ETV Bharat / state

వైసీపీకి దళితులు ఎందుకు ఓటువేయాలి?: మాదిగ ఐకాస - Jagan government

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 24, 2024, 8:00 PM IST

Madiga Akasa leaders: కూటమి గెలుపు కోసం 35 మాదిగ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన యాత్ర నేడు వైఎస్ఆర్ కడప జిల్లాకు చెరుకుంది. ఈ సందర్భంగా మాదిక ఐకాస రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వరరావు మీడియా సమవేశం ఏర్పాటు చేశారు. దళితులు వైసీపీకి ఎందుకు ఓటు వేయాలో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేశారని మండిపడ్డారు.

Madiga Akasa leaders
Madiga Akasa leaders

దళితులు వైసీపీకి ఎందుకు ఓటువేయాలి?: మాదిగ ఐకాస

Madiga JAC leaders: సీఎం జగన్​కు ఎందుకు ఓట్లు వేయాలి, ఈ ఐదేళ్ల పాలనలో దళితులను హతమార్చినందుకు వేయాలా.? లేదంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన పథకాలను రద్దు చేసినందుకు వేయాలా.. అని మాదిగ ఐకాస రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వరరావు మాదిగ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గెలుపు కోసం రాష్ట్రంలోని 35 దళిత సంఘాలన్నీ ఏకమయ్యాయని తెలిపారు.

చంద్రబాబు నాయుడు గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని మాదిగ ఐకాస రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వరరావు వెల్లడించారు. కూటమికి ఓట్లు వేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా 35 మాదిగ సంఘాల ఆధ్వర్యంలో చేస్తున్నయాత్ర ఇవాళ వైఎస్ఆర్ కడప జిల్లాకు చేరుకుంది. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మీడియా సమావేశంలో నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘాలను పూర్తిగా నిర్వీర్యం చేశారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి సర్కార్ లో దళితులకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. ప్రతి దళితుడు వైఎస్ జగన్ ఓటమికి కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

రెండో విడత పోలింగ్​కు జోరుగా ఏర్పాట్లు- రాహుల్, హేమమాలిని భవితవ్యమేంటో?​ - Lok Sabha Elections 2024

వైఎస్ జగన్ గత ఎన్నికల్లో కోడి కత్తి కేసును సాకుగా చూపించి గెలుపొందారు. తాజాగా జరగబోయే ఎన్నికల్లో గులక రాయిని సాకుగా చూపించి మళ్లీ అధికారం చేపట్టాలని అనుకుంటున్నారని వెంకటేశ్వరావు విమర్శించారు. రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్​ను నమ్మే రోజులు పోయాయని పేర్కొన్నారు. సీఎం జగన్ అధికారంలోకిి వచ్చింది మెుదలు గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చి న ఉపకార వేతనాలను రద్దు చేశాడని పేర్కొన్నారు. అమ్మ ఒడి పేరుతో కేవలం ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే డబ్బులు ఇవ్వడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడు హయాంలో ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లు ఎంతో చక్కగా పని చేశాయని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో దళిత, గిరిజనులకు ఎంతోమందికి వాహనాలు ఇచ్చారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు ఓటు వేయాలని కోరారు. సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే, దళితులు ఉండరని పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్లే పరిస్థితి నెలకొంటుందని మాదిగ ఐకాస నేత వెంకటేశ్వరరావు తెలిపారు.

రెండో విడత పోలింగ్​కు జోరుగా ఏర్పాట్లు- రాహుల్, హేమమాలిని భవితవ్యమేంటో?​ - Lok Sabha Elections 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.