ETV Bharat / state

సైకో జగన్ టీడీపీ నేతల ఇళ్లపై పోలీసులను ఉసిగొల్పుతున్నది అందుకే : నారా లోకేశ్

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 4, 2024, 4:57 PM IST

nara_lokesh
nara_lokesh

Nara Lokesh Strong Reaction: నెల్లూరులో వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లో పోలీసులు జరిపిన తనిఖీలపై టీడీపీ నేత నారా లోకేశ్ స్పందించారు. నెల్లూరు జిల్లాలో పలువురు టీడీపీలో చేరడంతో జీర్ణించుకోలేని సైకో జగన్ తెలుదేశం నేతల ఇళ్లపై పోలీసులను ఉసిగొల్పాడని నారా లోకేశ్ మండిపడ్డారు. పబ్జీ గేమ్ ఆడినంత తేలిగ్గా జగన్ రెడ్డి వ్యాపార, వాణిజ్య వర్గాలను వేధిస్తుంటే చూస్తూ ఊరుకోమని తెలుగుదేశం వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డూండీ రాకేశ్ హెచ్చరించారు.

Nara Lokesh Strong Reaction: ఓటమి ఖాయమని తేలిపోవడంతో ముఖ్యమంత్రి జగన్ ముసుగు తీసేసి ఫ్యాక్షనిస్టు పోకడలతో బరితెగింపు చర్యలకు పాల్పడుతున్నాడని తెలుగుదేశం జాతీయప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దుయ్యబట్టారు. జగన్ నియంత పోకడలకు తట్టుకోలేక ఇటీవల నెల్లూరు జిల్లాలోని సీనియర్ నేతలంతా చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరడంతో జీర్ణించుకోలేని సైకో జగన్, తెలుదేశం నేతల ఇళ్లపై పోలీసులను ఉసిగొల్పాడని మండిపడ్డారు.

జగన్ తొత్తులుగా కొంతమంది పోలీసులు: మాజీమంత్రి నారాయణ అనుచరులైన విజేతారెడ్డి, వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, పట్టాభిరామిరెడ్డి, ఫైనాన్షియర్ గురుబ్రహ్మం ఇళ్లపైకి పోలీసులను పంపి భయానక వాతావరణం సృష్టించారని లోకేశ్ ఆక్షేపించారు. మరికొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడబోతున్న సమయంలో పోలీసులు జగన్ చేతిలో కీలుబొమ్మలుగా మారడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేయడమేనని లోకేశ్ ఆరోపించారు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తక్షణమే జోక్యం చేసుకొని జగన్ తొత్తులుగా మారిన కొంతమంది పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. నోటిఫికేషన్ కు ముందే ఆంధ్రప్రదేశ్ లో అధికారపార్టీ అరాచకపర్వానికి తెరలేపిన నేపథ్యంలో ప్రత్యేక పరిశీలకులను పంపించాలన్నారు. అవసరమైతే కేంద్రబలగాలను రంగంలోకి దించాల్సిందిగా లోకేశ్ డిమాండ్‌చేశారు.

వచ్చే ఎన్నికల్లో జగన్ ఏమి చేసినా గెలవడు - ప్రశాంత్‌ కిశోర్‌ సంచలన వ్యాఖ్యలు

ఖండించిన టీడీపీ వాణిజ్య విభాగం: రాష్ట్రంలో వ్యాపారాలన్నీ తనే చేయాలి, ఎవరూ బాగుపడకూడదనే నియంత్రత్వ ధోరణితో జగన్ వ్యవహరిస్తున్నాడని తెలుగుదేశం వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డూండీ రాకేశ్ ధ్వజమెత్తారు. పబ్జీ గేమ్ ఆడినంత తేలిగ్గా జగన్ రెడ్డి వ్యాపార, వాణిజ్య వర్గాలను వేధిస్తుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. నెల్లూరులో వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లో జరిపిన తనిఖీలపై పోలీస్ శాఖ సమాధానమివ్వాలని డిమాండ్ చేశారు. ఎవరి ఆదేశాలతో, ఏ నిబంధనల ప్రకారం తెల్లవారకముందే తనిఖీల పేరుతో ఇళ్లు, కార్యాలయాలు, వ్యాపార సముదాయాల్లోకి వెళ్లి ప్రవేశించారో చెప్పాలని ప్రశ్నించారు. పోలీస్ విభాగం స్పందించకుంటే నెల్లూరు వెళ్లి వ్యాపారుల పక్షాన నిలిచి, తప్ప్పుచేసిన పోలీసుల ఆటకట్టిస్తామని స్పష్టం చేశారు. హఠాత్తుగా వ్యాపార వర్గాలపై రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై ఎన్నికల కమిషన్ దృష్టిపెట్టాలని సూచించారు. మంత్రి పెద్దిరెడ్డి సహా మంత్రులు, సజ్జల, ముఖ్యమంత్రి ఇళ్లు, కార్యాలయాల్లో వెతికితే వేలకోట్ల డబ్బు, బంగారంతో పాటుగా కళ్లుచెదిరే ఆస్తులు దొరుకుతాయని టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డూండీ రాకేశ్ పేర్కొన్నారు.

పీకే వ్యాఖ్యలతో జగన్​ ఉక్కిరిబిక్కిరి! - వైఎస్సార్సీపీ శ్రేణుల్లో ఓటమి భయం

నారాయణ అనుచరులే లక్ష్యంగా దాడులు: నెల్లూరు నగర టీడీపీ అభ్యర్థిగా రంగంలో ఉన్న మాజీ మంత్రి పొంగూరు నారాయణ స్నేహితులే లక్ష్యంగా, పోలీసులు కొద్ది రోజులుగా దాడులు చేస్తున్నారు. నారాయణ ఆర్ధిక మూలాలను దెబ్బతీసెందుకు పది రోజుల కిందట ఇంటిలోనూ, ఆసుపత్రిలోనూ ముమ్మరంగా తనిఖీలు చేశారు. తాజాగా నేడు తెల్లవారుజాము నుంచి మాజీ మంత్రి నారాయణ ఉద్యోగులు, టీడీపీ నాయకులు ఇళ్లపై తనిఖీలు చేశారు. కోట గురుబ్రహ్మం, దేవరపల్లి రమణారెడ్డి నివాసాల్లో పోలీసులు జల్లెడ పడుతున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త కోట గురు బ్రహ్మంను పోలీసులు నెల్లూరు బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్​కు తీసుకువెళ్లారు. సింహాద్రినగర్​లోని శ్రీధర్ ఇంటిపై పోలీసులు తనిఖీలు చేపట్టారు.

'టీడీపీ నేతలే లక్ష్యంగా పోలీసుల దాడులు- ఆర్థిక మూలాలు దెబ్బతీసేందుకు వైసీపీ కుట్ర'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.