ETV Bharat / state

రామోజీ ఫిల్మ్‌సిటీలో ఘనంగా మహిళా దినోత్సవం - మహిళలు ఆకాశమే హద్దుగా ఎదగాలన్న మంత్రి సీతక్క

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 8, 2024, 10:04 AM IST

Minister Seethakka on Women Day Celebration in Ramoji Film City : మహిళా దినోత్సవ స్ఫూర్తిని అందిపుచ్చుకుని అతివలు ఆకాశమే హద్దుగా అన్ని రంగాల్లో ఎదగాలని తెలంగాణ స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క ఆకాంక్షించారు. మహిళలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూసే సమాజం సరికాదన్న ఆమె తెలిపారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి హాజరైన సీతక్క, అవాంతరాలను ఎదుర్కొని నిలవాలని మహిళలకు సూచించారు.

Women_Day_Celebration_in_Ramoji_Film_City
Women_Day_Celebration_in_Ramoji_Film_City

రామోజీ ఫిల్మ్‌సిటీలో ఘనంగా మహిళా దినోత్సవం - మహిళలు ఆకాశమే హద్దుగా ఎదగాలన్న మంత్రి సీతక్క

Minister Seethakka on Women Day Celebration in Ramoji Film City : రామోజీ ఫిల్మ్‌సిటీలో మహిళా దినోత్సవం ఆద్యంతం ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగింది. "ఇన్‌స్పైర్ ఇన్‌క్లూజన్" అనే థీమ్‌తో జరిగిన ఈ వేడుకల్లో ఫిల్మ్‌సిటీలోని వివిధ విభాగాలకు చెందిన మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొనగా కార్యక్రమానికి తెలంగాణ మంత్రి సీతక్క(Minister Seetakka) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రామోజీ ఫిల్మ్‌సిటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సీహెచ్​. విజయేశ్వరి, ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్‌ డైరెక్టర్‌ సహరి, ఫిల్మ్‌సిటీ డైరెక్టర్‌ కీర్తి సోహనలతో కలిసి మంత్రి కేక్‌ కట్‌ చేసి, శుభాకాంక్షలు తెలిపారు.

ఎక్కడ మహిళలు పూజలందుకుంటారో అక్కడ దేవతలు కొలువవుతారని తెలంగాణ మంత్రి సీతక్క పేర్కొన్నారు. మహిళలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూసే సమాజం సరికాదన్న ఆమె, ఒకనాడు మాతృస్వామిక సమాజం నుంచి నెమ్మదిగా పితృస్వామ్యం దిశగా పరిస్థితులు మారాయన్నారు. మహిళా దినోత్సవ స్ఫూర్తిని అందిపుచ్చుకొని అతివలంతా ఆర్థికంగా బలంగా మారడంతో పాటు సామాజిక, రాజకీయ రంగాల్లోనూ ఉన్నత స్థానాలకు చేరాలని సీతక్క ఆకాంక్షించారు.

Minister Seethakka about Women on Women's Special Day : తాను సమ్మక్క, సారక్క జాతి బిడ్డనని, తన జీవితంలో విద్యార్థి దశ నుంచి ఎదురైన సమస్యలను అధిగమిస్తూ ముందుకు సాగిన విషయాలను సీతక్క వివరించారు. నక్సలైట్‌గా అడవి బాట పట్టిన పరిస్థితి, తిరిగి జనజీవన స్రవంతిలోకి రావడం, క్లయింట్‌గా హాజరైన కోర్టులో తిరిగి న్యాయవాదిగా అడుగు పెట్టిన విషయాలను సభలో పంచుకున్నారు. సేవ చేయాలనే లక్ష్యం ఉంటే ఆర్థికంగా బలంగానే ఉండాల్సిన అవసరం లేదని సీతక్క పేర్కొన్నారు.

సమస్యలకు భయపడవద్దని, అవాంతరాలను ఎదుర్కొని నిలవాలని మహిళలకు మంత్రి సీతక్క సూచించారు. వేదిక వద్ద ఏర్పాటు చేసిన వివిధ రంగాల్లోని స్ఫూర్తి ప్రదాతల చిత్రాలను ఉదహరిస్తూ వారెవరికీ విజయాలు తేలికగా రాలేదన్నారు. ఎంతోమందికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించిన రామోజీ గ్రూప్‌ అధినేత రామోజీరావు(Ramoji Rao) జీవితం సైతం పూలపాన్పేమీ కాదని, ఎంతో కృషితోనే ఆయన ఈ స్థాయికి చేరారని వివరించారు.

Women's Day Celebration in Ramoji Film City : ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరి, డైరెక్టర్‌ కీర్తి సోహన, ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్‌ డైరెక్టర్‌ సహరిలు మంత్రి సీతక్కను ఘనంగా సత్కరించారు. తొలుత ఎండీ విజయేశ్వరి, సహరి, సోహనలు జ్యోతి వెలిగించి వేడుకలను ప్రారంభించగా మహిళా దినోత్సవం సందర్భంగా ఫిల్మ్‌సిటీలో నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన మహిళా ఉద్యోగులకు జ్ఞాపికలు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో నిర్వహించిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

'ఈ సమాజంలో మహిళ లేకుండా సృష్టి లేదు. కానీ మగవాళ్ల భావజాలం మార్చాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే స్త్రీలు పూజలందుకుంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని చెబుతారు. సమస్యలకు పారిపోకుండా ఎదుర్కోవాలి, అప్పుడే మనకంటూ ఓ విజయం ఉంటాది. మనమంటూ ఓ చరిత్రలో నిలబడతాం.'-సీతక్క, తెలంగాణ మంత్రి, స్త్రీ, శిశు సంక్షేమశాఖ

అంతర్జాతీయ మహిళా దినోత్సవం - ఈ కోట్స్​తో మీ జీవితంలో ముఖ్యమైన వారికి విషెస్​ చెప్పండి!

అన్ని రంగాల్లో మహిళా సాధికారత మరింత పెరగాలి : శైలజా కిరణ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.