ETV Bharat / state

చినుకు పడితే చిగురుటాకులా వణుకుతున్న బెజవాడ- లోతట్టు ప్రాంతాలు జలమయం - SANITATION PROBLEM

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 27, 2024, 9:32 AM IST

Vijayawada Sanitation Problem : విజయవాడలో చిన్నపాటి వర్షానికే లోతట్టు ప్రాంతాలు నీటమునుగుతున్నాయి. ఎక్కడ కాలుపెడితే ఏం జరుగుతుందోనని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాల్వల్లో పూడికతీత చేపడితే ఈ పరిస్థితి ఉండదంటున్నారు. నగర పాలక సంస్థ అధికారులు ఆ దిశగా దృష్టి పెట్టడం లేదని వాపోతున్నారు.

drainage_system
drainage_system (ETV Bharat)

Vijayawada Sanitation Problem : వానొస్తే చాలు విజయవాడ వాసులు బెంబెలెత్తుతున్నారు. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమై ఎక్కడ కాలుపెడితే ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. కాల్వల్లో పూడికతీత చేపడితే ఈ పరిస్థితి ఉండదని నగరపాలక సంస్థ అధికారులు ఆ దిశగా ప్రణాళికలు అమలు చేయడం లేదని వాపోతున్నారు.

చినుకు పడితే చాలు విజయవాడ వాసులు చిగురుటాకులా వణికిపోతారు. ఏటా వర్షాకాలంలో కొన్ని ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. పడమట లంక, కరెన్సీ నగర్, మదర్ థెరిస్సా కూడలి, డీవీ మేనర్ రోడ్డు, జమ్మిచెట్టు సెంటర్, మొగల్రాజపురం, పిన్నమనేని పాలీక్లినిక్ రోడ్డులో వర్షం పడితే నీరు నిలిచిపోతోంది. మధురానగర్‌, లయోలా కళాశాల రోడ్డు, ఆటోనగర్, బృందావన్ కాలనీ, విద్యాధరపురం అంబేడ్కర్ రోడ్డు, సితార కూడలి నుంచి కబేళా రోడ్డు, పాతబస్తీ, గణపతిరావు రోడ్డు నుంచి జెండాచెట్టు, సుబ్బరామయ్య వీధి, గాంధీ హిల్ నుంచి హనుమాన్ పేట ముంపునకు గురవుతాయి. బైపాస్ నుంచి బుడమేరు వరకు, నైజాం గేటు నుంచి కాంసాలిపేట వరకు ప్రజలకు వర్షాకాలంలో నరకయాతనే. ఏటా వానా కాలంలో రహదార్లు, కాల్వలు ఏకమవుతున్నాయి.
విజయవాడ బైపాస్‌ రోడ్డు నిర్మాణంలో జాప్యం - ఇంకా మోక్షం ఎప్పుడో? - Vijayawada West Bypass Road


విజయవాడ నగరంలో రోజుకు ఉత్పత్తి అయ్యే వ్యర్థాల్లో 20 మెట్రిక్​ టన్నుల మట్టి, వ్యర్థాలు నేరుగా డ్రెయిన్లలోకి చేరిపోతున్నాయి. పలువురు వ్యాపారులు, హోటళ్ల యజమానులు వ్యర్థాలను నేరుగా డ్రెయిన్లలో వేస్తున్నారు. వీటిని నిలువరించడంలో క్షేత్రస్థాయి అధికారులు విఫలం అవుతున్నారు. ఫలితంగా నీరు డ్రైన్ల నుంచి రోడ్లపైకి చేరుతోంది.

విజయవాడ నగరంలో సమస్యలు విలయతాడవం - ఎన్నికల హడావుడిలో స్తంభించిన వీఎంసీ పాలన - Sanitation Problem In Vijayawada

చినుకు పడితే చిగురుటాకులా వణుకుతున్న బెజవాడ- లోతట్టు ప్రాంతాలు జలమయం (ETV Bharat)

గతంలో కాలువలను శుభ్రం చేసేందుకు 10 నుంచి 15 మంది పారిశుద్ధ్య సిబ్బంది గ్యాంగ్ వర్క్స్ నిర్వహించేవారు. కొద్దికాలంగా దీనికి అధికారులు మంగళం పాడారు. దీంతో సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఏటా 25 నుంచి 50 కిలోమీటర్ల మేర డ్రైయిన్ల పూడిక తీసేందుకు రెండున్నర నుంచి 3 కోట్ల వ్యయం చేస్తున్నారు. కనిష్ఠంగా ప్రతి నియోజకవర్గంలో 80 లక్షలు వెచ్చిస్తున్నారు. ఈ ఏడాది దాదాపు 3 కోట్ల అంచనాలతో టెండర్లు పిలిచారు. కానీ వేసవిలో పనులు మొదలు కాలేదు. ప్రస్తుతం వర్షాలు మొదలు కావడంతో కార్పొరేషన్ యంత్రాలు, సిబ్బందితో పూడికలు తీస్తున్నారు. నగర అధికారులు పూడికతీత పనులకు జనవరి - ఫిబ్రవరి మధ్యలో ఆలోచన చేయాలి. కానీ జూన్, జులైలో పనులు చేస్తున్నారు. ఫలితంగా వర్షం పడగానే తీసిన వ్యర్థాలు తిరిగి డ్రెయిన్లలోకి చేరి సమస్య మొదటికొస్తుంది.

చెంతనే కృష్ణమ్మ - అయినా తప్పని తాగునీటి తిప్పలు - Vijayawada Water Issue

వర్షాలు వచ్చినప్పుడు అధికారులు హడావుడి చేయడం తప్ప ప్రణాళికలు అమలు పరచడం లేదని నగరవాసులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ముంపుపై ముందుచూపుతో వ్యవహరించి కాల్వల పూడికతీత, ఆధునీకరణ పనులు త్వరగా చేపట్టాలని కోరుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.