'మేమే కార్మికులం, మేమే యజమానులం' - వ్యాపారంలోనూ అతివల సత్తా

author img

By ETV Bharat Telangana Desk

Published : Feb 6, 2024, 9:55 PM IST

Sarvodhaya Women Entrepreneurs-Gonglur

Sarvodaya Manjeera Women Entrepreneurs : ప్రస్తుతమున్న పోటీ ప్రపంచంలో పురుషులతో పాటు మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. చదువు, ఉద్యోగాలతో పాటు వ్యాపారాల్లోనూ తగ్గేదేలే అంటున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకుంటూ స్వయంగా పెట్టుబడి పెట్టి పరిశ్రమను స్థాపించారు సంగారెడ్డి జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన మహిళలు. నాణ్యతే ప్రామాణికంగా పనిచేస్తూ "మంజీరా ప్రోడక్ట్స్‌" పేరుతో కొబ్బరి, పల్లీ, కుసుమ వంటి నూనెలు తీస్తూ మార్కెట్లోకి తీసుకొస్తున్నారు.

'మేమే కార్మికులం, మేమే యజమానులం' - వ్యాపారంలోనూ అతివల సత్తా

Sarvodaya Manjeera Women Entrepreneurs : సంగారెడ్డి జిల్లా పుల్‌కల్‌ మండలంలోని గొంగులూరును ఐఆర్​ఎస్(IRS)​ అధికారులు నాలుగేళ్ల క్రితం దత్తత తీసుకున్నారు. గ్రామస్థులకు విద్యా, వైద్యంపై అవగాహన కల్పిస్తూ కావాల్సిన అవసరాలు తీరుస్తున్నారు. ఈ క్రమంలోనే స్వయం సహాయక మహిళల ఆధ్వర్యంలో 'సర్వోదయ మహిళ పారిశ్రామిక కోపరేటీవ్‌' అనే పరిశ్రమ ఉద్భవించింది. గ్రామస్థులు పూర్తి సహాయ సహకారంతో పరిశ్రమకు ముందడుగు పడింది. కేంద్రం ప్రవేశపెట్టిన ఆత్మనిర్భర్ దిశగా గ్రామస్థులు అడుగులు వేశారు. ఈ పరిశ్రమలో మెుత్తం 153 మంది పెట్టుబడిదారులు ముందుకు వచ్చి వారి స్థోమతకు తగిన షేర్లను కొనుగోలు చేసుకున్నారు.

పరిశ్రమలో రోజు కూలీ చేసుకునే వారికి కూడా పెట్టుబడికి అవకాశం దక్కింది. అక్కడ పనిచేయడాకి కూడా స్థానికంగా ఉన్న షేర్‌ హోల్డర్‌ ముందుకు వచ్చారు. రసాయనాలను ఉపయోగించి సబ్బులు, డిటర్జంట్లను(Detergents) తయారు చేయడానికి కెమికల్‌ ప్రొడక్షన్‌ మేనేజర్‌గా మహారాష్ట్రకు చెందిన యువతి పనిచేస్తోంది. పరిశ్రమకు వచ్చిన లాభాలతోపాటు కూలీ కూడా దక్కడంతో ఆర్థికంగా కొంత చేయూత లభిస్తుందని మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Sarvodhaya Women Entrepreneurs-Gonglur : గ్రామంలో పండిన పంటలను స్వయంగా సర్వోదయ మంజీరా అనే పరిశ్రమలో విక్రయించడంతో అన్నదాతకు కూడా కొంత ఆదాయం లభిస్తుంది. పైగా పండిన పంటను సకాలంలో రైతుల వద్దకు వెళ్లి నేరుగా పరిశ్రమదారులు కొనుగోలు చేస్తున్నారు. గ్రామంలో పరిశ్రమ స్థాపించడంతో తమతోపాటు ఉపాధిలేని వారికి ఊరట కలిగించినట్టు ఉందని ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మహిళలే పారిశ్రామిక వేత్తలుగా చూడాలనేదే తమ లక్ష్మమని, ఈ క్రమంలోనే మంజీరా ఉత్పత్తులు తయారవుతున్నాయని వ్యవస్థాపకులు తెలిపారు. ఇప్పటికే ఉత్పత్తుల ద్వారా కోటి రూపాయల టర్నోవర్ జరిగినట్లు వెల్లడించారు. గ్రామంలో పరిశ్రమ పెట్టడంతో ఆర్థికభారం తగ్గిందని మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

'ప్రస్తుతం కల్తీ వ్యవహారం ఎక్కువగా ఉంది. దీని వల్ల ప్రజలు అనారోగ్యానికి పాలవ్వకుండా ఇక్కడ ప్రోడెక్ట్స్​ మంచిగా తయారు చేసి ప్రజలకు అందిస్తున్నాం. దీనితో పాటు నిరుద్యోగ సమస్య. ముఖ్యంగా మహిళలతో పాటు చాలా మందికి ఉద్యోగం కల్పించాలనే ఉద్దేశంతో ఈ కంపెనీ ప్రారంభించాం'- రాజేందర్‌ రెడ్డి, ప్రొడక్షన్‌ మేనేజర్‌

'గత నాలుగు సంవత్సరాలుగా ఒక గ్రామాన్ని అడాప్ట్​ చేసుకుని, స్వయం స్వయక మహిళల ఆధ్వర్యంలో సర్వోదయ మహిళల పారిశ్రామిక అనే కోపరేటీవ్‌​ను సార్ట్​ చేశాం. ఈ కోపరేటీవ్‌​ ఏంటంటే ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆత్మనిర్భర్ భారత్​ దిశగా మేము 153 మహిళలతో సర్వోదయ మహిళల పారిశ్రామికను ప్రారంభించాం. ఇందులో 153 మంది మహిళలు పెట్టుబడుదారులు వాళ్లే, ఎంప్లాయిస్​​ కూడా వాళ్లే' - డా.సుధాకర్ నాయక్‌, సర్వోదయ మంజీర పరిశ్రమ వ్యవస్థాపకులు

20 సినిమాల్లో 50 పాటలు - ఈ యువ రచయిత సక్సెస్​ స్టోరీ తెర వెనక కష్టాలు తెలుసుకోవాల్సిందే

చేనేత కుటుంబ నుంచి ఎన్​సీపీ అధికారిగా ఎదిగిన కుర్రాడిపై యువ కథనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.