ETV Bharat / state

ఓట్లపై వాలంటీర్ల ప్రభావం - ఎన్నికలప్పుడు వారిని వేరే జిల్లాలకు బదిలీ చేయాలి: జేడీ లక్ష్మీనారాయణ

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 13, 2024, 12:12 PM IST

Jd Lakshminarayana Comments on YCP GOvernment
Jd Lakshminarayana Comments on YCP GOvernment

JD Lakshminarayana Comments on YCP Government: సీఎం జగన్​ వాలంటీర్ల వ్యవస్థ తీసుకువచ్చి బటన్ నొక్కాటానికే పరిమితం అయ్యారని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ అన్నారు. పట్టణ ప్రాంతాల్లో కేవలం 60 శాతం మాత్రమే ఓటింగు నమోదవుతుండటంతో ఓటు బ్యాంకు రాజకీయాలు పెరిగిపోతున్నాయని జేడీ అన్నారు. ఎన్నికల్లో ఓటర్లంతా సమయస్ఫూర్తితో ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును చక్కగా వినియోగించుకోవాలని జేడీ సూచించారు.

JD Lakshminarayana Comments on YCP Government: ముఖ్యమంత్రి జగన్ సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ల వ్యవస్థ తీసుకువచ్చి బటన్ నొక్కటానికే పరిమితం అయ్యారని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ విమర్శించారు. విధాన పరమైన నిర్ణయాలన్నీ జగన్ ఒక్కరే తీసుకుంటున్నారని మండిపడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో సలహాలు తీసుకోవట్లేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో కేవలం 50 నుంచి 60 శాతం మాత్రమే ఓటింగు నమోదవుతుందన్నారు. 40 శాతం మంది ప్రజలు ఓటు వేయకపోవడంతో ఓటు బ్యాంకు రాజకీయాలు అనేవి పెరిగిపోతున్నాయని జేడీ అన్నారు. గ్రామ వాలంటీర్లు ఈ ఓటు హక్కుపై ప్రభావితం చూపిస్తున్నారని, చాలా చోట్ల నుంచి ఫిర్యాదులు వస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో వాలంటీర్లను వాళ్ల జిల్లాల నుంచి పక్క జిల్లాలకు బదిలీ చేయాలని ఎన్నికల కమీషన్​ను కోరినట్లు తెలిపారు. ఎన్నికలనేవి పారదర్శకంగా జరగాలి. అందుకే ప్రభుత్వం, ఈసీ ఈ విషయాలను పట్టించుకుని తగిన మార్పులు చేస్తారని భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

అందరూ ఉద్యమిస్తే ప్రత్యేక హోదా కచ్చితంగా సాధిస్తాం: జేడీ

రాష్ట్రంలో సామ్యవాదం పోయి పెట్టుబడి దారీ విధానం వచ్చిందన్నారు. ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం మాత్రం మొండిగా వ్యవహరిస్తుందని జేడీ పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజలు గొంతులను నొక్కేసి స్వేచ్ఛగా ఆలోచించే సమయం ఇవ్వడం లేదన్నారు. యువతరం రాజకీయాలకు దూరంగా ఉండటంతో కొంతమంది కుటుంబ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టే వారికే సీట్లను కేటాయిస్తూ యువ నాయకత్వం లేకుండా నిర్వీర్యం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికల్లో ఓటర్లంతా సమయస్ఫూర్తితో ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును చక్కగా వినియోగించుకోవాలని జేడీ సూచించారు.

జగన్ వాలంటీర్ల వ్యవస్థ తీసుకువచ్చి బటన్ నొక్కటానికే పరిమితం అయ్యారు: జేడీ లక్ష్మీనారాయణ

అవినీతి, డ్రగ్స్, రౌడీయిజం లేని రాష్ట్రం కావాలి: జేడీ లక్ష్మీనారాయణ

అవినీతి, డ్రగ్స్, రౌడీయిజం, ప్రకృతి విధ్వంసం లేని రాష్ట్రం కావాలని లక్ష్మీనారాయణ అన్నారు. జై భారత్ నేషనల్ పార్టీ మేనిఫెస్టో అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా రూపొందించినట్లు తెలిపారు. మిగతా రాజకీయ పార్టీలు కూడా తమ మేనిఫెస్టో తరహాలో ప్రజలకు మేలు కలిగే మేనిఫెస్టోలు రూపొందించాలని సూచించారు. ప్రత్యేక హోదా సాధించుకోవడానికి నాలుగు సార్లు అవకాశం వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఏడాదికి రూ.100 కోట్ల నిధులు కేటాయించాలని, ఒక్కో గ్రామ పంచాయతీకి రూ. కోటి మంజూరు చేయాలన్నారు. గ్రామ పంచాయతీల నిధులను దారి మళ్లించడం వల్ల సర్పంచులు ముసుగులు వేసుకుని తిరగాల్సిన పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు.

ప్రత్యేక హోదా సాధనకు ఇదే చక్కని అవకాశం - బడ్జెట్​ను అడ్డుకోవాలి : జేడీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.