ETV Bharat / state

గీతంలో జోష్ నింపిన ప్రణామ్ - విద్యార్థుల ఆటపాటలతో కోలాహలం

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 10, 2024, 12:44 PM IST

Gitam University Pranaam Celebrations : విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి తగ్గించి వారిలో కొత్త ఉత్తేజాన్ని పెంపొందించడానికి సంగారెడ్డిలోని గీతం డీమ్డ్‌ యూనివర్సిటీ ప్రమాణ పేరుతో కార్యక్రమాన్నిఏర్పాటు చేసింది. కార్యక్రమాలన్నీ కూడా విద్యార్థులే నిర్వహించడం వలన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. క్యాంపస్‌ మెుత్తం విద్యార్థుల ఆట పాటలు, బైక్‌, కార్ల విన్యాసాలతో ఓ పండగ వాతావరణంలా నెలకొంది.

Pranaam 2024 Celebrations
Gitam University Pranaam Celebrations
గీతంలో జోష్ నింపిన ప్రణామ్- విద్యార్థుల ఆటపాటలతో కోలాహలం

Gitam University Pranaam Celebrations : గీతం యూనివర్సీటీలో మూడురోజుల పాటు నిర్వహించిన ప్రాణామ్ (Pranaam 2024) కార్యక్రమాలకు జిల్లాలోని వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. సాంస్కృతిక విభాగం, పాటలు, సంగీతం, బ్యాండ్‌, గిటార్‌ వంటి అంశాలతో పోటీ పడ్డారు. యూనివర్సిటీలో(Gitam University) తొలిరోజు విద్యార్థులంతా సాంప్రదాయ దుస్తులతో రావాలన్న నిర్ణయం మేరకు అబ్బాయిలు పంచె, చొక్కాలతో వచ్చి సందడి చేయగా, అమ్మాయిలు చీరకట్టులో వచ్చి అలరించారు. ఇలాంటి కార్యక్రమాలు తమకు చాలా ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయని విద్యార్థులు చెబుతున్నారు.

కార్యక్రమంలో భాగంగా మానసిక ఒత్తిడిని ఏవిధంగా తగ్గించవచ్చు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వచ్చినప్పుడు ఏవిధమైన నిర్ణయాలు తీసుకోవాలనే అంశంపై, సైకాలజీ విద్యార్థులు ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేసి వివరించారు. ఒత్తిడి అనేది కేవలం చదువు వల్ల మాత్రమే కలుగుతుందనే అపోహను వీడాలని వారు సూచించారు. ముందుగా మనపై మనకు ఉన్న నమ్మకాన్ని బలపరుచుకోవాలని, తాము చెబుతున్న టిప్స్‌ ద్వారా కొంత ఒత్తిడిని దూరం చేయోచ్చంటూ విద్యార్థినులు వివరించారు.

గీతం డీమ్డ్‌ యూనివర్సిటీలో హోమ్‌ కమింగ్‌ కార్యక్రమం - ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మురిసిపోయిన విద్యార్థులు

Pranaam 2024 Celebrations : మారుతున్న వాతావరణాల దృష్ట్యా నూతన కట్టడాలకు అనుగుణంగా ఆర్కిటేచర్‌ నమూనాలను విద్యార్థులు రూపొందించి ప్రదర్శించారు. నాణ్యత, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా ప్రత్యేకించి ఇళ్లను నిర్మించడానికి తమ జ్ఞానాన్నంతా ఉపయోగించి నమూనాలను తయారుచేశారు. రాబోయే రోజుల్లో అందుబాటులోకి వచ్చేలా ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నాట్లు తెలిపారు. అదేవిధంగా ప్రత్యేకంగా బైక్‌ రైడ్‌, కార్ల ద్వారా స్టంట్స్‌ చేస్తు విద్యార్థులు ఆకట్టుకున్నారు.

తమ ఉల్లాసాన్ని రెట్టింపు చేయడానికి ప్రత్యేకంగా బైక్‌ రైడ్‌, కార్ల ద్వారా స్టంట్స్‌ చేస్తూ విద్యార్థులను కట్టిపడేశారు. వారు ప్రదర్శిస్తున్న తీరును విద్యార్థులు తమ చరవాణిల్లో పదిలపరుచుకున్నారు. ఇలాంటి బైకులు రైడ్‌ చేయడం కూడా తొలిసారే అయినా మంచి అనుభూతిని మిగిల్చిందని విద్యార్థునులు చెబుతున్నారు. ఇక్కడ ఎక్పోలో బ్యాటరీసాయంతో గంటకు 60 కిలో మీటర్ల వేగంతో నడవగల బైక్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనిని నడపడానికి అమ్మాయి పోటీ పడ్డారు. వాటిని నడుపుతు కేరింతలు కొడుతూ వారి ఆనందానికి అడ్డుకట్టులు తెంచుకున్నాయి. ఇవి మన హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్నాయని ప్రదర్శకులు చెబుతున్నారు.

"మా యూనివర్సిటీలో ప్రాణామ్ పేరిట మూడు రోజుల పాటు కార్యక్రమాలను నిర్వహించడం ఆనందంగా ఉంది. మన సంస్కృతిని ప్రతిబింబించేలా ఆటపాటలను ప్రదర్శిస్తున్నారు. ప్రత్యేకంగా బైక్‌ రైడ్‌, కార్ల ద్వారా స్టంట్స్‌ ఆకట్టుకుంటున్నాయి. మానసిక ఒత్తిడిని ఏవిధంగా తగ్గించవచ్చు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వచ్చినప్పుడు ఏవిధమైన నిర్ణయాలు తీసుకోవాలనే వాటిపై అవగాహన కల్పిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు మాకు చాలా ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి". - విద్యార్థులు, గీతం యూనివర్సిటీ

ఉబర్, ఓలా, ర్యాపిడో, ఇప్పుడు 'ఓకే చలో' - హైదరాబాద్​లో ప్రయాణికుల కోసం మరో కొత్త యాప్

గ్రూప్- 4 ఫలితాలు విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.