ETV Bharat / state

కోరంగి మడ అడవుల్లోని 'లైట్ హౌస్​'కి పూర్వవైభవం - చర్యలు చేపట్టిన అధికారులు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 16, 2024, 9:56 PM IST

Old_Light_House_in_Coringa_Wildlife_Sanctuary
Old_Light_House_in_Coringa_Wildlife_Sanctuary

Old Light House in Coringa Wildlife Sanctuary : కాకినాడ జిల్లా కోరంగి మడ అడవులలో ఉన్న లైట్ హౌస్ ఎంతో ప్రసిద్ధి గాంచింది. 1847 సంవత్సరం నాటి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వంలో నిర్మితమైన ఈ కట్టడం వర్తక వాణిజ్యానికి దిక్సూచిగా ఉండేది. ఇప్పటికి దాదాపుగా 177 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ నిర్మాణం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టిన అటవీశాఖ అధికారులు మళ్లీ లైట్ హౌస్​కు పూర్వవైభవం తీసుకువస్తామని తెలిపారు. అనంతరం పర్యాటకులు సందర్శించేలా తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Old Light House in Coringa Wildlife Sanctuary : సముద్ర తీర ప్రాంతాల్లో సహజ రక్షణ గోడలుగా మడ అడవులు ఎంతో ప్రసిద్ధి చెందాయి. అటువంటి గొప్పసంపద మన రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలో ఉంది. జిల్లాలోని కోరంగి మడ అడవులు (Coringa Mangrove Forests) దాదాపుగా 235 చ. కి. మీ. విస్తీర్ణంలో విస్తరించి దేశంలోనే రెండవ పెద్ద మడ అడవులుగా స్థానం సంపాదించుకున్నాయి. ఇటువంటి మడ అడవుల మధ్యలో 1847 సంవత్సరంలోనే అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన లైట్ హౌస్ ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. అప్పటి వర్తక వాణిజ్యానికి ఈ లైట్ హౌస్ దిక్సూచిగా ఉండేదని స్థానికులు చెబుతున్నారు. దాదాపుగా 177 సంవత్సరాలు పూర్తిచేసుకున్న ఈ పురాతన కట్టడం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది.

'కొరింగ' రక్షణకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

ప్రస్తుతం అటవీశాఖ అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి మళ్లీ లైట్ హౌస్​కు పూర్వవైభవం తీసుకువస్తామని తెలిపారు. అంతేగాక దీన్ని చారిత్రక కట్టడంగా గుర్తించి వాటి ప్రాధాన్యతను పర్యాటకులకు తెలియజేస్తామని స్పష్టం చేశారు. పనులు పూర్తయ్యాక భవిష్యత్తులో పర్యాటకులు సందర్శించేలా చర్యలు తీసుకుంటామన్నారు. మడ అడవుల మధ్యలో ఈ లైట్ హౌస్ ఉండటం వల్ల పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తుందని అధికారులు తెలిపారు.

Old Light House in Coringa Forest : అడవిలో ఉన్న వివిధ రకాల మొక్కలు, పక్షులు, ఉభయచరాలు, క్షీరజాతులు ఇలా 119 రకాల జీవజాలం మడఅడవుల్లో ఉన్నట్లు చెప్పారు. ముఖ్యంగా సముద్రతీరం కోతకు గురి కాకుండా కాపాడటంలోనూ, ఎన్నో రకాల జలచరాలకు ఆశ్రయం ఇవ్వడంలోనూ మడ అడవులది ప్రత్యేక స్థానమని వెల్లడించారు. పర్యాటకంగాను మడఅడవులు ప్రసిద్ధి పొందాయని తెలిపారు. కాకినాడలో ఉన్న కోరంగి మడ అడవుల సందర్శనకు ప్రజలు రావాలని అటవీశాఖ అధికారులు కోరారు. ముఖ్యంగా ఇక్కడకు వచ్చేవారికి దీని ప్రాధాన్యతను తెలియజేసి వారికి అవగాహన కల్పిస్తామని అటవీ అధికారులు వెల్లడించారు.

కోరంగి మడ అడవుల్లోని 'లైట్ హౌస్​'కి పూర్వవైభవం - చర్యలు చేపట్టిన అధికారులు

కాకినాడ జిల్లాలో కోరంగి మడ అడవులు ఎంతో ప్రసిద్ధి చెందినవి. ఇక్కడ అడవి మధ్యలో ఉన్న లైట్ హౌస్ ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. అప్పటి వర్తక వాణిజ్యానికి ఈ లైట్ హౌస్ దిక్సూచిగా ఉండేది. ప్రస్తుతం ఇది శిథిలావస్థకు చేరుకుంది. దీనికి పుర్వవైభవం తీసుకురావలని అటవీశాఖ ద్వారా ఇప్పటికే సర్వే నిర్వహించాం. దీని సహజ స్వభావం దెబ్బతినకుండా సుందరంగా తీర్చిదిద్దుతాం. అనంతరం పర్యాటకులు సందర్శించేలా తగిన చర్యలు తీసుకుంటాం. - భరణి, కాకినాడ జిల్లా అటవీశాఖ అధికారిణి

రాష్ట్రంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ మడ అడవులు వివిధ రకాల పక్షిజాతులకు ఆవాస ప్రాంతంగా ఉంది. ఉభయచరాలు, పక్షులు, క్షీరజాతులు మొత్తం 119 రకాల జీవజాలం వీటిలో నివసిస్తున్నాయి. ఇక్కడ పొన్న, మడ, కళింగ, గుగ్గిలం మొదలైనటువంటి మడజాతి మొక్కలతో దట్టమైన వృక్ష సంపద కలిగి ఉంది. అదేవిధంగా చేపలు పట్టు పిల్లి, నీటికుక్క, నక్క వంటి జంతువులు కూడా ఇక్కడ నివసిస్తున్నాయి. అలాగే సముద్రపు తాబేలు, ఉప్పునీటి మొసలిని ఇక్కడ చూడవచ్చు. పక్షులలో ఎక్కువగా కనిపించేవి నీటి కాకి, కొంగ, నారాయణ పక్షులు, ఉల్లం పిట్టలు, బాతులు, సముద్రపు చిలకలు ఈ మడ అడవులలో ఉండటం విశేషం.

చూస్తుండగానే జలపాతంలో కొట్టుకుపోయిన యువకుడు.. లైవ్​ వీడియో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.