ETV Bharat / state

తల్లికాని మహిళలకు గరుడ ప్రసాదం అంటూ ప్రచారం - చిలుకూరు బాలాజీ ఆలయానికి పోటెత్తిన నగరవాసులు - Traffic in CHILKUR BALAJI TEMPLE

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 19, 2024, 11:17 AM IST

Updated : Apr 19, 2024, 11:25 AM IST

Heavy Traffic Jam at Chilkur Balaji Temple : తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ దేవాలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. స్వామి వారి దర్శనం కోసం భక్తజనం అశేషంగా తరలివచ్చారు. దీంతో బాహ్యవలయ రహదారి వరకు క్యూలైన్‌లో భక్తులు నిలుచున్నారు. వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. వివిధ పనుల నిమిత్తం వెళ్లేవారు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయి తీవ్ర అవస్థలు పడుతున్నారు.

Heavy Traffic Jam at Chilkur Balaji Temple
Heavy Traffic Jam at Chilkur Balaji Temple

తల్లికాని మహిళలకు గరుడ ప్రసాదం అంటూ పుకార్లు - చిలుకూరు బాలాజీ ఆలయానికి పోటెత్తిన నగరవాసులు

Heavy Traffic Jam at Chilkur Balaji Temple : తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది సుమారు 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రాజేంద్రనగర్‌లోని కాళీమాత మందిరం నుంచి చిలుకూరు దేవాలయం వరకు ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. గచ్చిబౌలిలోని ఔటర్‌ రింగ్‌ సర్వీస్ రోడ్డు కూడా వాహనాలతో నిండిపోయింది. దీంతో కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.

అప్పన్న ఆలయంలో పెళ్లిసందడికి శ్రీకారం- సింహాద్రినాథుడిని తాకిన సూర్యకిరణాలు - Simhadri Appanna Kalyanam

అయితే చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సంతానం లేరి వారికి గరుడ ప్రసాదం ఇస్తారని సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో వేకువజామున 5 గంటల నుంచే భక్తులు హైదరాబాద్‌ నగరంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా అక్కడికి బయల్దేరారు. కార్లు, ఇతర వాహనాల్లో భారీగా ఆ మార్గంలోకి చేరుకోవడంతో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.

ఇప్పటివరకు 60,000ల మందికి పైగా దేవస్థానానికి వచ్చారని మొయినాబాద్‌ సీఐ తెలిపారు. ఆలయంం వద్ద ప్రస్తుతం గరుడ ప్రసాదం ఇవ్వడం లేదని, ఉదయం కాసేపు ఇచ్చాక ఆపేశారని అన్నారు. ఆలయ అధికారులు చెప్పినట్లు బందోబస్తు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 5,000ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని తెలపగా కానీ ఒకేసారి వేల మంది రావడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయని వివరించారు. ప్రజలు ఎవ్వరూ ఇటువైపు రావద్దని కోరుతున్నట్లు చెప్పారు. అదనపు సిబ్బందిని రప్పించి ట్రాఫిక్‌ను కనుబద్ధీకరిస్తున్నామని మొయినాబాద్‌ సీఐ వెల్లడించారు.

ఒంటిమిట్టలో కోదండరాముడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం - VONTIMITTA BRAHMOTSAVAM

Last Updated : Apr 19, 2024, 11:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.