ETV Bharat / state

రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్‌బీఐ హెచ్చరిక - రుణం తీసుకునే సంస్థలపై పట్టు ఉండాలని సూచన

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 20, 2024, 3:12 PM IST

RBI Working Group Instructions to State Governments : రాష్ట్ర ప్రభుత్వాలు రుణాల కోసం వివిధ కార్పొరేషన్లకు ఇచ్చే గ్యారంటీలు రాష్ట్రాల ఆరోగ్యకరమైన ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపేలా ఉండకూదని ఆర్​బీఐ వర్కింగ్‌ గ్రూప్‌ పేర్కొంది.

RBI_Working_Group_Instructions_to_State_Governments
RBI_Working_Group_Instructions_to_State_Governments
రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్‌బీఐ హెచ్చరిక - రుణం తీసుకునే సంస్థలపై పట్టు ఉండాలని సూచన

RBI Working Group Instructions to State Governments : రాష్ట్ర ప్రభుత్వాలు రుణాల కోసం వివిధ కార్పొరేషన్లకు ఇచ్చే గ్యారంటీలు రాష్ట్రాల ఆరోగ్యకరమైన ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపేలా ఉండకూదని ఆర్​బీఐ (Reserve Bank of India) వర్కింగ్‌ గ్రూప్‌ పేర్కొంది. గరిష్ఠ పరిమితిని నిర్దేశించుకోవాలని సూచించింది. సామాజిక, ఆర్థిక ప్రయోజనాలు కీలకమని చెప్పింది. గ్యారంటీ రుణాలపై అప్రమత్తత లేకుంటే ముప్పు తప్పదని హెచ్చరించింది.

RBI Instructions For States On Loans : ఆర్‌బీఐ వర్కింగ్‌ గ్రూపు రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక సూచనలు చేసింది. రుణాల కోసం కార్పొరేషన్లకు ఇచ్చే గ్యారంటీలు రాష్ట్రాల ఆరోగ్య ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపేలా ఉండకూడని పేర్కొంది. ఏటా ఎంతమేరకు గ్యారంటీలు ఇవ్వాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వాలు గరిష్ఠ పరిమితిని నిర్దేశించుకోవడం అవసరమని సూచించింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి - జీఎస్​డీపీ (Gross State Domestic Product)లో 0.5 శాతం లేదా రెవెన్యూ రాబడుల్లో 5శాతం ఏది తక్కువైతే అంతకంటే తక్కువ మేర గ్యారంటీలను మాత్రమే ఏటా పెంచుకునేలా పరిస్థితి ఉండాలని స్పష్టం చేసింది.

'ఆదాయం కంటే అప్పులే ఎక్కువ - మద్యం ఆదాయంతో ఆ నాలుగు పథకాలకు నిధులు'

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాల గ్యారంటీలపై అధ్యయనం కోసం ఆర్​బీఐ నియమించిన నిపుణులతో కూడిన వర్కింగ్‌ గ్రూప్‌ నివేదికను అందజేసింది. హరియాణా, జమ్ము - కశ్మీర్‌, ఒడిశా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికశాఖల కార్యదర్శులు, కాగ్‌ డైరెక్టర్ జనరల్‌, కేంద్ర ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి, ఆర్‌బీఐ సీజేఎమ్​తో కూడిన వర్కింగ్ గ్రూప్‌ రాష్ట్ర ప్రభుత్వాల గ్యారంటీలను విశ్లేషించి పలు సూచనలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వాల గ్యారంటీలు, సమస్యలు - సవాళ్లు, ప్రస్తుత స్థితి, ముందుకు వెళ్లే అవకాశాలు వంటి అంశాలపై సమగ్ర నివేదికను రూపొందించింది.

AP Debts Crossing Limits: పరిమితికి మించిన అప్పుల్లో ఆంధ్ర.. అస్తవ్యస్థంగా ఆర్థిక పరిస్థితి.. అయినా తగ్గేదేలే అంటున్న జగన్ సర్కార్

గరిష్ఠ పరిమితిని నిర్దేశించుకోవాలని సూచన : రాష్ట్ర ప్రభుత్వాలువి విధ కార్పొరేషన్ల రుణాల కోసం ఇచ్చే గ్యారంటీల్లో అప్రమత్తంగా వ్యవహరించకుంటే అవి రాష్ట్రాలను ఆర్థికంగా తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తాయని నిపుణుల కమిటీ హెచ్చరించింది. గ్యారంటీలు ఇచ్చేటపుడు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. గ్యారంటీలపై గరిష్ఠ పరిమితి ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టత ఉండటమే కాకుండా పారదర్శకత ఉంటుందని వివరించింది. గ్యారంటీలకు చట్టబద్ధత కూడా అవసరమని స్పష్టం చేసింది. కొన్ని రాష్ట్రాలు మాత్రం గరిష్ఠ పరిమితిని నిర్దేశించుకుంటున్నా దేశ వ్యాప్తంగా ఒకే విధానం లేదని పేర్కొంది. గ్యారంటీలకు సంబంధించి రెవెన్యూ రాబడులు, రాష్ట్ర స్థూల ఉత్పత్తిని ప్రాతిపదికగా తీసుకుని నిర్ణయించాలని కీలక సూచనలు చేసింది.

AP Debts Crossing Limits అప్పు ఆదాయంగా మారడంలేదు.. అప్పుగానే మిగిలిపోతోంది! ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తం.. అయినా తగ్గేదేలే అంటున్న సర్కార్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.