ETV Bharat / state

విదేశాలకు పోస్టల్ సేవలు- తక్కువ ఖర్చుతో పార్శిల్స్ పంపించండిలా! - Foreign Parcel Service Center

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 14, 2024, 5:22 PM IST

Updated : May 14, 2024, 5:32 PM IST

Foreign Parcel Service Center: ప్రస్తుతం ప్రపంచీకరణ పుణ్యమా అని దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి అనేక మంది విద్య, ఉపాధి మార్గాల కోసం విదేశాలకు వెళ్తున్నారు. అలాంటివారు తమ సొంత ప్రాంత వంటకాలు రుచి చూడాలని ఎంతో ఆశగా చూస్తుంటారు. వారికి కావాల్సిన సరకులు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు పంపిస్తుంటారు. దీని కోసం ప్రైవేటు పార్శిల్ ఏజెన్సీలకు చాలా డబ్బులు ఖర్చులు చేస్తుంటారు. విదేశాలకు తక్కువ ధరకే సరుకులు రవాణా చేస్తున్న భారత తపాలా శాఖపై చాలా మందికి పూర్తిస్థాయి అవగాహన ఉండదు. తపాలా శాఖ విదేశాలకు వస్తువులు ఎగుమతి చేసే క్రమం కస్టమర్ల సరకులకు ఎలాంటి భద్రత ఉంటుంది? ఎన్ని రోజుల్లో గమ్యస్థానానికి సరుకులు చేరుతాయో ఈ కథనంలో చూద్దాం.

Foreign_Parcel_Service_Center
Foreign_Parcel_Service_Center (ETV Bharat)

Foreign Parcel Service Center: గతంలో తపాలా శాఖ ద్వారా విదేశాలకు సరకులు పంపేటప్పుడు చెన్నైలో కస్టమ్స్ క్లియరెన్స్ ఉండేది. ప్రస్తుతం ఆ వ్యయ ప్రయాసలు లేకుండా తక్కువ ధరకే వివిధ దేశాలకు సైతం సరకులను విజయవాడ నుంచే పంపించుకోవచ్చు. విదేశాలకు పంపించే సరకులను ఈ కార్యాలయంలోనే కస్టమ్ అధికారులు తనిఖీ చేసి విదేశాలకు పంపిస్తున్నారు.

రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచైనా విజయవాడకు సమీపంలోని గొల్లపూడి విదేశీ తపాలా శాఖ కార్యాలయం ద్వారా సరకులు ప్రపంచదేశాలకు పంపవచ్చు. విజయవాడ నగరంలోని ప్రజలకైతే ఇంటి వద్దకి వచ్చి తపాలా శాఖ సిబ్బందే విదేశాలకు పంపించే సరకులు తీసుకెళ్తారు. మిగతా పార్శిల్ ఏజెన్సీ వాళ్లతో పోలిస్తే తక్కువ ధరకు ఎంతో భద్రంగా గమ్యస్థానానికి కస్టమర్ల సరకులు చేరుస్తామని ఇక్కడి అధికారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ కావడంతో ప్రజలూ ఎంతో నమ్మకంతో తమ వద్దకు వస్తున్నారని పోస్టల్ అధికారులు చెబుతున్నారు.

నేరుగా ఇంటికే అయోధ్య 'హనుమాన్​' ప్రసాదం- మనీ ఆర్డర్ చేస్తే చాలు!

2013లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేక కస్టమ్స్ విభాగాన్ని విజయవాడలో ఏర్పాటు చేసింది. దీంతో చెన్నైలో కస్టమ్స్ అధికారుల తనిఖీలు లేకుండా విజయవాడలోనే తనిఖీలు పూర్తి చేసుకుని నేరుగా చెన్నై వెళ్తున్నాయి. గతంలో విజయవాడ నగరంలో ఓ తాత్కాలిక భవనంలో ఈ కార్యాలయం నడిచేది. ప్రస్తుతం విజయవాడకు సమీపంలోని గొల్లపూడిలో శాశ్వత భవనం ఏర్పాటు చేసుకుని అక్కడ నుంచి కస్టమర్లకు సేవలు అందిస్తుంది.

విదేశాలకు పంపించే పార్శిల్స్​లో ఏదైనా నిషేధ పదార్థం గానీ సరకులు, వస్తువులు ఉంటే వాటికి సంబంధించిన వారికి సమాచారం ఇచ్చి ఆ వస్తువులను ఇక్కడి సిబ్బంది తిరిగి వాళ్లకు అందిస్తున్నారు. మొక్కలు, విత్తనాలు, కమర్షియల్, వస్తువులు, ఔషధాలు, కుటుంబ నియంత్రణ వస్తువులు, మానవ శరీర అవయవాలు, రక్తం, గంధపు చెక్కలు, కరెన్సీ నోట్లు వంటివి విదేశాలకు పంపించేందుకు నిషేధం ఉంటుంది. వీటిలో కొన్నింటికి ఆయా విభాగాల డైరెక్టరేట్ల నుంచి అనుమతులు తీసుకొస్తే కస్టమ్స్ అధికారులు క్లియరెన్స్​తో పార్సెళ్లను బట్వాడా చేస్తారు.

ఎవరైనా విదేశాల్లో ఉండే తమ వాళ్లకు అవసరమైన సరుకులను పంపించాలనుకుంటే విదేశీ తపాల శాఖ కల్పిస్తున్న ఈ పార్సెల్ సౌకర్యం వినియోగించుకోవాలని ఇక్కడి అధికారులు కోరుతున్నారు. తక్కువ ధరకు నాణ్యమైన సేవలను తపాలా శాఖ కల్పిస్తుందని అధికారులు చెబుతున్నారు.

Post Office Monthly Income Scheme Details : ఒక్కసారి ఈ పోస్టాఫీస్ స్కీంలో పెట్టుబడితో.. నెలనెలా చేతికి డబ్బులు!

Last Updated :May 14, 2024, 5:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.