ETV Bharat / state

ఓడిపోయే వైఎస్సార్సీపీకి ఓటు వేసి వృథా చేసుకోవద్దు- గెలిచే పార్టీకి మైనార్డీలు దూరం కావొద్దు : షరీఫ్ - MA Sharif Allegations on YSRCP

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 9, 2024, 6:54 PM IST

Updated : May 9, 2024, 9:22 PM IST

MA Sharif on YSRCP Leaders Anarchy on Minorities: గెలిచే పార్టీకి మైనార్టీలను దూరం చేశామన్న అపవాదును ముస్లిం మతపెద్దలు తెచ్చుకోవద్దని శాసన మండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ హితవుపలికారు. వైసీపీ అబద్దాలు, అసత్యపు ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. టీడీపీ పాలనలోనే ముస్లిం సమాజానికి సంక్షేమం, అభివృద్ధి జరిగిందన్నారు. వైసీపీ నేతల ఒత్తిళ్లకు లొంగి మసీదుల్లో ముస్లిం మత పెద్దలు ఆ పార్టీకి ఓటు వేయమని చెప్పడం సరైన పద్దతి కాదన్నారు.

ma_sharif_on_ysrcp
ma_sharif_on_ysrcp (ETV Bharat)

MA Sharif on YSRCP Leaders Anarchy on Minorities: ఓడిపోయే వైసీపీకి ఓటేసి తమ అమూల్యమైన ఓటును వృథా చేసుకోవాద్దని శాసన మండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ స్పష్టం చేశారు. వైసీపీ అబద్దాలు అసత్యపు ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. టీడీపీ పాలనలోనే ముస్లిం సమాజానికి సంక్షేమం, అభివృద్ధి జరిగిందన్నారు. వైసీపీ నేతల ఒత్తిళ్లకు లొంగి మసీదుల్లో ముస్లిం మత పెద్దలు ఆ పార్టీకి ఓటు వేయమని చెప్పడం సరైన పద్దతి కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశందే గెలుపని చంద్రబాబు సీఎం కావడం ఖాయమని ఉద్ఘాటించారు.

జగన్‌ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్ద సీబీఐ - ముగిసిన వాదనలు - CM Jagan Foreign Tour Petition

గెలిచే పార్టీకి మైనార్టీలను దూరం చేశామన్న అపవాదును ముస్లిం మతపెద్దలు తెచ్చుకోవద్దని హితవుపలికారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ యథాతథంగా ఉంటుందన్నారు. కేసుల కోసం గత ఐదేళ్లు బీజేపీతో అంటకాగింది జగన్ రెడ్డేనని గుర్తుచేశారు. నేడు బీజేపీతో తెలుగుదేశం పొత్తు రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని స్పష్టం చేశారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు, పెట్టుబడులు లేవని వాపోయారు. రాష్ట్రం పది సంవత్సరాలు వెనుకకు పోయిందని ఎంఏ షరీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్‌ మీ బిడ్డ కాదు- రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్‌ గడ్డ: చంద్రబాబు - CHANDRABABU fire on JAGAN

జగన్ అధికారంలోకి వచ్చాక మైనార్టీలను మోసం చేశారని షరీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లింల పథకాలను ఆపేశారని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారని మండిపడ్డారు. అంతే కాకుండా జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను పూర్తిగా మోసం చేశారని అన్నారు. డీఎస్సీ ఇస్తామని ఇబద్దపు హామీలు ఇచ్చి ఇప్పుడు మాట మార్చారని అన్నారు. కొంతమంది వైసీపీ నేతలు టీడీపీ ముస్లింలకు అన్యాయం చేస్తుందని దుష్ప్రచారం చేస్తున్నారు వాటిని ఎవరూ నమ్మవద్దని షరీఫ్ కోరారు. జగన్​ను గద్దె దించి సాగనంపడానికి ప్రతిఒక్కరూ సిద్ధంగా ఉండాలని ఎంఏ షరీఫ్ అన్నారు.

ప్రభుత్వ సొమ్ముతో ఓట్లు కొనేందుకు జగన్ కుట్ర- రూ.4వేల కోట్లు విడుదల చేసినట్లు ఈసీ​ నివేదిక : నీలాయపాలెం - Nilayapalem Vijay Kumar on YCP Scam

ఓడిపోయే వైఎస్సార్సీపీకి ఓటు వేసి వృథా చేసుకోవద్దు- గెలిచే పార్టీకి మైనార్డీలు దూరం కావొద్దు : షరీఫ్ (ETV Bharat)

వైసీపీ అబద్దాలు అసత్యపు ప్రచారాలను నమ్మి ఓడిపోయే వైసీపీకి ఓటేసి అమూల్యమైన ఓటును వృథా చేసుకోవద్దు. టీడీపీ పాలనలోనే ముస్లిం సమాజానికి సంక్షేమం, అభివృద్ధి జరిగింది. వైసీపీ నేతల ఒత్తిళ్లకు లొంగి మసీదుల్లో ముస్లిం మత పెద్దలు ఆ పార్టీకి ఓటు వేయమని చెప్పడం సరైన పద్దతి కాదు. గెలిచే పార్టీకి మైనార్టీలను దూరం చేశామన్న అపవాదును ముస్లిం మతపెద్దలు తెచ్చుకోవద్దు. కేసుల కోసం గత ఐదేళ్లు బీజేపీతో అంటకాగింది జగన్ రెడ్డే. నేడు బీజేపీతో తెలుగుదేశం పొత్తు రాష్ట్ర ప్రయోజనాల కోసమే పెట్టుకున్నారు తప్ప జగన్​లా కేసుల కోసం కాదు.- ఎం.ఏ. షరీఫ్ , శాసన మండలి మాజీ చైర్మన్

Last Updated : May 9, 2024, 9:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.