ETV Bharat / state

డిమాండ్ల సాధనకు ఆదివాసీల పోరుబాట - మన్యం బంద్​

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 10, 2024, 11:40 AM IST

Manyam Bandh GO No 3 in Alluri District : గిరిజన సంఘం నాయకులు రాష్ట్రావ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చారు. ప్రభుత్వం రద్దు చేసిన జీవో నెం 3ను పునరుద్ధరించి ప్రత్యేక డీఎస్సీ విడుదల చేయాలని ఆదివాసీలు డిమాండ్‌ చేశారు. అదే విధంగా అరకులో అఖిలపక్ష ఆధ్వర్యంలో బంద్ ప్రశాంతంగా జరుగుతోంది.

manyam_bandh_continues_peacefully_in_alluri_district
manyam_bandh_continues_peacefully_in_alluri_district

డిమాండ్ల సాధనకు ఆదివాసీల పోరుబాట - మన్యం బంద్​

Manyam Bandh GO No 3 in Alluri District : ప్రభుత్వం ఆదివాసీలకు 5 శాతం రిజర్వేషన్లే అమలు చేయడంపై అల్లూరి జిల్లా పాడేరు ప్రాంతాల్లో గిరిజన సంఘం నాయకులు బంద్‌కు పిలుపునిచ్చారు. వ్యాపారులు, దుకాణాల యజమానులు రాష్ట్రావ్యాప్త బంద్‌కు సంఘీభావం తెలిపారు. అరకులోని పర్యాటక అతిథి గృహాలు గిరిజన మ్యూజియం, పద్మపురం గార్డెన్, బొర్రా గుహలు (Borra Caves) తదితర సందర్శిత ప్రాంతాలు మూసి వేశారు. ప్రభుత్వం జీవో నెం 3ను పునరుద్దరించి ఆదివాసీలకు ప్రత్యేక డీఎస్సీని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అదే విధంగా అరకులో అఖిలపక్ష ఆధ్వర్యంలో బంద్ ప్రశాంతంగా జరుగుతోంది. బంద్ కారణంగా విశాఖ నుంచి అరకు వెళ్లే బస్సులను అధికారులు ముందస్తుగానే నిలిపి వేశారు. బంద్ కారణంగా విశాఖ నుంచి అరకుకు వచ్చే బస్సు సర్వీసులను అధికారులు ముందస్తుగానే నిలిపివేశారు. బంద్ ప్రభావంతో ముంచంగిపుట్టు మండలంలో గల 23పంచాయతీలతో పాటు సరిహద్దు లోగల ఒడిశా, ఛత్తీస్​గఢ్​ తదితర ప్రాంతాల నుంచి విశాఖ (Visakha) కు రాకపోకలు నిలిచిపోయాయి.

రంపచోడవరం: మన్యంలో బంద్ ప్రశాంతం

'ఆదివాసీ ప్రాంతంలో అన్ని రంగాల్లో ఉద్యోగావకాశాలు ఆదివాసీలకే వంద శాతం అవకాశం ఇవ్వాలి. 95% జనాభా ఉన్న వారికి 5% ఉద్యోగాలు, ఐదు శాతం జనాభా ఉన్న వారికి 95 శాతం ఉద్యోగాలు ఇవ్వడం దారుణం. గిరిజన ప్రాంతాల్లో ఏ రంగంలో కూడా మాకు ఐదు శాతంకు మించి ఉద్యోగాలు ఇవ్వకపోవడం అన్యాయం. మాకు ప్రత్యేక డీఎస్సీ అమలు చెయ్యాలి. భాషా వాలంటీర్లను రెన్యువల్​ చేసి జీతాలు పెంచాలి. రాష్ట్ర ప్రభుత్వ ఇప్పటికైనా దిగి వచ్చి మా డిమాండ్లను నెరవేర్చాలి లేకపోతే నిరసన ఉద్ధృతం చేస్తాము.'

'వంద శాతం రిజర్వేషన్లు కోరుతూ 29న ఆంధ్ర, తెలంగాణ మన్యం బంద్​'

Manyam Bandh Protest Demonds : ఈ రోజు జరుగుతున్న రాష్ట్ర మన్యం బందును విజయవంతం చేయాలని, ఆదివాసీ గిరిజన సంఘం, తెలుగుదేశం, బీజేపీ, పార్టీలు మద్దతుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని నిరసనకారులు కోరారు. నిరుద్యోగులు బంద్​లో పాల్గొన్నారు.

ఆదివాసీల​ డిమాండ్లు :

* ఆదివాసీలకు స్పెషల్ DSC విడుదల చెయ్యాలి

* జీఓ నెంబర్​ మూడు పునరుద్ధరణ

* ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసులకే 100% రిజర్వేషన్ కల్పించాలి

* నాన్ షెడ్డ్యూల్ గా ఉన్న 1500 ఆదివాసీ గ్రామాలను షెడ్డ్యూల్​ ఏరియాలో చేర్చాలి

జీవో నెం 3 రద్దుకు వ్యతిరేకంగా 'మన్యం బంద్​'

మన్యం ప్రాంతాల్లో స్పెషల్ డీఎస్సీ నిర్వహించాలని ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో మన్యం ప్రాంతాల్లో ఆదివారం ఏజెన్సీ బంద్​ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం గ్రామంలో బంద్ చేపట్టారు. మన్యం ప్రాంతాల్లోని ఉద్యోగాలను నూరు శాతం ఆదివాసీలకే ఇవ్వాలని పలువురు గిరిజన నాయకులు డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సాధారణ డీఎస్సీలో మన్యం ప్రాంతంలో 517 ఉద్యోగాలలో కేవలం 38 ఉద్యోగాలు మాత్రమే ఆదివాసులు కేటాయించడం తగదన్నారు. అనంతరం భారీగా రోడ్లపై చేరుకుని నినాదాలు చేశారు. కాగా మన్యం బంద్ కారణంగా దుకాణాలు మూతపట్టంతోపాటు రాకపోకలు స్తంభించాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.