Gurukula JL Results 2024 Released : గురుకుల విద్యాసంస్థల్లో జూనియర్ లెక్చరర్ పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల నిరీక్షణకు తెరపడింది. జేఎల్ పోస్టులకు(TREIRB JL Results 2024) సంబంధించిన ఫలితాలను గురుకుల నియామక బోర్డు ప్రకటించింది. వివిధ విభాగాలకు సంబంధించిన ఎంపికైన 1,393 మందికి సంబంధించిన హాల్‌టికెట్ నంబర్‌లను బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.
జూనియర్ లెక్చరర్ విభాగంలో మ్యాథమ్యాటిక్స్‌కి 303, ఫిజిక్స్ 190, కెమిస్ట్రీ 189 మంది ఎంపికైనట్లు గురుకుల బోర్డు స్ఫష్టం చేసింది. తెలుగు 210, ఇంగ్లీష్ 215, ఉర్దూ 27 మంది, హిందీ భాష బోధనకు 20 మంది జూనియర్ లెక్చరర్‌లుగా ఎంపికైనట్లు తెలిపింది. ఇక కామర్స్ 77, ఎకనామిక్స్ 75, హిస్టరీ 7, కామర్స్ విభాగానికి 80 మంది జూనియర్ లెక్చరర్‌లను ఎంపికచేసినట్లు అధికారికంగా ప్రకటించారు. దివ్యాంగుల కేటరిగి ఫలితాలు త్వరలో వెల్లడించనున్నట్లు బోర్డు పేర్కొంది. వెబ్‌సైట్ https://treirb.cgg.gov.in/homeలో అందుబాటులో ఉంచారు. జేఎల్ రాత పరీక్షలు గతేడాది ఆగస్టు 3 నుంచి 23వ తేదీ వరకు జరిగిన విషయం తెలిసిందే.
గ్రూప్- 4 ఫలితాలు విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ
Gurukula Results 2024 : రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో ఖాళీల భర్తీకి గురుకుల బోర్డు పెద్దసంఖ్యలో పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేసింది. 9,210 పోస్టుల భర్తీకి నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహించింది. ఈ పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా 2.66 లక్షల మంది దరఖాస్తు చేయగా, 17 జిల్లాల్లోని 104 కేంద్రాల్లో రోజుకు మూడు షిప్టుల చొప్పున రాత పరీక్షలను గురుకుల నియామక బోర్డు(TREIRB) నిర్వహించింది. వాటికి సగటున 75.68 శాతం మంది హాజరయ్యారు.
జేఈఈ మెయిన్స్ ఫలితాలు విడుదల - 100 పర్సంటైల్‌తో సత్తాచాటిన తెలుగు విద్యార్థులు
రెండ్రోజుల్లో కానిస్టేబుల్ శిక్షణ ప్రారంభం - ఆ విభాగం వారికి ట్రైనింగ్ ఇప్పుడు లేనట్టే