leader Ayyanna Patrudu Allegations
TDP leader Ayyanna Patrudu Allegations

TDP leader Ayyanna Patrudu Allegations: షర్మిలకు ప్రాణ హాని ఉందని తెలుగుదేశం సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే షర్మిలకు సెక్యూరిటీ పెంచాలని డిమాండ్ చేశారు. రాజశేఖర్ రెడ్డి ఆస్తిలో షర్మిలకు వాటా రాశారని దాన్ని ఇవ్వకుండా జగన్ అడ్డుపడుతున్నారని అయ్యన్న విమర్శించారు.


TDP leader Ayyanna Patrudu Allegations: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్స్ షర్మిలకు భద్రత పెంచాలని టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు. ఆస్తుల విషయంలో జగన్​కు తల్లి, చెల్లి, బాబాయ్ అనే తేడా లేదని ఆరోపించారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఆమెను అంతమెందించినా ఆశ్చర్య పడక్కర్లేదని అందోళన వ్యక్తం చేశారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన అయ్యన్నపాత్రుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

జగన్​కు తల్లి, చెల్లి, బాబాయ్ అనే తేడా లేదు - షర్మిలకు భద్రత పెంచాలి: అయ్యన్నపాత్రుడు

ఆస్తులు చేజారిపోతే ఎలా: వైఎస్ రాజశేఖరెడ్డికి అత్యంత ప్రియమైనదిగా కూతురు షర్మిల అన్నది సన్నిహితులందరికి తెలుసనీ, అందుకే అమెకు ప్రత్యేకంగా ఆస్తిలో వాటా రాశారని అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఆ ఆస్తిని ఇవ్వకుండా జగన్ అడ్డుకుంటున్నారని అయ్యన్న ఆరోపించారు. ఈడీ అటాచ్ మెంట్ లో వున్న ఆస్తులు చేజారిపోతాయనే భయం జగన్ కి వుందని విమర్శించారు. ఆ ఆస్తులు చేజారిపోతే ఎలా అని, అందుకే షర్మిల కు వైయస్సార్ ఇచ్చిన వాటాను పంచకుండా ఆపుతున్నాడని అయ్యన్న తెలిపారు. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఇదే అంశంపై నోరు జారిన విషయాన్ని గమనించారా అంటూ కొత్త అంశాన్ని అయ్యన్న తెరపైకి తెచ్చారు. బాబాయ్ లాంటి ఘటనలు జరుగుతాయంటూ సజ్జల అన్నవిషయాన్ని గుర్తు చేశారు. తనకు ప్రాణహాని వుందని రివాల్వర్ లైసెన్స్ కు రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్నానని అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. ఎస్పీ గన్​మెన్​ను ఇస్తామన్నారని, కానీ, తానే వద్దని చెప్పానన్నారు. ఎందుకంటే తాను ఎక్కడ వున్నానో వారే ఉప్పందిస్తారనే భయం తనకు ఉందన్నారు.
వైఎస్సార్​ పాలనతో జగన్​కు పోలికే లేదు- బీజేపీకి బానిసలా మారిన వైసీపీ : షర్మిల

ఉత్తరాంధ్రకు ఏం చేశారో చెప్పగలరా?: సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్రకు ఏం చేశారో చెప్పగలరా అంటూ అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ నేతలు భూములు కనిపిస్తే బెదిరించి లాక్కుంటున్నారని ఆరోపించారు. ఆ పార్టీ నేతల అక్రమాలు, దౌర్జన్యాలకు అంతే లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నాలుగున్నరేళ్లలో ఉత్తరాంధ్రకు ఏం చేశారని సభ పెట్టారంటూ విమర్శించారు.

భూములను కబ్జా చేయడమే వైఎస్సార్సీపీ పనిగా పెట్టుకుందని అయ్యన్నపాత్రుడు విమర్శించారు. విశాఖ బీచ్‌ రోడ్డు నుంచి భీమిలి వెళ్లే వరకు ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయని అయ్యన్న పేర్కొన్నారు. ఇంతలా అక్రమాలకు పాల్పడుతుంటే ప్రజలు ఎందుకు మీకు ఓట్లేయాలంటూ అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. స్వంత పార్టీ నేతలే భూ దోపిడీపై ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. పార్టీలతో సంబంధం లేకుండా అన్ని పార్టీలు వైఎస్సార్సీపీ నేతలు చేస్తున్న భూ దోపిడీపై పోరాడాలని పిలుపునిచ్చారు. భూములు దోచుకున్న ఎవ్వరినీ వదిలిపెట్టేదే లేదని అయ్యన్న హెచ్చరించారు. మూడు నెలలైతే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇంటికి పోతుందని, మూడు నెలల తర్వాత అందరి లెక్కలు తీస్తామంటూ పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత జగన్‌ లండన్‌, అమెరికాలో దాక్కున్నా లాక్కొస్తామని అయ్యన్నపాత్రుడు హెచ్చరించారు.

అన్నపై పోటీకి సిద్ధం! - సునీత కాంగ్రెస్​లో చేరేందుకు డేట్ ఫిక్స్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.