ETV Bharat / state

కడపలో వ్యక్తి కిడ్నాప్‌ - పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విడిచిపెట్టిన కిడ్నాపర్లు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 9, 2024, 1:23 PM IST

person_kidnap
person_kidnap

Person Kidnapped Kadapa Second Town Police Station in YSR District : దుండగులు ఓ వ్యక్తిని కిడ్నాప్​ చేసి ఆటోలో తీసుకెళ్లిన సంఘటన వైఎస్సార్​ జిల్లాలో జరిగింది. ఇలియాజ్​ అనే వ్యక్తిని దుండగులు కిడ్నాప్​ చేసి అతని వద్ద ఉన్న నగదును దోచుకున్నారు.

Person Kidnapped Kadapa Second Town Police Station in YSR District : వైఎస్సార్​ జిల్లా కడప రెండో పట్టణ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఖలీల్​ నగర్​లో ఓ వ్యక్తి కిడ్నాప్​కు గురైన విషయం స్థానికంగా కలకలం రేపింది. దీంతో బాధితుని కుటుంబ సభ్యులు, బంధువులు అప్రమత్తమై స్థానిక పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న దుండగులు అతని వదిలేశారు.

జీపు అడ్డంగా పెట్టి యువతి కిడ్నాప్- అడ్డుకున్న తండ్రిపై దాడి

YSR District : కడప పట్టణంలోని ఖలీల్​ నగర్​కు చెందిన ఇలియాజ్​ జీవనోపాధి కోసం దుబాయ్​కి వెళ్లాడు. అక్కడ కష్టపడి సంపాదించిన డబ్బుతో కొంత బంగారం తీసుకొని ఈ రోజు ఉదయం (శనివారం ) 5 గంటల ప్రాంతంలో కడపకు వచ్చాడు. అతడి రాకను ముందుగా తెలుసుకున్న కొంత మంది వ్యక్తులు ఇంటికి వెళ్లే మార్గమాధ్యంలో అడ్డుకొని అతన్ని ఆటోలో కిడ్నాప్​ చేసి తీసుకెళ్లారు. అతడిని విచక్షణం రహితంగా కొట్టి తన దగ్గర ఉన్న డబ్బులు, బంగారాన్ని లాక్కున్నారు. ఈ విషయం స్థానికుల ద్వారా ఇలియాజ్​ అన్న ( brother) తెలుసుకున్నాడు. తన తమ్ముడు కిడ్నాప్​ అయిన తెలిసిన వెంటనే హుటాహుటిన స్థానిక పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

కమీషన్​ కోసం కోల్​కతా కూలీల నిర్బంధం! - హైకోర్టులో ఫిర్యాదుతో మారిన సీన్ 'అసలేం జరిగిందంటే?'

Khalil Nagar in Kadapa : ఖలీల్​ నగర్​లో ఇలియాజ్​ను ఆటో బలవంతంగా తీసుకువెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరా​లో రికార్డు అయ్యాయి. వాటి ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న దుండగులు ఇలియాజ్​ను వదిలేశారు. ఈ విషయం పోలీసులకు తెలియజేస్తే చంపేస్తామంటూ బెదిరించాడు. ఇలియాజ్​ను దుండగుల విడిచి పెట్టిన అనంతరం పోలీసు స్టేషన్​కు చేరుకొని అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి నుంచి తనను రక్షించావల్సిందిగా జిల్లా ఎస్పీని కోరుకున్నారు. ఇలియాజ్​ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును నమోదు చేశారు. బిలాల్‌ అనే గ్యాంగ్‌ కిడ్నాప్‌ అతని కిడ్నాప్​ చేశారని ఆరోపించారు. పోలీసులకు ఇలియాజ్​ తెలిపిన వివరాల ప్రకారం, సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.