ETV Bharat / state

బ్యాంకులకే మోసం - రాజధానిలో నివాస గృహాలు పూర్తైనట్లు జీవో విడుదల

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 16, 2024, 7:47 PM IST

Residential Houses in Capital: రాజధానిలో నివాస గృహాల ప్రాజెక్టులకు రుణాలిచ్చిన బ్యాంకర్లను జగన్‌ ప్రభుత్వం బురిడీ కొట్టించింది. అందినకాడికి అడ్డగోలుగా అప్పులు తెచ్చి ఇప్పటికే రాష్ట్ర పరువును బజారుకీడ్చిన వైఎస్సార్సీపీ సర్కార్‌ బ్యాంకులనూ మోసం చేయడం మొదలు పెట్టేసింది. ఇప్పటి వరకు గ్రాఫిక్స్ అంటూ ప్రచారం చేసిన భవనాల్లోనే ఉద్యోగులు నివాసం ఉంటున్నారని చెప్పడమే గాక వాటిపైనా అద్దె కూడా వస్తోందంటూ మాయ చేస్తోంది. తాగునీరు, కరెంటులేని భవనాల్లోనే అధికారులు ఉంటున్నారని బ్యాంకులను నమ్మబలుకుతోంది.

Residential_Houses_in_Capital
Residential_Houses_in_Capital

Residential Houses in Capital : అమరావతిలో గత ప్రభుత్వం ప్రజా ప్రతినిధులు, అధికారుల కోసం బహుళ అంతస్తుల నివాస సముదాయాలు నిర్మాణాలను 70శాతం మేర పూర్తి చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక వాటి నిర్మాణాలను అర్ధాంతరంగా ఆపివేసింది. ఇప్పుడా భవన సముదాయాల నిర్మాణం పూర్తయిందని, ప్రజాప్రతినిధులు, అధికారులు నివసిస్తున్నారని తప్పుడు పత్రాలు సృష్టించింది. భవనాల నిర్మాణం కోసం తీసుకున్న అప్పు చెల్లించకపోవటంతో నిరర్థక ఆస్తులుగా మిగిలే ప్రమాదం ఏర్పడటమే దీనికి కారణం. అనుకున్న సమయానికి నిర్మాణాలు పూర్తి కాలేదంటే తీసుకున్న 1,950 కోట్ల రుణాన్ని వడ్డీతో ఏకకాలంలో బ్యాంకులకు చెల్లించాల్సిఉంటుంది. అంత చెల్లించే పరిస్థితి లేకపోవటంతో గతేడాది ఫిబ్రవరి నుంచి డిసెంబరు వరకు అద్దె కింద 69.36 కోట్ల మొత్తాన్ని రుణ చెల్లింపులో భాగంగా సీఆర్‌డీఏకు జమ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇలా అధికారులు, బ్యాంకుల అధికారులు కుమ్మక్కై వైఎస్సార్సీపీ సర్కారును బకాయిల చెల్లింపు, ఎన్‌పీఏ ప్రమాదం నుంచి గట్టెక్కించారు.

రాజధాని రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్లు - సీఆర్డీఏ మూడో విడత లాటరీ

అమరావతి అంతా గ్రాఫిక్స్‌ అంటూ ప్రచారం చేసి ఇప్పుడు నిర్మాణాలు పూర్తయ్యాయని చెప్పడం కంటే ఆశ్చర్యం మరొకటి ఉంటుందా కానీ సీఆర్‌డీఏ, సాధారణ పరిపాలన శాఖలు అలాగే నమ్మిస్తున్నాయి. స్పృహ ఉండే ఇదంతా చేస్తున్నారా ? ఇప్పుడు కాకుంటే మరో రెండు నెలల తర్వాతైనా విచారణ చేయిస్తే బాధ్యులంతా ఇరుక్కుంటామనే భయం కూడా లేదు. వైఎస్సార్సీపీ పాలనలో అమరావతి ప్రాంతంలో ఒక్క తట్ట మట్టి ఎత్తలేదని అందరికీ తెలుసు. కానీ ప్రభుత్వ అధికారులు మసిపూసి మారేడు కాయ చేస్తూ అడ్డంగా నివేదికలు ఇచ్చేస్తున్నారు. ఇంతలా జగన్నాటకం ఆడాల్సిన పనేంటని ఆ నిర్మాణాలు పూర్తి చేస్తే సరిపోతుంది కదా అని రాజధాని రైతులు ప్రశ్నిస్తున్నారు.

ఒప్పందంలో భాగంగా 2023 ఫిబ్రవరి నాటికి అమరావతిలో నిర్మాణాలు పూర్తి చేయాలి. కానీ జగన్ సర్కార్ అర్థాంతరంగా నిర్మాణాలు నిలిపివేసింది. కానీ భవనాలన్నిటిని పూర్తి చేశామని సీఆర్‌డీఏ అధికారులు ధ్రువీకరించేశారు. వైసీపీ సర్కార్‌ తీరుపై అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

'రాజధాని ప్రాంతంలో మితిమీరిన అక్రమాలు - బాధితులపైనే పోలీసు కేసులు'

అమరావతిలో అసలు నిర్మాణమే పూర్తి కాని భవనాలకు అద్దెల చెల్లింపు కోసం సీఆర్​డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ లేఖ రాయడం పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి ఆ డబ్బులు ఇవ్వాలని సాధారణ పరిపాలన శాఖకు చెప్పడం బరితెగింపు కాదా అంటూ తెలుగుదేశం నేతలు మండిపడుతున్నారు.

హౌసింగ్‌ ప్రాజెక్టు నిరర్థక ఆస్థిగా మిగిలిందా అంతే సంగతి - జగన్‌ సర్కారు వైఖరితో రుణ సంక్షోభంలో సీఆర్డీఏ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.