ETV Bharat / state

రాడిసన్‌ డ్రగ్స్‌ కేసులో దర్యాప్తు ముమ్మరం - ప్రధాన నిందితుడి నుంచి కీలక విషయాలు

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 28, 2024, 10:01 PM IST

Radisson Drugs Case Updates : హైదరాబాద్‌లో సంచలనంగా మారిన గచ్చిబౌలి ర్యాడిసన్ హోటల్ డగ్స్ వ్యవహారంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది. వివేకానంద్‌కు డ్రగ్స్ సరఫరా చేసిన అబ్బాస్ అలీ జఫ్రీను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అబ్బాస్ అలీని 24 గంటలకు పైగా విచారించిన పోలీసులు, పలు కీలక విషయాలతో సహా ఆధారాలు సేకరించారు.

director krish drugs case
Radisson Drugs Case Updates

Radisson Drugs Case Updates : గచ్చిబౌలి ర్యాడిసన్ హోటల్ డగ్స్(Radisson Drug Case) వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో అరెస్ట్ అయిన వివేకానంద్‌కు బెయిల్ రాగా కేదార్, నిర్భయ్‌లను పూచీకత్తుపై పోలీసులు వదిలిపెట్టారు. మరోవైపు ఎఫ్‌ఐఆర్‌లో ఏ10గా నమోదైన క్రిష్‌ను పోలీసులు విచారణకు పిలిచారు. తాను ముంబైలో ఉన్నానని, శుక్రవారం విచారణకు హాజరవుతానని పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

ఈ కేసులో ప్రధాన నిందితుడు, వివేకానంద్‌కు డ్రగ్స్ సరఫరా(Drugs) చేసిన అబ్బాస్ అలీ జఫ్రీను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అబ్బాస్ అలీని 24 గంటలకు పైగా విచారించిన పోలీసులు, పలు కీలక విషయాలతో సహా ఆధారాలు సేకరించారు. అబ్బాస్‌ అలీని కూకట్‌పల్లి మెట్రో పాలిటన్ కోర్టుకు తరలించిన పోలీసులు కస్టడీకి తీసుకునేందుకు పిటిషన్ వేసే అవకాశం ఉంది. కాగా అబ్బాస్‌ అలీని విచారించే క్రమంలో తన నుంచి డ్రగ్స్‌ తీసుకుని వివేకానంద్‌ డ్రైవర్‌ ప్రవీణ్‌, వివేకానంద్‌కు చేరవేస్తున్నట్టు చెప్పడంతో అతణ్ని కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

సోమవారం రోజున వివేకానందను అదుపులోకి తీసుకున్న పోలీసులు, కోర్టు సొంత పూచీకత్తుపై బెయిల్‌ మంజూరు చేసింది. వివేకానంద్‌ స్నేహితులు నిర్భయ్‌, కేదార్‌లకు స్టేషన్‌ బెయిల్ మంజూరైంది. వివేకానంద్, కేదార్, నిర్భయ్‌లు అరెస్ట్ అయిన సమయలో వారి ఫోన్ డేటాను ఎరేజ్ చేయగా, దానిని రీట్రైవ్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న ఇద్దరు యువతులు సహా మరికొందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

డ్రగ్స్ పట్టుబడుతున్నా కొత్త కేసులు ఎలా పుట్టుకొస్తున్నాయి - వీటికి అంతమే లేదా?

అసలేం జరిగిందంటే.. రాడిసన్‌ హోటల్‌లో నిర్వహించిన ఓ పార్టీలో డ్రగ్స్‌ వినియోగించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ నెల 24న మొదలైన పార్టీలో డ్రగ్స్‌ వినియోగించగా సోమవారం కేసు నమోదైంది. హైదరాబాద్‌లోని ఆ హోటల్లో మంజీరా గ్రూప్ డైరెక్టర్‌ గజ్జల వివేకానంద్‌ స్నేహితులతో కలిసి ఈ నెల 24న డ్రగ్స్‌ పార్టీ ఏర్పాటు చేశాడు. 3గ్రాముల కొకైన్‌ తెప్పించుకొని హోటళ్లోని 2 గదుల్లో పార్టీ చేసుకున్నారు. సమాచారం అందుకున్న మాదాపూర్‌ ఎస్‌వోటీ పోలీసులు అర్ధరాత్రి హోటల్‌కు చేరుకోగా వారంతా అక్కడి నుంచి పారిపోయారు. గదుల్లో కొకైన్ ఆనవాళ్లు గుర్తించిన పోలీసులు వివేకానంద్ ఇంటికెళ్లి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో డ్రగ్స్‌ తీసుకున్నట్లు వివేకానంద అంగీకరించాడు.

ఆ పార్టీలో క్రిష్‌ పాల్గొన్నారో లేదో నిర్ధరణ కాలేదు: మాదాపూర్‌ డీసీపీ

గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో మంజీర గ్రూప్ డైరెక్టర్ అరెస్ట్ - 8 మందిపై కేసు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.