ETV Bharat / state

కంచుకోటను మరోసారి కైవసం చేసుకునేందుకు 'హస్తం' పక్కా ప్లాన్ - నిజామాబాద్​ బరిలో ఆ అభ్యర్థి!

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 4, 2024, 12:49 PM IST

Updated : Feb 4, 2024, 1:15 PM IST

Congress Focus On Nizamabad MP Seat : నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్‌లో గట్టి పోటీ నెలకొంది. ఒక్క అవకాశమివ్వాలని ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. ఆ పార్టీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎరవత్రి అనిల్‌తో పాటు మరికొందరు ప్రదేశ్ ఎన్నికల కమిటీకి దరఖాస్తు చేశారు. ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి, మాజీ విప్ అనిల్‌ మధ్య పోటీ ఉండగా, జీవన్‌ రెడ్డి వైపు సీఎం రేవంత్‌రెడ్డి మొగ్గు చూపుతున్నారని హస్తం పార్టీలో చర్చ సాగుతోంది.

Nizamabad Parliament Seat
Congress Focus On Nizamabad MP Seat

నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్‌లో గట్టిపోటీ - బరిలో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, మాజీ విప్ అనిల్‌

Congress Focus On Nizamabad MP Seat : నిజామాబాద్ పార్లమెంట్‌ స్థానం గతంలో కాంగ్రెస్‌కు కంచుకోటలా ఉండేది. నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో బీఆర్​ఎస్​, బీజేపీ, స్వతంత్ర అభ్యర్థి ఒక్కోసారి ప్రాతినిథ్యం వహించారు. మిగిలిన అన్నిసార్లు హస్తం హవానే నడిచింది. ఊహించని విధంగా గత ఎన్నికల్లో ఆ పార్టీ మూడో స్థానానికి పరిమితమైంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌(Congress) గెలిచి అధికారం చేపట్టగా, ఇందూరులో గెలవాలని పార్టీ పట్టుదలతో ఉంది. ఉత్తర తెలంగాణలో బీఆర్​ఎస్​, బీజేపీ బలపడిన తర్వాత త్రిముఖ పోరు అనివార్యంగా మారింది.

నేడు కేబినేట్ భేటీ - బడ్జెట్, రెండు గ్యారంటీల అమలుకి ఆమోదం!

Nizamabad Parliament Seat : గత ఎన్నిక అనుభవం దృష్ట్యా, కాంగ్రెస్ గెలుపు అవకాశాలున్న అభ్యర్థి కోసం అన్వేషణ ఆరంభించింది. ఇప్పటికే పలువురి పేర్లు పరిశీలించింది. నిజామాబాద్ నుంచి కాంగ్రెస్ తరఫున బలమైన అభ్యర్థిని బరిలో నిలపాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) గట్టి పట్టుదలతో ఉన్నారు. అసెంబ్లీ ఫలితాలను పునరావృతం చేయాలనే సంకల్పంతో బలమైన అభ్యర్థుల వేట సాగుతోంది. నిజామాబాద్ లోక్‌సభ నుంచి పోటీ కోసం ప్రస్తుత ఎమ్మెల్సీ, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, మాజీ ప్రభుత్వ విప్ ఎరవత్రి అనిల్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, అరికెల నర్సారెడ్డి, కాటిపల్లి వికాస్‌రెడ్డి, ఇమ్మడి గోపీ దరఖాస్తు చేశారు.

'జల విద్యుత్ కేంద్రాల ఔట్ లెట్లను స్వాధీనం చేయాలంటే ప్రభుత్వం నుంచి ఆమోదం తీసుకోవాల్సిందే'

Congress Focus On Lok Sabha Election : సినీ నిర్మాత దిల్‌రాజు పోటీ చేస్తారన్న ప్రచారమూ సాగింది. గత ఎన్నికల్లో బాల్కొండను త్యాగం చేసినందుకు ఎంపీగా అవకాశం ఇస్తామని ఎరవత్రి అనిల్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి హామీ ఇచ్చారు. పార్టీలో సీనియర్ నేత, పార్లమెంట్‌పై పట్టున్న ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి, అనిల్‌ మధ్య ప్రధానంగా పోటీ ఉంది. అయితే జీవన్‌ రెడ్డి అభ్యర్థిత్వం వైపు సీనియర్లు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. సీనియర్‌ నాయకుడైన ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి(MLC Jeevan Reddy) అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆయన గెలిచి ఉంటే, మంత్రివర్గంలో చోటు కల్పించే వారనే చర్చ పార్టీలో ఉంది.

Parliament Election 2024 : ఎమ్మెల్సీగా ఉండటంతో మంత్రివర్గంలో స్థానం కోసం ఆయన ప్రయత్నించినట్లు సమాచారం. ఓడిన వారికి మంత్రి పదవులిచ్చే విషయంలో అధిష్ఠానం సుముఖంగా లేదనే ప్రచారం సాగింది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నందున నిజామాబాద్ బరిలో జీవన్‌రెడ్డితో పాటు మరికొందరి పేర్లు తెరపైకి వచ్చాయి. పార్టీలో సీనియర్‌గా ఉండి, మంత్రిగా పని చేసిన అనుభవం ఉన్న జీవన్‌ రెడ్డిని ఎంపీగా పోటీ చేయించాలనే అభిప్రాయం పార్టీ పెద్దల నుంచి వ్యక్తమైందని తెలుస్తోంది.

కాంగ్రెస్‌ ఎంపీ టికెట్ల కోసం పోటాపోటీ - 140 దాటిన అర్జీలు - ఆ 3 స్థానాలపై ప్రముఖుల గురి

మూడో రోజు భారీ సంఖ్యలో వెల్లువెత్తిన దరఖాస్తులు - ఎంపీ టికెట్ల కోసం ఆశావహుల పోటీ

Last Updated :Feb 4, 2024, 1:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.