ETV Bharat / state

గుంతలతో నరకప్రాయంగా రహదారి - ప్రభుత్వాలు మారినా పూర్తికాని రోడ్డు విస్తరణ పనులు - Not Complete ADB Road Works

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 25, 2024, 7:44 AM IST

YCP Govt Not Complete Rajahmundry ADB Road Works: ఆ రోడ్డుపై ప్రయాణించాలంటేనే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని వెళ్లవలసి ఉంటోంది. గోతులు, దుమ్ము, ధూళితో ప్రయాణం నరక ప్రాయంగా మారుతోంది. 2018లో తెలుగుదేశం సర్కారు రోడ్డు విస్తరణ పనుల్ని ప్రారంభిస్తే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదేళ్లైనా దానిని ఇప్పటివరకు పూర్తి చేయలేదు. విమానాశ్రయం, పోర్టుల్ని కలిపే రహదారైనా ప్రయాణికులకు మాత్రం నరకప్రాయంగా మారుతోంది. ఇది రాజమహేంద్రవరం - కాకినాడను కలిపే ఏడీబీ రహదారి పరిస్థితి.

YCP Govt Not Complete Rajahmundry ADB Road Works
YCP Govt Not Complete Rajahmundry ADB Road Works

గుంతలతో నరకప్రాయంగా రహదారి- ప్రభుత్వాలు మారినా పూర్తికాని రోడ్డు విస్తరణ పనులు

YCP Govt Not Complete Rajahmundry ADB Road Works: రాష్ట్రంలోనే అత్యంత రద్దీ రహదారుల్లో అదీ ఒకటి. రెండు ప్రధాన నగరాలు, విమానాశ్రయం, నౌకాశ్రయాలను కలుపుతుంది. నిత్యం వేలాది వాహనాలు ఆ రహదారిపై దూసుకెళ్తుంటాయి. అలాంటి రోడ్డు విస్తరణ పనులను వైసీపీ సర్కారు విస్మరించింది. ఫలితంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంతలు, దుమ్ము, ధూళితో ప్రయాణం నరక ప్రాయంగా మారిందని వాపోతున్నారు.

కనీస మరమ్మతులూ కరవే!- వైఎస్సార్సీపీ పాలనకు అద్దం పడుతున్న రహదారులు

రాజమహేంద్రవరం - కాకినాడను కలిపే ఏడీబీ రహదారి ఇది. 2002లో ఆసియా అభివృద్ధి బ్యాంకు నిధులతో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం (TDP Government) ఈ రోడ్డును నిర్మించింది. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నుంచి రంగంపేట, గండేపల్లి, పెద్దాపురం, సామర్లకోట, కాకినాడ గ్రామీణ మండలాల మీదుగా కాకినాడ పోర్టు వరకు 60 కిలోమీటర్ల మేర ఈ రహదారి విస్తరించి ఉంది. రాజమండ్రి విమానాశ్రయం, కాకినాడ పోర్టుల్ని కలిపే రహదారి కావడంతో భారీగా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. 2018లో తెలుగుదేశం సర్కారు రోడ్డు విస్తరణ పనుల్ని ప్రారంభించింది. రాజానగరం నుంచి సామర్లకోట వరకు 300 కోట్ల రూపాయలతో మొదటి దఫా విస్తరణ చేపట్టింది. కానీ వైసీపీ ప్రభుత్వం (YSRCP Government) వచ్చాక ఈ రోడ్డు విస్తరణ నిలిచిపోయింది. ఏడాదిన్నర నుంచి పనులు పూర్తిగా నిలిపివేయడంతో రహదారి (Road) దారుణంగా తయారైంది. దీనిపై ప్రయాణంతో జనం ఒళ్లు హూనమవుతోంది.

వైసీపీ ప్రభుత్వం వల్లే ఏడీబీ విస్తరణ పనులు పూర్తి కాకుండా ఆగిపోయాయి. రోడ్డులో ఉన్న గుంతలు కారణంగా తరచూ ప్రమాదాలకు గురవుతున్నాం. దాదాపు 6 నెలలుగా దుమ్ము, ధూళితో నానా అవస్థలు పడుతున్నాం. ఈ రోడ్డుపై ప్రయాణంతో తరచూ వాహనాలు రిపేర్​కు వస్తున్నాయి. రోడ్డుపై ఉన్న దుమ్ము నివాసాల్లోకి రావడంతో భోజనం తినడానికి చాలా ఇబ్బందిగా ఉంటోంది. రోడ్డుపై ఏర్పడిన గుంతలు కారణంగా వంద మందికిపైగా గాయపడ్డారు. వర్షకాలంలో రోడ్డు ఏదో గుంత ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి ఏర్పడుతోంది. - వాహనదారులు.

బయటపడిన నాణ్యతా లోపం - జాతీయ రహదారిపై ఏర్పడిన పగుళ్లు

రహదారిని విస్తరించే క్రమంలో చేపట్టిన పనులను అసంపూర్తిగా వదిలేశారు. దీని వల్ల గుంతలు, దుమ్ము, ధూళి మధ్య ప్రయాణం సాగించలేక వాహనదారులు నరకయాతన పడుతున్నారు. వర్షాకాలంలో రోడ్డుపై గుంతల్లో పడి కాళ్లు చేతులు విరిగి ప్రాణాలు పోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడీబీ రహదారి మొదటి దశ విస్తరణ పనులకు ఆసియా అభివృద్ధి బ్యాంకు 60 కోట్ల రూపాయలు విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు సకాలంలో మంజూరు చేయకపోగా ఏడీబీ నిధులు కూడా వాడుకుంది. గుత్తేదారుకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు నిలిపేశారు. ఫలితంగా సామర్లకోట నుంచి రాజానగరం వరకు ప్రయాణం ఇబ్బందికరంగా మారింది. రాజమహేంద్రవరం- కాకినాడ మధ్య కెనాల్​ రోడ్డుగా వ్యవహరించే మరో రహదారి కూడా ఉంది. ఈ రహదారి దుస్థితీ ఇలాగే ఉంది. తీవ్ర ఇబ్బందులు పడుతూనే రోడ్డుపై భయం భయంగా జనం రాకపోకలు సాగిస్తున్నారు.

ఎన్నికల వేళ ప్రజలపై బాలినేని ప్రేమ - ఐదేళ్లుగా పట్టించుకోకుండా రాత్రికి రాత్రే రోడ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.