ETV Bharat / state

ప్రభుత్వ సొమ్ముతో ఓట్లు కొనేందుకు జగన్ కుట్ర- రూ.4వేల కోట్లు విడుదల చేసినట్లు ఈసీ​ నివేదిక : నీలాయపాలెం - Nilayapalem Vijay Kumar on YCP Scam

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 9, 2024, 5:23 PM IST

Updated : May 9, 2024, 9:22 PM IST

Nilayapalem Vijay Kumar on YCP Government Scam in Schemes: పోలింగ్‌కు ముందు ఓట్ల కొనుగోలుకు వైసీపీ కుట్రపన్నిందని తెలుగుదేశం నేత నీలాయపాలెం విజయ్‌కుమార్‌ ఆరోపించారు. సీఎస్‌కు ఈసీ ఇచ్చిన తాజా నివేదిక ద్వారా ఇదంతా బట్టబయలైందని వెల్లడించారు. రూ. 4 వేల కోట్లను జనవరిలోనే శాఖల ఖాతాల్లో ప్రభుత్వం జమచేసిందని 4 నెలలుగా ఆ నిధులను ఎక్కడుంచారో సీఎస్‌ చెప్పాలని విజయ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.

nilayapalem_vijay_kumar
nilayapalem_vijay_kumar (Etv Bharat)

Nilayapalem Vijay Kumar on YCP Government Scam in Schemes: పోలింగ్​కు ఒకటి రెండ్రోజులు ముందు లబ్దిదారుల అకౌంట్లలో నగదు బదిలీ చేసి ప్రజల డబ్బుతో వారి ఓట్ల కొనుగోలుకు వైసీపీ ప్రభుత్వం కుట్ర పన్నిందని తెలుగుదేశం అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ ధ్వజమెత్తారు. ఎన్నికల కోడ్ రాకముందే వివిధ పథకాల నిధులు పబ్లిక్ డొమైన్​లో ఉన్నాయని ఈసీ సీఎస్​కు ఇచ్చిన తాజా నివేదిక ద్వారా ఇది బట్టబయలు అయిందన్నారు. నాలుగు నెలల నుంచి నిధులు ఎందుకు ఖాజానాలోనే ఉంచారన్న ఈసీ ప్రశ్నలకు సీఎస్ ఏం సమాధానం చెప్పాలని నిలదీశారు. వివిధ పథకాలకు సంబంధించిన 14 వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం జనవరిలోనే ఆయా శాఖల ఖాతాల్లో జమ చేసిందని మండిపడ్డారు.

'ఆస్తి హక్కును హరించే చట్టమిది'- ల్యాండ్‌ టైటిలింగ్​తో ఎవరికి మేలో చెప్పండి జగనన్న! - Lawyers Comments on Land Titling

4 నెలల పాటు 14 వేల కోట్లు ఎక్కడ పెట్టారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జనవరిలో 13 వేల కోట్లకు పైగా రెవెన్యూ ఖర్చు ఎందుకొచ్చిందని ఇప్పటికే తెలుగుదేశం నిలదీసిన విషయాన్ని గుర్తు చేశారు. బాండ్ల ద్వారా ఏపీఎండీసీ సేకరించిన 7 వేల కోట్ల రూపాయలను ఖజానాకు జమ చేసుకుని, వాటిని పథకాల కోసం వివిధ శాఖలకు మళ్లించారని దుయ్యబట్టారు. ఏప్రిల్ నెలలో అవ్వా తాతలకు ఫించన్ ఇచ్చేందుకు కూడా డబ్బులు లేవని జగన్ బొంకారని విజయ్ ఆరోపించారు. సీఎస్​కు తెలియకుండానే 14 వేల కోట్ల రూపాయలు వివిధ శాఖల్లో నాలుగు నెలలుగా మగ్గుతున్నాయని అని ప్రశ్నించారు. ఆయా శాఖల కార్యదర్శులు లబ్ధిదారులకు బదిలీ చేయకుండా ఎందుకు 4 నెలల నుంచి ఖజానాలోనే ఉంచారని విజయ్ కుమార్ నిలదీశారు.

ప్రభుత్వ సొమ్ముతో ఓట్లు కొనేందుకు జగన్ కుట్ర- రూ.4వేల కోట్లు విడుదల చేసినట్లు ఈసీ​ నివేదిక : నీలాయపాలెం (Etv Bharat)

హైదరాబాద్​ నుంచి ఏపీకి తరలి వచ్చేందుకు ఓటర్లు సిద్ధం - రైళ్లు, బస్సుల్లో సీట్లన్నీ ఫుల్​ - People Ready to vote

పోలింగ్‌కు ముందు ఓట్ల కొనుగోలుకు వైసీపీ కుట్ర పన్నింది. ప్రజల సొమ్ముతోనే ప్రజల ఓట్లు కొనేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. కోడ్ రాకముందే పథకాల నిధులు పబ్లిక్ డొమైన్‌లో ఉన్నాయని స్పష్టమైంది. సీఎస్‌కు ఈసీ ఇచ్చిన తాజా నివేదిక ద్వారా ఇదంతా బట్టబయలైంది. 4 నెలలు ఖజానాలోనే ఎందుకుంచారన్న ఈసీ ప్రశ్నలకు సీఎస్ ఏం చెప్తారు. రూ.14 వేల కోట్లను జనవరిలోనే శాఖల ఖాతాల్లో ప్రభుత్వం వేసింది. అయితే ఆ రూ.14 వేల కోట్లను 4 నెలలుగా ఎక్కడుంచారో సీఎస్‌ చెప్పాలి.- నీలాయపాలెం విజయ్ కుమార్, టీడీపీ అధికార ప్రతినిధి

చివరి రోజు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్​లో అవే అవస్థలు - postal ballot Voting process

Last Updated : May 9, 2024, 9:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.