ఉత్కంఠకు తెర - పెండింగ్‌ లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్, ఎన్నికల బరిలో ఉన్నది వీరే - Lok Sabha Elections 2024

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 24, 2024, 10:30 PM IST

CONG_LOKSABHA_CANDIDATES_2024
CONG_LOKSABHA_CANDIDATES_2024 ()

LOK SABHA ELECTIONS 2024 : తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న మూడు లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. వీరిలో ఖమ్మం అభ్యర్థిగా రామసహాయం రఘురాం రెడ్డి, కరీంనగర్‌ అభ్యర్థిగా రాజేందర్‌ రావు, హైదరాబాద్‌ అభ్యర్థిగా మహమ్మద్‌ సమీర్‌లను ప్రకటించింది. ఈమేరకు ఏఐసీసీ తుదిజాబితాను ప్రకటించింది.

CONG LOKSABHA CANDIDATES 2024 : తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న మూడు లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. వీరిలో ఖమ్మం అభ్యర్థిగా రామసహాయం రఘురాం రెడ్డి, కరీంనగర్‌ అభ్యర్థిగా రాజేందర్‌ రావు, హైదరాబాద్‌ అభ్యర్థిగా మహమ్మద్‌ సమీర్‌లను ప్రకటించింది. ఈమేరకు ఏఐసీసీ తుదిజాబితాను ప్రకటించింది. మరోవైపు త్వరలో జరగబోయే ఖమ్మం-నల్గొండ-వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు, కాంగ్రెస్‌ అభ్యర్థిగా తీన్మార్‌ మల్లన్నను ప్రకటించింది.

మరో 38 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్​ అభ్యర్థుల ప్రకటన - 10 స్థానాల్లో అభ్యర్థుల మార్పు

CONG MP CANDIDATES LIST TELANGANA : గత కొన్ని రోజులుగా పైమూడు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల ఖరారు సస్పెన్స్‌లో ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఖమ్మం స్థానం నుంచి అభ్యర్థి ఎంపిక, అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. ఈస్థానం నుంచి హేమాహేమి నాయకులు తమ కుటుంబసభ్యులకు కేటాయించాల్సిందిగా పట్టుబట్టడంతో, టికెట్‌ ఖరారు ఆలస్యమయ్యింది. చివరకు అభ్యర్థి ఎంపిక, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వద్ద బెంగళూరులో పంచాయతీ ముగిసింది.

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డితో ఖర్గే సమావేశమయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్‌ మున్షీ సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. మొదట ఇద్దరితో వేర్వేరుగా, తర్వాత ఇద్దరితో కలిపి చర్చించారు. తొలుత ఉప ముఖ్యమంత్రి భట్టి, తన సతీమణికి టికెట్‌ ఇవ్వాలని కోరగా దానికి ఖర్గే అంగీకరించలేదు.

వైసీపీని గెలిపిస్తే గ్రామాల్లో చెరువులు ఖాళీ అయ్యాయి: వైఎస్ షర్మిల

దాంతో మంత్రి పొంగులేటి కుటుంబ సభ్యులకు కాకుండా మరో సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇవ్వాలని జిల్లాకు చెందిన రాయల నాగేశ్వర రావు పేరు సూచించినట్లు సమాచారం. కాంగ్రెస్‌లో చేరినప్పుడు తాను సూచించిన వ్యక్తికి లోక్‌సభ టికెట్‌ ఇస్తామని హామీ ఇచ్చారని ఖర్గేతో పొంగులేటి తేల్చి చెప్పారు. సోదరుడు ప్రసాద రెడ్డికి టికెట్‌ ఇవ్వాలని పట్టుపట్టినట్లు సమాచారం. పార్టీ నాయకులు రఘురామిరెడ్డి పేరును తెరమీదకు తెచ్చారన్న పొంగులేటి, ఆయనతో బంధుత్వం ఇటీవల కాలంలోనే ఏర్పడిందని చెప్పినట్లు తెలిసింది.

తర్వాత ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖర్గేతో ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేస్తానని చెప్పినట్లు తెలిసింది. చివరకు ఖమ్మంనకు రఘురామిరెడ్డిని ఎంపికచేశారు. ఇక కరీంనగర్‌కు వెలిచాల రాజేందర్‌రావు, హైదరాబాద్‌కు షమీవలీ ఉల్లా పేర్లను ప్రకటించారు. మధ్యలో తెరపైకొచ్చిన మండవ వెంకటేశ్వరరావు పేరు పక్కన పెట్టేశారు.

ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో అభివృద్ధి శూన్యం: వైఎస్ షర్మిల - YS Sharmila Election Campaign

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.