ETV Bharat / state

వైఎస్సార్‌ పేరును సీబీఐ ఛార్జిషీట్‌లో కాంగ్రెస్‌ చేర్చలేదు- ఏపీకి పదేళ్లపాటు ప్రత్యేక హోదా : రాహుల్‌గాంధీ - rahul gandhi kadapa public meeting

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 11, 2024, 2:21 PM IST

Updated : May 11, 2024, 3:13 PM IST

Rahul Gandhi Kadapa Public Meeting: తాము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్​కి పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. కడపలో కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచార సభ రాహుల్ పాల్గొని ప్రసంగించారు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే విప్లవాత్మక మార్పులు తెస్తామన్న రాహుల్, రెండు లక్షల రుణమాఫీ, కేజీ టు పీజీ విద్య, రెండున్నర లక్షల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చారు. షర్మిల తన చెల్లెలు అని, ఆమెను గెలిపించి లోక్‌సభకు పంపించాలని కోరారు.

Rahul Gandhi Kadapa Public Meeting
Rahul Gandhi Kadapa Public Meeting (ETV Bharat)

Rahul Gandhi Kadapa Public Meeting: రాజశేఖర్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ ఒక్కటే అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. కడపలో కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచార సభ రాహుల్ పాల్గొని ప్రసంగించారు. రాజశేఖర్‌రెడ్డి నా తండ్రికి సోదరుడు వంటివారని అన్నారు. రాజీవ్‌గాంధీ, రాజశేఖర్‌రెడ్డి అన్నదమ్ముల్లా ఉండేవారని తెలిపారు. రాజశేఖర్‌రెడ్డి ఏపీకే కాదు. మొత్తం దేశానికే దారి చూపించారని కొనియాడారు. భారత్‌ జోడో యాత్రకు వైఎస్సార్‌ పాదయాత్రే స్ఫూర్తి అని అన్నారు. భారత్‌ మొత్తం పాదయాత్ర చేయాలని వైఎస్సారే నాకు చెప్పారన్న రాహుల్‌గాంధీ, వైఎస్‌ఆర్‌ తండ్రిలా తనకు మార్గదర్శనం చేశారన్నారు. పాదయాత్రల ద్వారానే ప్రజల సమస్యలు తెలుస్తాయని వైఎస్‌ చెప్పారన్నారు.

ఈ ముగ్గురి రిమోట్‌ కంట్రోల్‌ మోదీ చేతిలోనే ఉంది: వైఎస్సార్‌ చేసిన సంక్షేమ రాజకీయం ఇప్పుడు ఏపీలో లేదన్న రాహుల్‌గాంధీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయం పూర్తిగా మారిపోయిందని అన్నారు. వైఎస్సార్‌ ఏపీ స్వరాన్ని దిల్లీలో వినిపించేవారని పేర్కొన్నారు. ఇప్పుడు ఏపీని బీజేపీ బీ టీమ్‌ నడిపిస్తోందని వ్యాఖ్యానించారు. బీజేపీ బీ టీమ్‌ అంటే చంద్రబాబు, జగన్‌, పవన్‌ అని విమర్శించారు. ఈ ముగ్గురి రిమోట్‌ కంట్రోల్‌ మోదీ చేతిలోనే ఉందని పేర్కొన్నారు.

కేసులే మౌనానికి కారణం: మోదీ చేతిలో సీబీఐ, ఈడీ ఉన్నందునే ఈ ముగ్గురి కంట్రోల్‌ ఆయన చేతిలో ఉందని విమర్శించారు. రాజశేఖర్‌రెడ్డి సిద్ధాంతమే కాంగ్రెస్‌ సిద్ధాంతమని స్పష్టం చేశారు. రాజశేఖర్‌రెడ్డి సిద్ధాంతం ఎప్పుడూ బీజేపీకి వ్యతిరేకమే అని తెలిపారు. జగన్‌రెడ్డి మాత్రం బీజేపీని పల్లెత్తు మాట అనట్లేదని మండిపడ్డారు. జగన్‌రెడ్డిపై ఉన్న అవినీతి కేసులే ఆయన మౌనానికి కారణమని ధ్వజమెత్తారు. జగన్‌ మాదిరిగానే చంద్రబాబు కూడా కేసుల వల్ల నోరెత్తట్లేదని ఆరోపించారు.

పదేళ్లపాటు ప్రత్యేక హోదా: విభజన సమయంలో రాష్ట్రానికి కేంద్రం ఎన్నో హామీలిచ్చిందని, ఇచ్చిన హామీలేమీ నెరవేరలేదని విమర్శించారు. ప్రత్యేక హోదా, పోలవరం, కడప స్టీల్‌ ఇలా ఎన్నో హామీలు నెరవేరలేదని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్‌ ఉండి ఉంటే హామీలన్నీ నెరవేరేవని హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే గతంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని భరోసా ఇచ్చారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పోలవరం, కడప స్టీల్‌ప్లాంట్‌ ఇస్తామన్న రాహుల్‌, రెండు లక్షల రుణమాఫీ, కేజీ టు పీజీ విద్య, రెండున్నర లక్షల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చారు. నిరుపేదలకు రూ.5 లక్షలతో ఇళ్లు కట్టిస్తామని, కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే విప్లవాత్మక మార్పులు తెస్తామన్నారు. పేదల జాబితా రూపొందించి సాయం చేస్తామన్నారు. పేద మహిళల ఖాతాల్లోకి నెలకి రూ.8,500 ఏడాదికి రూ.లక్ష జమచేస్తామని అన్నారు. మోదీ కొందరినే కోటీశ్వరులను చేశారని, తాము లక్షలమందిని లక్షాధికారులను చేస్తామని హామీ ఇచ్చారు.

