ETV Bharat / state

నిర్మాణ లోపమా? నిర్వహణ నిర్లక్ష్యమా? - ప్రమాదంలో గామన్‌ వంతెన - Defect in Gammon Bridge

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 26, 2024, 5:32 PM IST

Defect in Gammon Bridge Due to Illegal Sand Minings : వైఎస్సార్సీపీ పాలనలో కొత్త ప్రాజెక్ట్‌లు కట్టడం మాట దేవుడెరుగు ఉన్న ప్రాజెక్ట్‌ల నిర్వహణను పట్టించుకోవడం లేదు. రాజమహేంద్రవరం వద్ద గోదావరిపై నాలుగు కిలోమీటర్ల మేర 800 కోట్లతో నిర్మించిన గామన్ వంతెన నిర్వహణలోపం ప్రయాణికులకు ప్రాణసంకటంగా మారింది. అధికారుల నిర్లక్ష్యంతో ఓ స్తంభం వద్ద బేరింగ్‌ కుంగి అంగుళంన్నర మేర వంతెన కిందకు దిగిపోయింది. నిబంధనలకు విరుద్ధంగా వంతెన సమీపంలో డ్రెడ్జింగ్‌ చేయటం వల్లే కుంగుబాటుకు కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Defect_in_Gammon_Bridge_Due_to-Illegal _Sand_Minings
Defect_in_Gammon_Bridge_Due_to-Illegal _Sand_Minings

నిర్మాణ లోపమా? నిర్వహణ నిర్లక్ష్యమా? - ప్రమాదంలో గామన్‌ వంతెన

Defect in Gammon Bridge Due to Illegal Sand Minings : నిత్యం వేలాదిమంది రాకపోకలు సాగించే గామన్ వంతెన ప్రస్తుతం నిర్వహణ లేమితో ప్రజలకు ప్రాణసంకటంగా మారుతుంది. ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో ఒక్క ప్రాజెక్టు కట్టకపోగా ఉన్న ప్రాజెక్టులను సైతం పట్టించుకోకపోవడంతో అవి కుంగిపోయే పరిస్థితి వచ్చింది. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలోని గోదావరి నదిపై నాలుగు కిలోమీటర్ల మేర 800 కోట్లతో నిర్మించిన గామన్ వంతెన నిర్వహణ లేమితో ప్రాణసంకటంగా మారింది. అధికారుల నిర్లక్ష్యంతో ఓ స్తంభం వద్ద బేరింగ్‌ కుంగి అంగుళంన్నర మేర ఆ బ్లాక్‌ కిందకు దిగిపోయింది. వంతెన సమీపంలో డ్రెడ్జింగ్‌ చేయటమే దీనికి కారణమన్న ఆరోపణలను స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి.

కుప్పకూలిన దేశంలోనే అతిపెద్ద వంతెన- ఒకరు మృతి- 9మందికి గాయాలు

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు-రాజమహేంద్రవరం మార్గంలో ఉన్న గామన్‌ వంతెనపై 52వ స్తంభం యాక్షన్ జాయింట్ వద్ద ఆదివారం బేరింగ్ కుంగింది. దీంతో దాదాపు అంగుళంన్నర మేర ఆ బ్లాక్ కిందికి దిగిపోయింది. గత కొద్ది నెలలుగా నెమ్మదిగా ఇలా జరుగుతున్నా సంబంధిత అధికారులు గమనించక పోవటం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఇంజినీరింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Vibrations on Gammon Bridge : సాధారణంగా బేరింగ్ వ్యవస్థను ఏటా తనిఖీ చేయాలని. ఆ దిశగా ఇక్కడ చేసినట్లు కనిపించడం లేదని NHAకు చెందిన ఓ ఇంజినీరు తెలిపారు. అసలు ఈ సమస్య నిర్మాణంలోనే ఉందా లేక తాజాగా తలెత్తిందా అనే అంశంపై నిపుణులు దర్యాప్తు చేస్తున్నారు. వంతెన బేరింగ్లు కుంగడంతో ప్రస్తుతం ఒకవైపు నుంచి మాత్రమే రాకపోకలు సాగిస్తున్నారు. అయితే వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇబ్బడిముబ్బడిగా ఇసుక తవ్వకాలకు అనుమతిచ్చారు. గామన్ వంతెన సమీపంలో కాతేరు వద్ద 50, కొవ్వూరు వద్ద సుమారు 20 భారీ డ్రెడ్జర్లతో వైసీపీ నాయకులు రేయింబవళ్లు తవ్వేస్తున్నారు.

గ్రామం నుంచి బయటకు వెళ్లాలా - పడవ ఎక్కాల్సిందే

వంతెనకు 500 మీటర్ల దూరంలో తవ్వకూడదన్న నిబంధనలున్నా అది క్షేత్రస్థాయిలో మాత్రం అమలవడం లేదు. సోమవారం రహదారులు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి ప్రద్యుమ్న, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత, ఎస్పీ జగదీష్ వంతెనను పరిశీలిస్తున్న సమయంలోనూ ఇసుక తవ్వకాలు ఆగలేదు. వాటిని కలెక్టర్‌కు స్థానికులు చూపించగా సెబ్ వారిని పంపిస్తామని సమాధానమిచ్చారు.


వంతెనపై బేరింగ్‌లు దెబ్బతిన్నవైపు సుమారు 20 రోజులపాటు వాహనాల రాకపోకలకు అనుమతించే పరిస్థితి లేదు. నిబంధనల మేరకు వంతెన నిర్వహణ బాధ్యత గామన్ ఇండియాదే అయినా కొద్ది నెలలుగా పాత్ సంస్థ చూస్తోంది. అయితే 'గామన్ వంతెన ప్రస్తుతానికి బలంగా ఉంది. కేవలం 57వ స్పాన్‌లో బేరింగ్‌లు మాత్రమే దెబ్బతిన్నాయన్నాయి. మిగతా పిల్లర్ల వద్ద ఉన్న బేరింగ్‌లను సైతం డ్రోన్‌తో పరిశీలన చేయిస్తున్నాము. నిర్మాణ లోపమా? నిర్వహణ నిర్లక్ష్యమా అని ఇప్పుడే చెప్పలేము. దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నాము. ట్రాఫిక్ మళ్లింపు పైనా చర్చించి నిర్ణయం తీసుకుంటాము. - ప్రద్యుమ్న, రహదారులు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి

విశాఖలో మళ్లీ తెగిన ఫ్లోటింగ్‌ బ్రిడ్జి - సందర్శకుల అనుమానాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.