ETV Bharat / state

రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ - ఫ్లెక్సీల తొలగింపు - నేతల విగ్రహాలకు ముసుగు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 16, 2024, 7:42 PM IST

Officers Removed Political Leaders Flexis: దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. రహదారులకు రెండు వైపులా ఉన్న ప్రచార బోర్డులు, ఫ్లెక్సీలు, అతికించిన గోడ పత్రికలను తొలగిస్తున్నారు. ఇందులో భాగంగా నందిగామలో ప్రధాన సెంటర్లో కట్టిన వైఎస్సార్సీపీ, తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీల ఫ్లెక్సీలను నందిగామ మున్సిపల్ కమిషనర్ హేమమాలిని దగ్గర ఉండి సిబ్బందితో తొలగించారు.

Officers_Removed_Political_Leaders_Flexis
Officers_Removed_Political_Leaders_Flexis

Officers Removed Political Leaders Flexis : దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. విజ్ఞాన్‌భవన్‌ ప్లీనరీ హాల్‌లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినట్టు తెలిపారు. జూన్‌ 16లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని రాజీవ్‌ కుమార్‌ వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్​లో మే 13న పోలింగ్- జూన్ 4న ఫలితాలు

నిబంధనల మేరకు చర్యలు ఉంటాయి : రాష్ట్రంలో శాసనసభ, లోక్​సభ ఎన్నికలకు సంబంధించిన కోడ్‌ అమలు కావడంతో నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఎన్నికల కోడ్ వెలువడిన మురక్షణం నుంచే పారిశుద్ధ్య విభాగం, పట్టణ ప్రణాళిక, డీఆర్‌ఎఫ్‌ బృందాలు నగర వ్యాప్తంగా తిరుగుతూ ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు, బస్సు షెల్టర్లు, బ్రిడ్జీలు, బస్టాండ్లు, బస్సులు, మున్సిపల్‌ పార్కు స్థలాలు, డివైడర్లపై రాసిన రాతలను తొలగించేందుకు తెల్ల పెయింట్‌ వేసే పనుల్లో నిమగ్నం అయ్యారు. రహదారులకు రెండు వైపులా ఉన్న ప్రచార బోర్డులు, ఫ్లెక్సీలు, అతికించిన గోడ పత్రికలను తొలగిస్తున్నారు. అనుమతి లేకుండా ఏర్పాటు చేస్తే ఎన్నికల సంఘం నిబంధనల మేరకు చర్యలు ఉంటాయని అధికారలు హెచ్చరికలు జారీ చేశారు.

ఎన్నికల షెడ్యూల్ రాకతో ఏపీ ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చింది - వైసీపీకి కౌంట్ డౌన్ మొదలైంది: చంద్రబాబు

రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగింపు : దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఎన్టీఆర్ జిల్లా నందిగామలో నిబంధనలను అధికారుల అమలు చేశారు. దీనిలో భాగంగా నందిగామలో ప్రధాన సెంటర్లో కట్టిన వైఎస్సార్సీపీ, తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీల ఫ్లెక్సీలను, బ్యానర్లను నందిగామ మున్సిపల్ కమిషనర్ హేమమాలిని దగ్గర ఉండి సిబ్బందితో తొలగించారు. ప్రభుత్వ కార్యాలయాలు ఆవరణలో రహదారుల వెంట ఇతర ప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లో ఉన్న వివిధ పార్టీల ఫ్లెక్సీలను తొలగించిన అనంతరం మున్సిపాలిటీ కార్యాలయానికి తరలిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో నందిగామ పట్టణంలో జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకుల విగ్రహాలకు ముసుగులు తొడిగారు. మున్సిపల్ కమిషనర్ హేమమాలిని దగ్గర ఉంది కార్మికులతో అన్ని విగ్రహాలకు ముసుగులు తొడుగుతున్నారు. అదేవి ధంగా రాజకీయ పార్టీల నాయకుల ఫ్లెక్సీలను తొలగించారు. ఎవరైన ఎన్నికల కోడ్ ఉల్లంగిస్తే కఠన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

చిలకలూరిపేట సభ ఏర్పాట్లను పరిశీలించిన కూటమి నేతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.