  • కొందరు మమ్మల్ని పేదలను సోమరిపోతులను చేస్తున్నామంటున్నారు: రాహుల్‌
  • మోదీ కొందరికి లక్షల కోట్లు మేలుచేస్తే.. దాన్ని అభివృద్ధి అంటున్నారు: రాహుల్‌
  • మేం చేయాలనుకున్నది చేసి చూపిస్తాం: రాహుల్‌గాంధీ
  • రైతు రుణమాఫీ చేసి తీరుతాం: రాహుల్‌గాంధీ
  • రైతులకు కనీస మద్దతు ధర చట్టం చేస్తాం: రాహుల్‌గాంధీ
  • 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిస్తాం: రాహుల్‌గాంధీ
  • అంగన్వాడీల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం: రాహుల్‌గాంధీ
  • ఉపాధి హామీ కూలీని రూ.400కు పెంచుతాం: రాహుల్‌గాంధీ
  • కేంద్రం ఇచ్చిన హామీలేమీ నెరవేరలేదు: రాహుల్‌గాంధీ
  • ప్రత్యేక హోదా, పోలవరం, కడప స్టీల్‌ ఇలా ఎన్నో హామీలు నెరవేరలేదు: రాహుల్‌
  • కేంద్రంలో కాంగ్రెస్‌ ఉండి ఉంటే హామీలన్నీ నెరవేరేవి: రాహుల్‌గాంధీ
  • మేం అధికారంలోకి వస్తే గతంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం: రాహుల్‌
  • కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తాం: రాహుల్‌గాంధీ
  • కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పోలవరం, కడప స్టీల్‌ప్లాంట్‌ ఇస్తాం: రాహుల్‌
  • రెండు లక్షల రుణమాఫీ, కేజీ టు పీజీ విద్య, రెండున్నర లక్షల ఉద్యోగాలిస్తాం: రాహుల్‌
  • నిరుపేదలకు రూ.5 లక్షలతో ఇళ్లు కట్టిస్తాం: రాహుల్‌గాంధీ
  • కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే విప్లవాత్మక మార్పులు తెస్తాం: రాహుల్‌
  • మేం రాజ్యాంగాన్ని రక్షిస్తాం, రిజర్వేషన్లు కాపాడుతాం: రాహుల్‌గాంధీ
  • రాజ్యాంగం ద్వారానే హక్కులు, రిజర్వేషన్లు దక్కుతాయి: రాహుల్‌గాంధీ
  • రాజ్యాంగం ద్వారానే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుంది: రాహుల్‌గాంధీ
  • రాజ్యాంగాన్ని నాశనం చేయాలని మోదీ భావిస్తున్నారు: రాహుల్‌గాంధీ
  • రాజ్యాంగాన్ని పక్కనబెట్టి తాను చేయాలనుకున్నది చేద్దామనుకుంటున్నారు: రాహుల్‌
  • రాజ్యాంగమే భారతీయుల భవిష్యత్తు: రాహుల్‌గాంధీ
  • రాజ్యాంగాన్ని మోదీ కాదు కదా... ఎవరూ మార్చలేరు: రాహుల్‌
  • రాజ్యాంగాన్ని చించే ప్రయత్నం చేయండి.. ప్రజలెలా బుద్ధి చెబుతారో చూడండి: రాహుల్‌
  • మోదీకి భయపడడం రాష్ట్ర ప్రజలకు మంచిది కాదని రాహుల్‌గాంధీ పేర్కొన్నారు.
  • సీబీఐ పేరుతో జరుగుతున్న ప్రచారం అవాస్తవం: రాహుల్‌గాంధీ
  • వైఎస్సార్‌ పేరును సీబీఐ ఛార్జిషీట్‌లో కాంగ్రెస్‌ ఎప్పుడూ పెట్టించలేదు: రాహుల్‌
  • రాజశేఖర్‌రెడ్డి ఎప్పుడూ మావాడే: రాహుల్‌గాంధీ
  • రాజశేఖర్‌రెడ్డి బిడ్డ.. నా చెల్లెలు మీ ముందు ఉంది: రాహుల్‌గాంధీ
  • షర్మిల కచ్చితంగా పార్లమెంటులో ఉండాలి: రాహుల్‌గాంధీ
  • షర్మిల నా చెల్లెలు.. ఆమె కోసం మీ నుంచి ఒక వాగ్దానం అడుగుతున్నా: రాహుల్‌
  • షర్మిలను పార్లమెంటుకు పంపుతామని నాకు వాగ్దానం చేయండి: రాహుల్‌గాంధీ
  • ఆంధ్రప్రదేశ్‌ ఆలోచనలను షర్మిల పార్లమెంటులో వినిపిస్తుంది: రాహుల్‌గాంధీ
  • షర్మిలను మోదీ ఏమీ చేయలేరు: రాహుల్‌గాంధీ
  • షర్మిలను సీబీఐ, ఈడీ ఏమీ చేయలేవు: రాహుల్‌గాంధీ
  • నా చెల్లెలు షర్మిలను లోక్‌సభకు పంపండి: రాహుల్‌గాంధీ


Last Updated : May 11, 2024, 3:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.