ETV Bharat / state

విశాఖలో అసైన్డ్ భూములపై సీఎస్ కన్ను - రూ.2 కోట్లు పలికే భూములు ఐదారు లక్షలకే: మూర్తియాదవ్‌ - Murthy Yadav Allegations on CS

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 25, 2024, 2:45 PM IST

Murthy Yadav Allegations on CS Jawahar Reddy: ఉత్తరాంధ్రలో 2 వేల కోట్ల రూపాయల విలువైన అసైన్డ్ భూములు సీఎస్‌ జవహర్ రెడ్డి కొట్టేశారని జనసేన కార్పొరేటన్‌ పీతల మూర్తియాదవ్‌ ఆరోపించారు. ఎన్నికల హింసపై పర్యవేక్షించకుండా సీఎస్‌ విశాఖలో భూవ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నారని మండిపడ్డారు. అసైన్డ్‌ భూములు కొట్టేసిన వైఎస్సార్సీపీ నేతలు, ఐఏఎస్‌లపై సీబీఐ విచారణకు డిమాండ్‌ చేశారు. వెంటనే ఈసీ జోక్యం చేసుకోవాలని కోరారు.

Murthy Yadav Allegations on CS Jawahar Reddy
Murthy Yadav Allegations on CS Jawahar Reddy (ETV Bharat)

Murthy Yadav Allegations on CS Jawahar Reddy : ఉత్తరాంధ్రలో 2 వేల కోట్ల రూపాయల విలువైన అసైన్డ్ భూములు సీఎస్‌ జవహర్ రెడ్డి కొట్టేశారని జనసేన కార్పొరేటన్‌ పీతల మూర్తియాదవ్‌ ఆరోపించారు. జవహర్‌రెడ్డి సీఎస్‌ అయ్యాకే భూముల మార్పిడి జీవో 596 ఇచ్చారన్న ఆయన 800 ఎకరాలకు పైగా భూములకు డీల్‌ జరిగిందని తెలిపారు. ఎన్నికల హింసపై పర్యవేక్షించకుండా సీఎస్‌ విశాఖలో భూవ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నారని మూర్తియాదవ్‌ మండిపడ్డారు.

CS Jawahar Reddy Encroaching Assigned Lands in Visakhapatnam? : 4 రోజుల క్రితం రిజిస్ట్రేషన్లకు వచ్చి భోగాపురం ఎయిర్‌పోర్టుపై సమీక్షించారని పీతల మూర్తి యాదవ్‌ తెలిపారు. నెల రోజుల్లో పదవీ విరమణ చేయనుండగా భారీగా భూఅక్రమాలకు తెరలేపారని, 400 ఎకరాల ఎస్సీ, బీసీల అసైన్డ్ భూములను బినామీల పేరిట చేజిక్కించుకున్నారని, భోగాపురం విమానాశ్రయం చుట్టూ వందల ఎకరాలపై జవహర్‌రెడ్డి కన్నేశారని ఆరోపించారు. విశాఖ, విజయనగరం జిల్లా భూములపై సీఎస్‌ కన్నేసి కుమారుడిని రంగంలోకి దింపారని అన్నారు.

రెవెన్యూ వ్యవహారాల్లో అధికార పార్టీ నేతల జోక్యం - ఏకపక్షంగా భూ రికార్డులు తారుమారు - YSRCP Leaders Land Grabs

ఎకరం రూ.2 కోట్లు పలికే భూములకు ఐదారు లక్షలకే ఒప్పందాలు కుదర్చుకున్నారని నిప్పులు చెరిగారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మళ్లీ రాదన్న భయంతో హడావిడిగా రిజిస్ట్రేషన్లకు సిద్ధం చేసుకున్నారని తెలిపారు. ఈసీ జోక్యం చేసుకుని అక్రమ భూరిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా మార్చి నుంచి జరిగిన రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని కోరారు. అసైన్డ్‌ భూములు కొట్టేసిన వైఎస్సార్సీపీ నేతలు, ఐఏఎస్‌లపై సీబీఐ విచారించాలని డిమాండ్ చేశారు.

విశాఖలో అసైన్డ్ భూములపై సీఎస్ కన్ను - రూ.2 కోట్లు పలికే భూములు ఐదారు లక్షలకే:మూర్తియాదవ్‌ (ETV Bharat)

రెవెన్యూ రికార్డుల్లో ఇష్టానుసారం పేర్లు మార్చడం ఏంటి? - అధికారులపై హై కోర్టు ఆగ్రహం - Lands Dispute Case in High Court

ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్​పై ఎక్స్​లో లోకేశ్​ పోస్టు - వీడియో సామాజిక మధ్యమాల్లో వైరల్ - CBN Responded Titling Act in X

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.