కొండను మింగేస్తున్నా కళ్లు మూసుకున్న అధికారులు - మట్టి మాఫియా ఇష్టారాజ్యం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 21, 2024, 1:55 PM IST

illeagal_soil_mining_in_satyasai_district

Illeagal Soil Mining in Satyasai District: అనుమతులు లేకపోయినా యంత్రాలతో అక్రమంగా, కొండలను తవ్వుతూ మట్టిని తరలిస్తున్నారు. భారీ యంత్రాలతో మట్టిని తవ్వి తరలిస్తు అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. దీనిని అడ్డుకోవాలని స్థానికులు ప్రయత్నించినా ఫలితం లభించడంలేదు.

కొండను మింగేస్తున్నా కళ్లు మూసుకున్న అధికారులు - మట్టి మాఫియా ఇష్టారాజ్యం

Illeagal Soil Mining in Satyasai District: మట్టివ్యాపారులు అడ్డు అదుపు లేకుండా చెలరేగిపోతున్నారు. వందల ఎకరాల్లో విస్తరించిన కొండను యంత్రాలతో తవ్వేస్తూ పిండి చేసేస్తున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా అక్రమంగా తరలిస్తూ, సొమ్ము చేసుకుంటున్నారు. ఇంతా జరుగుతున్న అధికారులేవరూ అటువైపూ కన్నెత్తైనా చూడటం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మూగజీవాలకు గ్రాసానికి ఆధారమైన కొండను తవ్వొద్దని గ్రామస్థులు అడ్డుకునేందుకు యత్నించినా, అనుమతులు ఉన్నాయని అబద్దాలతో ఈ అక్రమ దందాను కొనసాగిస్తున్నారు.

శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం చౌటతండా సమీపంలోని వందల ఎకరాల్లో కొండలు విస్తరించి ఉన్నాయి. వీటిపై మట్టి వ్యాపారులు కన్నేశారు. గత నెల రోజులుగా యంత్రాల సహాయంతో కొండను తవ్వి మట్టిని తరలిస్తున్నారు. మట్టిని అక్రమంగా తవ్వి తరలిస్తూ, కొండ నామారూపాలు లేకుండా చేస్తున్నారు.

వైసీపీ నేతల మట్టి దోపిడీపై అధికారుల ఉదాసీనత! విప్ అండదండలతోనే తవ్వకాలన్న టీడీపీ నేత కాలవ

భూగర్భ జలాలు పెంచాలనే ఉద్దేశంతో ఈ కొండ పరిధిలో 25 ఎకరాల విస్తీర్ణంలో వాటర్ షెడ్లు నిర్మించారు. లక్షలాది రూపాయల వ్యయంతో 2017లో చెక్ డ్యామ్​లను సైతం నిర్మించారు. 14 లక్షల రూపాయల వ్యయంతో పలు రకాల మొక్కలను నాటారు. ఇదే విషయాన్ని స్థానికులు మట్టి వ్యాపారులకు వివరించినా ప్రయోజనం లేకుండా పోయింది. టిప్పర్లతో మట్టిని తరలిస్తూ కొండను కొల్లగొట్టేస్తున్నారు.

తమ జీవనాధారమైన గొర్రెలు, మేకలు మేపడానికి ఆధారమైన కొండను నాశనం చేయద్దంటూ, రెండు రోజులుగా తండా వాసులు అడ్డుకున్నా మట్టి తవ్వకాలు ఆగలేదు. మూగజీవాలను మేపడానికి ఎక్కడికి వెళ్లాలని పశువువ కాపరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి మట్టిన తరలించడాన్ని అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

YSRCP Leaders Illegal Mining అర్ధరాత్రి గ్రామ చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు.. అడ్డుకున్న స్థానికులు

పంట పొలాలకు, గృహవసరాలకు ఎడ్ల బండ్లతో మట్టిని తరిలిస్తున్నప్పుడు అడ్డుకున్న, రెవెన్యూ, మైనింగ్, విజిలెన్స్ అధికారులకు ఇది కనపడటం లేదా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అనుమతులు లేవని అప్పుడు గుర్తుకు వచ్చిన అంశం, ఇప్పుడు గుర్తుకు రావడం లేదా అని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమార్కులు మట్టిని తరలించకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.

"20 - 25 సంవత్సరాల నుంచి ఈ కొండను కాపాడుకుంటూ వస్తున్నాం. ఇక్కడ సీతాఫలం వంటి చెట్లను పెంచుకుంటున్నాం. అటువంటిది దీనిని ఇప్పుడు నాశనం చేస్తున్నారు." -రామదాసునాయక్, చౌటతండా

యధేచ్ఛగా మట్టి తరలింపు.. దెబ్బతిన్న వంతెన

"ఈ గుట్టలను నాశనం చేస్తుంటే మా గొర్రెలు, మేకలు మేపుకోడానికి ఇబ్బందిగా మారింది. ఇలా అయితే మేము గొర్లను, మేకలను ఎలా మేపుకోవాలి. వాటర్​ షెడ్​ కింద గతంలో నాటిన మొక్కలన్నీ పోతున్నాయి." -సురేశ్​ నాయక్, చౌటతండా

గ్రావెల్‌ కోసం సిద్ధేశ్వర కొండ చుట్టూ తవ్వకాలు.. రూ.3 కోట్ల విలువైన మట్టి తరలింపు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.