ETV Bharat / state

సీఎం జగన్​కు నిరసన సెగ - రైతుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన పోలీసులు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 18, 2024, 8:30 PM IST

Farmers protest against CM Jagan Raptadu Sabha
Farmers protest against CM Jagan Raptadu Sabha

Farmers protest against CM Jagan Raptadu Sabha: సత్యసాయి జిల్లా పుట్టపర్తి విమానాశ్రయం వద్ద సీఎం జగన్‌కు మడకశిర రైతుల నుంచి నిరసన సెగ ఎదురైంది. మడకశిర బ్రాంచ్ కాలువకు నీటిని విడుదల చేయాలంటూ విమానాశ్రయం ఎదుట ఉన్న భవనం ఎక్కి డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపిన రైతుల పట్ల పోలీసులు అమానుషంగా వ్యవహరించారు. భవనంపై ఉన్న రైతులను ఈడ్చుకొచ్చి, కొత్తచెరువు ఠాణాకు తరలించారు.

Farmers protest against CM Jagan Raptadu Sabha: సిద్ధం అంటూ అనంతపురం జిల్లా రాప్తాడుకు వచ్చిన సీఎం జగన్​కు రైతుల నుంచి నిరసన సెగ తగిలింది. ముఖ్యమంత్రి జగన్ పర్యటన నేపథ్యంలో శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి విమానాశ్రయం వద్ద మడకశిర రైతులు తమ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుతో నష్టపోతున్నామంటూ రైతులు ఆరోపించారు. గొల్లపల్లి జలాశయంలో నీరు నిల్వ ఉన్నా మడకశిర బ్రాంచి కాలువకు కృష్ణా జలాలు ఇవ్వడం లేదని ఆరోపించారు.

సీఎం జగన్ కు రైతుల నుంచి నిరసన సెగ: సీఎం జగన్ మోహన్ రెడ్డికి శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి విమానాశ్రయం వద్ద మడకశిర రైతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. మడకశిర బ్రాంచి కాలువకి గొల్లపల్లి నుంచి నీటిని విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు. పుట్టపర్తి విమానాశ్రయం ఎదుట భవనం ఎక్కి మడకశిర రైతులు నిరసన తెలిపారు. గొల్లపల్లి జలాశయంలో నీరు ఉన్నా మడకశిర బ్రాంచి కాలువకు కృష్ణా జలాలు ఇవ్వడంలేదని ఆరోపించారు. మడకశిర కాలువకు నీరిస్తే తాగు, సాగునీటి బోర్లు రీఛార్జి అవుతాయని రైతులు పేర్కొన్నారు. మడకశిరలో తీవ్రమైన తాగునీటి సమస్య ఉన్నప్పటికీ పట్టించుకోవడంలేదని నిరసన తెలుపుతూ, నినాదాలు చేశారు.
జగన్​ సేవకు అంకితమైన ఆర్టీసీ- సామాన్య జనానికి చుక్కలు చూపిస్తోన్న వైఎస్సార్సీపీ

సీఎం జగన్​కు నిరసన సెగ - రైతుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన పోలీసులు

రైతుల పట్ల అమానుషంగా: పట్టు రైతులకిచ్చే కిలోకు 50 రూపాయల ఇన్సెంటివ్​ను మూడేళ్లుగా ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పట్టు రైతుల ఇన్సెంటివ్ విడుదల చేయాలని మడకశిర రైతులు డిమాండ్ చేస్తూ ప్లకార్డులతో సీఎంకు తెలియజేశారు. అయితే శాంతియుతంగా నిరసన తెలిపిన రైతుల పట్ల పోలీసులు అమానుషంగా వ్యవహరించారు. మిద్దెమీద నుంచి రైతులను మెట్లమీదుగా ఈడ్చుకొచ్చి, పోలీసు వాహనంలో పడేశారు. రైతులని కూడా చూడకుండా క్రిమినల్స్​తో వ్యవహరించిన తరహాలో ఈడ్చి వాహనంలో పడేశారు. రైతులను కొత్తచెరువు పీఎస్​కు తీసుకెళ్లారు. సీఎం జగన్ పుట్టపర్తిలో తిరిగి విమానం ఎక్కి వెళ్లిపోయేవరకూ విడుదల చేసేదిలేదంటూ స్టేషన్​లోనే కూర్చోబెట్టారు.
'సమాధానం చెప్పేందుకు సిద్ధమా? లేకుంటే సభలోనే సమాధానం చెబుతావా?' : జగన్​కు చంద్రబాబు సవాల్

హంద్రీనీవా పనులను అటకెక్కించారు: అయిదేళ్లుగా సాగునీటి ప్రాజెక్టుల పనులను నిలిపివేసి రాయలసీమ గొంతు కోసిన జగన్‌, ఏ మొహం పెట్టుకుని సిద్ధం సభకు వస్తున్నారని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు విమర్శించారు. అయిదేళ్లుగా హంద్రీనీవా పనులను అటకెక్కించారని చెప్పడానికే వస్తున్నావా అంటూ నిలదీశారు. జీడిపల్లి, బీటీపీ, పేరూరు, తుంగభద్ర ఎగువ కాలువ ఆధునికీకరణ, ఉంతకల్లు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌, ఉరవకొండలో 50 వేల ఎకరాలకు సాగునీరు అందించే సామూహిక బిందుసేద్యం పథకాలను మూలకు చేర్చి, జిల్లా భవిషత్తును సర్వనాశనం చేశానని చెబుతావా అంటూ ప్రశ్నించారు. అనంత రైతులను మోసగించిన జగన్‌కు త్వరలోనే బుద్ది చెబుతారని పేర్కొన్నారు.
నా మీద నాకే అసంతృప్తి ఉంది - రాప్తాడుకు ఎంతో చేయాలనుకున్నా : ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.