ETV Bharat / state

గీతం డీమ్డ్‌ యూనివర్సిటీలో హోమ్‌ కమింగ్‌ కార్యక్రమం - ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మురిసిపోయిన విద్యార్థులు

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 24, 2023, 2:02 PM IST

Get Together Gitam Deemed University In Sangareddy
Gitam Deemed University

Get Together At Gitam Deemed University In Sangareddy : వారంతా ఒకప్పుడు ఒకే విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. ఇప్పుడు దేశవిదేశాల్లో ఉన్నతస్థాయి ఉద్యోగాలు చేస్తున్నారు. కొందరు సాఫ్ట్​ వేర్‌ రంగంలో రాణిస్తుంటే మరికొందరు సొంతంగా కంపెనీలు స్థాపించి యువతకు ఉపాధి కల్పిస్తున్నారు. వారంతా ఏ స్థాయిలో ఉన్నారో తెలుసుకుంటూ ప్రస్తుత విద్యార్థులకు వారి సలహాలు, సూచనలు అందించేలా యూనివర్సిటీ పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించింది. వారంతా గత అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనాడు తరగతి గదుల్లో జరిగిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మురిసిపోయారు. అంతేకాదు యువతకు వారి విజయప్రస్థానాలను వివరిస్తూ మార్గనిర్దేశం చేశారు.

'గీతం డీమ్డ్‌ యూనివర్సిటీలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం'

Get Together At Gitam Deemed University In Sangareddy : సంగారెడ్డిలో జిల్లాలోని గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయ(Gitam Deemed University) పూర్వవిద్యార్థులు ప్రస్తుతం చదువు పూర్తిచేసుకుని డిగ్రీ పట్టాలు అందుకోబోతున్న యువతకు దిక్సూచిగా నిలుస్తున్నారు. పూర్వ విద్యార్థులను ఒక చోటుకు చేర్చేందుకు వర్శిటీ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించింది. హోమ్‌ కమింగ్‌ పేరిట ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో 2013 నుంచి 2020 వరకు గీతంలో విద్యనభ్యసించిన విద్యార్థులు పాల్గొన్నారు. తరగతి గదుల్లోని మధుర స్మృతులను గుర్తుచేసుకుంటూ అనుభవాలను పంచుకున్నారు. కార్నివాల్‌ ఫెస్ట్‌లో సందడి చేసి రోజంతా ఆటపాటలతో ఆహ్లాదంగా గడిపారు. దీంతో వర్సిటీ ప్రాంగణం కోలాహలంగా మారింది.

Gitam University In Sangareddy : గీతం యూనివర్సీటీలోలో చదువుకొని ప్రస్తుతం అదే వర్శిటీలో అధ్యాపకులుగా, ఆచార్యులుగా కొంతమంది పనిచేస్తున్నారు. వారంతా గతస్మృతులను నెమరవేసుకున్నారు. ప్రధానంగా లైబ్రరీ తమ ఉన్నతికి ఎంతో ఉపయోగపడిందని తెలిపారు. ఇక్కడున్న సౌకర్యాలు తమకెంతో ప్రోత్సాహాన్ని ఇచ్చాయని వెల్లడించారు. వర్శిటీలో చదువుతో పాటు అందుబాటులో ఉన్న అన్ని వసతులను విద్యార్థులు ఉపయోగంచుకోవాలని సూచించారు. ప్రస్తుతం చదువు పూర్తి చేసుకోబోతున్న యువతకు మార్గనిర్దేశం చేశారు.

ఘనంగా ఐఐటీ హైదరాబాద్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం

"2005-2007 వరకు గీతంలో ఎమ్మెస్సీ గణితం చేశాను. ఐఐటి ఖరగ్​పూర్​లో జూనియర్ ఫెలోషిప్​గా చేశాను. ఆ తర్వాత ఐఐటీ బెంగళూర్​లో రీసెర్చర్​గా పనిచేశాను. 2018లో ఆంధ్రప్రదేశ్​ అకాడమీ ఆఫ్​ సైనెస్​ నుంచి యంగ్​ సైంటిస్ట్​గా అవార్డ్​ తీసుకున్నాను. ఇన్ని విజయాలకు కారణం గీతం యూనివర్సిటీ " - పూర్వ విద్యార్ధి

"ఈ యూనివర్సిటీలో చదివి తిరిగి అందులో ఒక ఫ్యాకల్టీగా ఎంపికవ్వడం, ఎంతో మంది విద్యార్థులకు బోధించడం చాలా ఆనందంగా అనిపిస్తోంది. ఆ రోజుల్లో ప్రాథమిక ల్యాబ్​ సౌకర్యాలు ఉండేవి కావు. ఏసీ తరగతి గదులు అత్యధునిక ల్యాబ్​ వసతులు ఎంతో మెరుగుపడ్డాయి." - పూర్వ విద్యార్థి, అసిస్టెంట్​ ప్రొఫెసర్

Chandrababu in Gitam University : 'సంపద సృష్టించడమే కాదు.. దాన్ని అన్నివర్గాలకు పంచగలగాలి'

ఇక్కడ చదివి ఉన్నత స్థానాలకు : కొందరు విద్యార్థులు చుదువుకునే సమయాల్లోనే సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో ఉద్యోగాలు సంపాదించి ప్రస్తుతం ఉన్నత స్థాయికి చేరారు. గీతంలో సంపాదించిన జ్ఞానంతో సొంతంగా కన్సల్టెన్సీలను నడుపుతూ కొంతమంది యువతకు ఉపాధి కల్పిస్తున్నట్లు పూర్వ విద్యార్థులు స్పష్టం చేశారు. ఒకవేళ ఉద్యోగం పొందలేకపోయినా స్వయంగా ఏలా బతకాలో గీతం నేర్పిస్తుందని ఉద్ఘాటించారు.

సీనియర్లు తమకు ఇచ్చిన సలహాలు, సూచనలు తమ ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతాయని ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వల్ల తమలో ఉన్న నాయకత్వ లక్షణాలు బయటపడుతాయని వెల్లడించారు. హోమ్‌ కమింగ్‌ అంటే ఒక కార్యక్రమంలా ఉంటుందనుకున్నామే తప్ప అనేక అంశాలు నేర్చుకున్నామని వివరించారు.

గీతం విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ సదస్సు

గీతం విశ్వవిద్యాలయంలో పూర్వ విద్యార్థుల సందడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.