ETV Bharat / state

'మేం చదువుకోవద్దా?- సీట్లు పెంచుతారో? కాలేజీలు పెంచుతారో చెప్పండి' - paderu gurukulam seats

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 23, 2024, 1:26 PM IST

Inadequate Seats in Paderu Gurukula Junior Colleges : విద్యార్థులు పెరుగుతున్నా చదువుకునే అవకాశాలు అందుబాటులో లేవంటున్నారు ఆ ప్రాంత వాసులు. ఇంగ్లిష్​ మీడియం చదివినా సీట్​ దక్కలేదని వాపోతున్నారు. ఉన్న కళాశాలలో సీట్లు పెంచుతారా, లేక కాలేజీల సంఖ్య పెంచుతారా సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

inadequate_seats_in_paderu_gurukula_junior_colleges
inadequate_seats_in_paderu_gurukula_junior_colleges (ETV Bharat)

Inadequate Seats in Paderu Gurukula Junior Colleges : పాడేరు ప్రాంతంలో చదువుకున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నా అందుకు అనుగుణంగా కళాశాలల్లో సీట్లు పెరగడం లేదు. దీంతో విద్యార్థుల భవిష్యత్‌ అగమ్యచోరంగా మారుతోంది. కళాశాలలు ప్రారంభించి దశాబ్దాలు గడుస్తున్నా. అవే కళాశాలలు, అవే సీట్లు అంటూ విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. ఆంగ్ల మాధ్యమంలో చదివినా సీట్లు రాలేదని మరికొందరు ఆందోళన చెందుతున్నారు. గిరిజన ప్రాంత విద్యార్థుల కోసం ఆంధ్రప్రదేశ్ గిరిజన గురుకుల సొసైటీ 45 ఏళ్ల కిందట పాడేరు ఏజెన్సీలో బాలికలకు 3, బాలురకు 6 గిరిజన గురుకుల కళాశాలలు ప్రారంభించింది.

ప్రతి విభాగంలో 40 సీట్లు ప్రవేశపెట్టారు. అప్పటినుంచి ఇప్పటికీ ఆ సీట్ల సంఖ్య పెంచలేదు. 5 వేల మంది దరఖాస్తు చేసుకోగా మంగళవారం, బుధవారం కౌన్సిలింగ్‌ నిర్వహించారు. డబ్బులు వెచ్చించి సుదూర ప్రాంతాల నుంచి వందల మంది విద్యార్థులు పాడేరు చేరుకున్నారు. కానీ 460 మార్కులు దాటితే గాని సీటు లేదని చెప్పడంతో చాలా మంది నిరాశకు గురయ్యారు. మళ్లీ రెండో కౌన్సిలింగ్ ఉంటుందంటూ చెప్పి పంపించి వేశారు. గిరిజన గురుకులాల్లో మంచి విద్య అందుతుందని ఆశతో వస్తే ఇలా నిరాశ ఏర్పడిందని బాధపడుతున్నారు.

YSRCP Govt Neglecting SC People: రాష్ట్రంలో ఎస్సీ ప్రజలను.. వారి విద్యను పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం..

'మేం చదువుకోవద్దా?- సీట్లు పెంచుతారో? కాలేజీలు పెంచుతారో చెప్పండి' (ETV Bharat)

440 మార్కులు వచ్చినా సీటు ఇవ్వలేదు. ఇంగ్లిష్​ మీడియంలో చదివినా ఇదే పరిస్థితి. కౌన్సిలింగ్​ అంటే మారుమూల గ్రామాల నుంచి వచ్చి పోతున్నాము, ఛార్జీలకే కూలీ డబ్బులు సరిపోతున్నాయి అయినా పిల్లలకు కాలేజీ సీటు వస్తుందని వచ్చినా నిరాశే మిగిలింది. ప్రైవేటు కళాశాలలో చదివించే స్థోమత లేదు. ఉన్న దాంట్లో అవకాశం రాదు ఇలా అయితే మా పిల్లల జీవితం ఏమైపోవాలి. అధికారులు స్పందించి మా సమస్యకు పరిష్కారం చూపాలి. - బాధితులు

గ్యాస్‌ స్థాయి నుంచి కట్టెలతో వంటచేసే దుస్థితికి గురుకులాలు- బకాయిలే సంస్కరణలా జగన్ మామయ్య?

ఒకప్పుడు విద్యార్థులు లేక పాఠశాలలు, కళాశాలలు వెలవెలబోయేవి. పిల్లల్ని బడి బాట పట్టించడానికి ఉపాధ్యాయులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించేవారు. అయినా సరైన సంఖ్యలో విద్యార్థులు వచ్చేవారు కాదు. కానీ నేడు చదువుకోవాలని ఆశపడుతున్న వారికి అవకాశం లేకుండా పోతుందని పాడేరు వాసులు వాపోతున్నారు.

చదువు, విశ్రాంతి, భోజనాలు తరగతి గదులే సర్వస్వం - గురుకులాల్లో జగనన్న వసతి కష్టాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.