ETV Bharat / state

ఈశ్వర్​ విజిలేస్తే ఆంధ్రాసోడా బుడ్డీ - సరదాగా వేసే 'ఈల'తోనే సమ్​థింగ్​ స్పెషల్​గా

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 7, 2024, 2:21 PM IST

Eshwar Singing Songs With Whistles : ఈల వేయడం అంటే కుర్రకారుకు భలే ఇష్టం. ఆనందం వేసినా, అవతలి వారిని పిలవానిపించినా ఈల వేస్తుంటారు. కొన్నిసార్లు ఈల వేయడం తప్పు అని పెద్దలు మందలిస్తుంటారు. బహిరంగ ప్రదేశాల్లో విజిలేయద్దని హెచ్చరిస్తారు. కానీ, ఆ యువకుడి ఈలకు పెద్దలు సైతం ఫిదా అవుతున్నారు. పదే పదే విజిలేయమని కోరుతున్నారు. వైవిధ్యంగా విజిలేస్తూ పిల్లల నుంచి పెద్దల వరకు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు ఆ కుర్రాడు. మరి అందులో ప్రత్యేకత ఏముంది. విజిలేయడం చాలా మందికి వచ్చిందే కదా! అనుకుంటే పొరపాటే. ఇదేంటి ఈల వేసే మనిషి గురించి ఇంతలా చెప్తున్నారని అనిపించినా, ఆ యువకుడి గొప్పదనం అలాంటిది మరి.

Eshwar Singing With Whistle Voice
Eshwar Singing Songs With Whistles
నువ్వు విసిలేస్తే ఆంధ్రసోడా బుడ్డీ - సరదాగా వేసే "ఈల" సరికొత్తగా మలుచుకున్నాడు

Eshwar Singing Songs With Whistles : నువ్వు విజిలేస్తే ఆంధ్రసోడా బుడ్డీ. సింహాద్రి సినిమాలోని ఈ పాట అప్పటి యువతను ఒక ఊపు ఊపింది. ఈల పాటకు ఉన్న ప్రత్యేకతను ఈ పాట చాటింది. అంత ప్రత్యేకత ఉంది కాబట్టే సరదాగా విజిలేస్తూ సంతృప్తి పొందుతుంటారు కొంత మంది యువత. కానీ, ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి ఈలకు ఇంకో ప్రత్యేకత ఉంది. ఈయన అందరిలా కాదు. వందలో ఒకరిలా నిలవాలనుకున్నాడు. ఈల వేయడంలో ఎంతో ప్రత్యేకతను చూపిస్తున్నాడు.

Shows Talent in Singing With Whistle Voice : ఏంటి ఈల వేసి గోల గోల చేస్తున్నాడని అనుకోకండి. ఇతని ఈలను మెచ్చి జబ్బర్దస్త్‌, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి టీవీ షోలు అవకాశం ఇ‌చ్చాయి. పాటల రాగానికి తగ్గట్టుగా విజిలేస్తూ ప్రముఖుల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. కఠినమైన చరణాలను సైతం కమనీయంగా పాడేస్తున్నాడు. అనేక రకాల ప్రోగ్రామ్స్‌లో తన ఈల పాటలతో ప్రేక్షకుల మనసును దొచుకుంటున్నాడు.

స్నేహితులతో కలిసి సరదాగా ఈల వేస్తూ కూనీ రాగం తీస్తున్న ఈ యువకుడి పేరు ఈశ్వర్‌. స్వస్థలం హనుమకొండ జిల్లా కాజీపేట. తెలుగు యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్‌లో పీజీ చేశాడు. వరంగల్‌లోని సంగీత కళాశాలలో మ్యూజిక్‌ నేర్చుకున్నాడు. ఈల వేస్తూ పాటలు పాడి, బుల్లితెరపై మెరుస్తున్నాడు. సెపరేట్‌ టాలెంట్‌ ఉన్న వారికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని చెబుతున్నాడు.

సంప్రదాయ పద్ధతిలో బేకరీ పదార్థాల తయారీ - ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరట!

Eshwar Singing With Whistle Voice : ఈశ్వర్‌కు ఈల పాటలు పాడడం చిన్నప్పటి నుంచే అలవాటైంది. కోనేటి గట్లపైన, ఊరు చివర చెట్ల కింద ఈల రాగాలు తీసేవాడు. పలు వేదికలపై ప్రదర్శనలు కూడా ఇచ్చాడు. కానీ, పాటలు పాడే అవకాశాలు అంతంత మాత్రంగానే వచ్చేవి. అప్పుడు అందరిలా కాకుండా వైవిధ్యభరింతంగా ఉంటే తన పాటకు ఆదరణ లభిస్తుందని అనుకున్నాడు. ఈల వేస్తూ పాటలు పాడటం అలవరచుకున్నాడు. ఈల వేస్తూ పాట పాడటం అంత తేలికేం కాదని, ఎన్నో ప్రయత్నాల ద్వారా అది సులభం అయిందని అంటున్నాడు.

వేదిక ఏదైనా పెదాలు కదపకుండా పాట పాడేస్తున్నాడు ఈశ్వర్‌. పాటలోని పల్లవి, చరణాల శృతి, లయ తప్పకుండా ఈల వేస్తూ అలరిస్తున్నాడు. దేశభక్తి గీతాలు, మెలోడీ సాంగ్స్‌ పాడుతూ చూపరులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాడు. ట్రెండింగ్‌లో ఉండే పాటలు సైతం తన ఈలతో ఆలపిస్తూ యువతును ఉర్రుతలూగిస్తున్నాడు. ఒక్కొక్కటిగా వచ్చిన అవకాశాలను అందిపచ్చుకుంటూ ముందుకు సాగుతున్నాడు ఈశ్వర్‌. ఈలపాటను మరింత జోరుగా ఆలపిస్తూ అనేక ప్రదర్శనలిస్తున్నాడు. ఈల వేస్తూ పాట పాడడం వల్ల ఈలపాట ఈశ్వర్‌గా తనకు గుర్తింపు వచ్చిందని చెబుతున్నాడు.

Eshwar Whistle Songs : ఇష్టమైన రంగంల్లోకి వెళితే కాస్త కష్టమైనా మంచి ఫలితాలు సాధించవచ్చని ఈలపాట ఈశ్వర్‌ చెబుతున్నాడు. దాంతో పాటు వినూత్నంగా ప్రయత్నించాలని సూచిస్తున్నాడు. అటువంటి టాలెంటే తనను బుల్లితెరకు పరిచయం చేసిందని చెబుతున్నాడు. సాధారణంగా జీవిస్తే ఉన్నత శిఖరాలను అందుకోలేమని, జీవితంలో ఏదో ఒక ప్రత్యేకతను చూపిస్తేనే అది సాధ్యం అని అంటున్నాడు ఈలపాట ఈశ్వర్. ఈల పాటలో ప్రత్యేకతను చూపిస్తూ దాన్ని చాటిచెబుతున్నాడు. ఎంతో మంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.

డిగ్రీలు పూర్తి చేసి - సహజ సిద్దమైన వంట నూనె తయారీ వ్యాపారంలో రాణిస్తున్న ముగ్గురు మిత్రులు

విమానం నడపడం సాహసమే అయినా సాధన చేస్తే సాధ్యమే అంటున్న యువత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.