ETV Bharat / state

దొంగతనం నేరం మోపీ కానిస్టేబుళ్లతో దాడి చేయించిన ఎమ్మెల్యే కుటుంబం?

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 26, 2024, 11:02 AM IST

15 ఏళ్లుగా గుంటూరు తూర్పు వైఎస్సార్​సీపీ ఎమ్మెల్యే ఇంట్లో పని చేస్తుంటే చోరీ నెపంతో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులే పోలీసులతో దాడి చేయించారని పనిమనిషి ఆషా ఆరోపించారు. తన కుమారుడు మసూద్‌ తెలుగుదేశంలో తిరుగుతున్నాడనే అక్కసుతోనే దాడి చేయించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Maid_Accusation_On_Guntur_East_MLA_Mustafa
Maid_Accusation_On_Guntur_East_MLA_Mustafa

టీడీపీ తిరుగుతున్నారనీ - దొంగతనం నేరం మోపీ కానిస్టేబుళ్లతో దాడి చేయించిన ఎమ్మెల్యే కుటుంబం?

Maid Accusation On Guntur East MLA Mustafa : వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఇంట్లో ఓ మహిళ సుమారు 15 ఏళ్ల నుంచి పని చేస్తోంది. ఆమె కుమారుడు ఇటీవల తెలుగుదేశం పార్టీ నాయకుల వెంట తిరుగుతున్నారు. ఇది జీర్ణించుకోలేని ఆ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఆమెపై చోరీ అభియోగం మోపారు. అదీ చాలక పోలీసులతో దాడి చేయించారు. ఈ ఘటన గుంటూరులో రాజకీయంగా కలకలం రేగింది. గురువారం గుంటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాధితులు గోడు వెల్లబోసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే,

తెలుగుదేశం పార్టీ నాయకులతో తిరుగుతున్నారని దాడి : గుంటూరు తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ముస్తఫా ఇంట్లో ఆషా అనే మహిళ గత 15 సంవత్సరాలుగా పని చేస్తున్నారు. ఆమె కుమారుడు మన్సూర్‌ తెలుగుదేశం పార్టీలో తిరుగుతున్నారు. ఈ విషయం తెలిసి ఎమ్మెల్యే కుమార్తె, నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా, ఆమె భర్త ఇద్దరు ఆషాను ఇంటికి పిలిపించి ప్రశ్నించారు. తనకు ఏమీ తెలియదని చెప్పినా ఇంట్లో ఆభరణాలు పోయాయని ఆ నేరం తనపై మోపారని, ఎమ్మెల్యే కుటుంబసభ్యులు పోలీసులతో కొట్టించారని పని మనిషి ఆషా ఆరోపించారు. తన కుమారుడు మసూద్‌ తెలుగుదేశం పార్టీలో తిరుగుతున్నాడనే అక్కసుతోనే దాడి చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఒంటరి మహిళపై వైఎస్సార్సీపీ నాయకుల దారుణం

ఆభరణాల చోరీ నిజమా? కాదా? : ఎమ్మెల్యే ముస్తఫా కుటుంబ సభ్యలు దాడి చేయించిన విషయంపై ఫిర్యాదు చేయడానికి ఆషా, మన్సూర్‌ గురువారం పెదకాకాని స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ ఉన్న పోలీసు సిబ్బంది వివరాలు తెలుసుకొని, ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లారని ఆషా తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయాల్సిన పోలీసులు ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. మరోవైపు ఆభరణాల చోరీ నిజమా కాదా? ఆషాను పోలీసులు కొట్టారా లేదా అనేది డీఎస్పీతో విచారించి చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది.

దళిత వృద్ధునిపై వైసీపీ ఎమ్మెల్యే అనుచరుల దాడి - ఖండించిన దళిత సంఘాలు

"మా అమ్మ 15 సంవత్సరాలుగా గుంటూరు తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ముస్తఫా ఇంట్లో పని చేస్తోంది. గత నాలుగు రోజుల నుంచి ఎమ్మెల్యే పెద్ద కూతురు ఇంట్లో పనికి పంపారు. ఇంట్లో నగలు పోయాయని వారు ఆరోపించి, ఆ నేరాన్ని మా అమ్మపై మోపారు. ఇద్దరు మగ కానిస్టేబుళ్లతో గదిలో బంధించి కొట్టించారు."- మసూద్‌, బాధితురాలి కుమారుడు

'ఆడుదాం ఆంధ్రా' పోటీల్లో ఘర్షణ - కుర్చీలతో దాడి చేసుకున్న ఆటగాళ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.