ETV Bharat / state

టీడీపీ అభ్యర్థి పులివర్తి నానికి 1+1 సెక్యూరిటీ ఇవ్వాలి: ఏపీ హైకోర్టు - Pulivarthi Nani

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 29, 2024, 3:40 PM IST

Updated : Apr 29, 2024, 4:43 PM IST

Etv Bharat
Etv Bharat

High Court Orders to Provide Security to Pulivarthi Nani: చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానికి 1+1 సెక్యూరిటీ ఇవ్వాలని పోలీసు శాఖను హైకోర్టు ఆదేశించింది. అలానే పులివర్తి నాని కుటుంబసభ్యులకు కూడా భద్రత కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది.

High Court Orders to Provide Security to Pulivarthi Nani: చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానికి (Chandragiri TDP Candidate Pulivarthi Nani) 1+1 సెక్యూరిటీ ఇవ్వాలని పోలీసు శాఖను హైకోర్టు ఆదేశించింది. అలానే పులివర్తి నాని కుటుంబసభ్యులకు కూడా భద్రత కల్పించాలని ఆదేశాలు జారీచేసింది. గతంలో పులివర్తి నాని ఎస్పీని కోరినా భద్రత కల్పించలేదని హైకోర్టును ఆశ్రయించారు. పులివర్తి నాని తరఫున న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. గతంలో హైకోర్టు ఆదేశాలతో 2+2 భద్రత ఇచ్చినచ్చే ఇచ్చి మళ్లి తొలగించారని న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. భద్రత కల్పించాలని ఎస్పీని కోరినా ఉత్తర్వులు ఇవ్వలేదని న్యాయవాది అన్నారు. పోటీ చేసిన అభ్యర్థికి భద్రత ఇవ్వాలి కదా అని హైకోర్టు ప్రశ్నించింది. పులివర్తి నాని, కుటుంబసభ్యులకు 1+1 భద్రత ఇవ్వాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

జగన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ - ఇసుక అక్రమ తవ్వకాలు వెంటనే నిలిపివేయాలని ఆదేశం - Supreme Court Orders to AP Govt

అధికార పార్టీకే భద్రత: ఏ ప్రభుత్వమైనా సరే ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులకు భద్రత కల్పిస్తుంది. కానీ విధ్వంసానికి తెగబడుతున్న జగన్‌ ప్రభుత్వం మాత్రం ఆ భద్రతనూ తమ ప్రయోజనాల కోసం మాత్రమే వాడుకుంటోంది. వైసీపీ నాయకులైతే చాలు అదేదో ఏకైక అర్హత అన్నట్లుగా భద్రతా సిబ్బందిని కేటాయించేస్తోంది. అదే ప్రతిపక్ష పార్టీల నాయకులకు ముప్పున్నా సరే భద్రత కల్పించకుండా వారి ప్రాణాలతో చెలగాటమాడుతోంది. వైసీపీ నేతల ఆదేశాలే చట్టమన్నట్లుగా పనిచేస్తున్న నిఘా, పోలీసు విభాగాలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాయి. అధికార పార్టీ నాయకులకైతే ఓ న్యాయం విపక్షాల వారికి మరో న్యాయం అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి.

ఓటర్లకు వైఎస్సార్సీపీ తాయిలాల ఎర - లక్షా 26 వేల కుక్కర్ కూపన్లు స్వాధీనం - YSRCP Cookers Distribution

ఇలా రాజీనామా అలా భద్రత వెనక్కు: టీడీపీ సీనియర్‌ నేత గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా, అది ఆమోదం పొందిన వెంటనే భద్రతను తొలగించారు. కానీ టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీలోకి వెళ్లిన వాసుపల్లి గణేశ్‌కుమార్‌, వల్లభనేని వంశీమోహన్‌లపై అనర్హత వేటు పడినా వారికి మాత్రం భద్రతను కొనసాగిస్తున్నారు. వంశీకైతే ఏకంగా 4 ప్లస్‌ 4, వాసుపల్లి గణేశ్‌కుమార్‌కు 1 ప్లస్‌ 1 భద్రత కల్పించారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఇటీవల వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. అప్పటివరకూ ఆయనకు 2 ప్లస్‌ 2 భద్రత కల్పించిన ప్రభుత్వం పార్టీ మారగాని దాన్ని కుదించేసింది.

అన్నొస్తే అన్నీ బందే - ఆర్టీసీ బస్సులు లేక ప్రజలు ఇబ్బందులు - JAGAN ELECTION CAMPAIGN

కోర్టును ఆశ్రయిస్తేనే: ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్‌, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు 1 ప్లస్‌ 1 భద్రత ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుల ఫోన్ల ట్యాపింగ్‌కు పాల్పడుతోందని కేశవ్ ఆరోపించిన అనంతరం ఆయనకున్న భద్రతను తీసేశారు. చివరికి ఆయన భద్రత కోసం హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.

Last Updated :Apr 29, 2024, 4:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.