ETV Bharat / state

'లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమి కోసం పని చేస్తాం - వాళ్లు అధికారంలోకి వస్తే దేశానికే విపత్తు'

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 4, 2024, 4:24 PM IST

CPI D Raja Fires on BJP Party : కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకుండా లోక్​సభ ఎన్నికల్లో పని చేస్తామని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే అది దేశానికే విపత్తని వ్యాఖ్యానించారు.

CPI D Raja on Lok Sabha Elections 2024
CPI D Raja Fires on BJP Party

CPI D Raja Fires on BJP Party : రాష్ట్రంలో సీపీఐ రాష్ట్ర సమావేశాలు ముగిశాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాలకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యదర్శులు నారాయణ, అజీజ్ పాషా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు, పార్లమెంట్ ఎన్నికలు, పార్టీ బలోపేతం అంశాలపై చర్చలు జరిపారు. లోక్​సభ ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశాలకు ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ సందర్భంగా డి.రాజా మాట్లాడారు. కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే దేశానికి విపత్తు అని డి. రాజా వ్యాఖ్యానించారు. బీజేపీ ఓటమి కోసం పని చేస్తామని స్పష్టం చేశారు. మూడు రోజుల పాటు సమావేశాలు జరిగాయని తెలిపారు. ఫిబ్రవరి 16న జరిగే రైతు సంఘాలు నిర్వహించే ధర్నాకు సీపీఐ ఎప్పుడూ మద్దతుగా ఉంటుందని తెలిపారు. ఆంధ్ర ప్రత్యేక హోదా కోసం మద్దతిస్తామన్నారు. మోదీ మూడోసారి అధికారంలోకి వస్తామని, భారత ఆర్థిక వ్యవస్థను 3వ స్థానానికి తెస్తామని అంటున్నాడన్న ఆయన, మోదీ ఇస్తున్న హామీలు అమలు చేయడం లేదని మండిపడ్డారు. 2 కోట్ల ఉద్యోగాలు, నల్లధనం వెనక్కి తేలేదేమని ప్రశ్నించారు. మధ్యంతర బడ్జెట్​లో పేద, మధ్య తరగతి వారి కోసం ఏమీలేదని మండిపడ్డారు.

'మోదీ మూడోసారీ అధికారంలోకి వచ్చేందుకు అడ్డువచ్చిన వారిని తొలగించుకుంటూ పోతున్నారు'

"ఈసారి ఎన్నికలు చాలా ముఖ్యమైనవి. బీజేపీ ఎలాగైనా అధికారంలోకి రాకుండా చూడాలి. పార్లమెంట్ సమావేశాల్లో 100 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. ఇలా చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. పార్లమెంట్​లో ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రతిపక్షానికి ఉంది. బీజేపీ ప్రతిపక్షాలు ఉండకూడదని అనుకుంటుంది. ప్రతిపక్షాలు లేకుంటే వారు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించవచ్చని అనుకుంటారు. ఇవే మా సమావేశాల్లో మేం చర్చించాం." - డి.రాజా, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి

'సింగరేణి ఎన్నికలకు రాజకీయాల సంబంధాలకు ఎలాంటి సంబంధం లేదు'

CPI D Raja on Lok Sabha Elections 2024 : రాబోయే ఎన్నికలు చాలా ప్రధానమైనవని డి.రాజా అన్నారు. ఎలాగైనా ఎన్నికల్లో బీజేపీని ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని వ్యాఖ్యానించారు. తమ పార్టీ దేశవ్యాప్తంగా సముచిత స్థానాల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. డి.రాజా, కె.నారాయణ, రామకృష్ణ పాండ ముగ్గురు ఇండియా కూటమిలో పార్టీ సీట్లపై కమిటీ వేసినట్లు తెలిపారు. మేనిఫెస్టో కోసం మరో డ్రాఫ్టింగ్ కమిటీ వేశారని చెప్పారు. బీజేపీ హఠావో - దేశ్ కో బచావో అని మొదటిసారిగా చెప్పిన నీతీశ్​కుమార్ మళ్లీ బీజేపీలో చేరారని మండిపడ్డారు. ఆయన చరిత్రలో చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని తెలిపారు. ఇండియా కూటమిని నీతీశ్​ మోసం చేశారని విమర్శించారు.

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో సీపీఐకి కూడా అవకాశం ఇవ్వాలి : నారాయణ

'సీపీఐతో పొత్తు వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది - తెలంగాణ, ఏపీలో ఒక్కో ఎంపీ స్థానంలో పోటీ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.