ETV Bharat / state

'కళ్ల ముందే పంట ఎండిపోతోంది- సాగునీరు ఇవ్వండి మహాప్రభో' - Farmers Facing Lack Of Irrigation

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 2, 2024, 9:09 AM IST

Farmers Facing Lack Of Irrigation Water Problem in Eluru District : పంట చేతికొచ్చే దశలో నీరివ్వడంలేదని దెందులూరు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కళ్ల ముందే పంట ఎండిపోతుందని లబోదిబోమంటున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా అప్పులపాలవుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

farmers_problem
farmers_problem

'కళ్ల ముందే పంట ఎండిపోతుంది- సాగునీరు ఇవ్వండి మహాప్రభో'- దెందులూరు రైతులు

Farmers Facing Lack Of Irrigation Water Problem in Eluru District : ప్రకృతి విపత్తు అయినా, అధికారుల అనాలోచిత నిర్ణయాలైనా చిట్టచివరకు రైతులే నట్టేటమునుగుతున్నారు. మిగ్‌జాం తుపాను దెబ్బకు ఇప్పటికే రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యం రైతులను మరింత ఇబ్బందికి గురిచేస్తోంది. కాలువల్లో నీరున్నా చేలకు అందడంలేదని ఏలూరు జిల్లా రైతులు మండిపడుతున్నారు.

హామీ ఇచ్చి అన్నదాతలను నిండా ముంచిన అధికారులు- ఆదుకోవాలని వేడుకోలు - Farmers Facing Lack Of Irrigation

Eluru District : డెల్టాలో రబీ వరిసాగు కీలక దశకు చేరుకుంది. కాలువలకు ఎగువనున్న ప్రాంతాల్లో మరో తడి నీరందితే తప్ప పంట గట్టెక్కే పరిస్థితి కనిపించడంలేదు. మిగిలిన ప్రాంతాల్లో కనీసం రెండు మూడు వారాలు నీరందితే కానీ రైతులు తేరుకునే పరిస్థితి లేదు. ఏలూరు జిల్లా దెందులూరు మండల పరిధిలోని వందలాది ఎకరాలు సాగునీరు అందక చివరి దశలో ఎండిపోతున్నాయి. కొవ్వలి ప్రాంతంలో సుమారు 450 ఎకరాల ఆయకట్టు నీళ్లు లేక బీటలు వారింది. గోదావరి కాలువకు చివరన ఉండే ఈ ఆయకట్టుకు కాలువలు, తూముల ద్వారా నీరు చేరుతుంది. ప్రస్తుతం గోదావరి కాలువలో పుష్కలంగా నీళ్లున్నా పొలాలకు మాత్రం నీరందడంలేదు.

"ఎకరాకు రూ.40 వేలు పెట్టుబడి పెట్టాము. పంట చేతికి వచ్చే చివరి దశలో నీరు ఇవ్వకుండా అధికారులు రైతులను ఇబ్బంది పెడుతున్నారు. వరి పంటకు ఒక తడి నీరు ఇస్తే పెట్టిన పెట్టుబడి అయినా వస్తుంది. లేకుంటే పంటపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాము" _ దెందులూరు రైతులు

ఆశాజనకంగా లేని మిరప ధరలు - ఆవేదనలో అన్నదాతలు - No Sufficient Price To Mirchi

Water Problem Rabi Season : రబీ సీజన్ ఆరంభంలో మందులు కొట్టేందుకు వీలు లేకుండా నీళ్లందించిన అధికారులు తర్వాత నీటి సరఫరాను తగ్గించారు. మూడు నెలల్లో ఎకరాకు కనీసం రెండు మూడు తడులూ ఇవ్వకపోవడంపై రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. నీరివ్వలేమని ఆరంభంలోనే చెప్పి ఉంటే తమకు ఈ దుస్థితి వచ్చేది కాదంటున్నారు. చూసేందుకు ఆయకట్టంతా పచ్చగా ఉన్నా ఓవైపు నుంచి ఎండిపోతూ వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Farmers Crop Problem : ఇప్పటికే ఎకరాకు 40 వేల వరకు రైతులు పెట్టుబడులు పెట్టారు. మరో నాలుగైదు వేలు ఖర్చు చేస్తే పంట చేతికొస్తుందనుకున్న తరుణంలో నీరు లేక కళ్ల ముందే పంట ఎండిపోతుందని రైతులు లబోదిబోమంటున్నారు. వంతుల వారీగా అరకొర నీటిని విడుదల చేస్తున్నప్పటికీ అవి శివారు భూములకు అందడంలేదని చెబుతున్నారు.

గోదావరి డెల్టాలో సాగునీటి సంక్షోభం - సాగునీరందక ఎండిపోతున్న వరిపైరు - Water Crises In Godavari Delta

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.