ETV Bharat / state

టీడీపీతో ఉద్యోగాలు- వైసీపీతో వలసలు! యువతకు అసలు సిసలు పరీక్ష ఇదే - CM Jagan Cheating Youth

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 11, 2024, 8:58 AM IST

CM Jagan Cheating Youth in AP యువతకు స్కిల్ ట్రైనింగ్​లో రాష్ట్రాన్ని టీడీపీ ప్రభుత్వం ప్రథమ స్థానంలో నిలిపితే, వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిరుద్యోగంలో తొలి స్థానంలో నిలబెట్టింది. టీడీపీ హయాంలో రాష్ట్రంలో కంపెనీలను రప్పించి ఉద్యోగాలు సృష్టించింది. జగన్​ సర్కార్​ ఏటా జాబ్​ క్యాలెండర్​ అని చెప్పి, పత్రిక క్యాలెండర్​తోనే సరిపెట్టింది. మే 13న జరిగే రాజ్యాంగ పండగలో విజనరీకి, ప్రిజనరీకి, ఉపాధికి, వలసలకు మధ్య జరుగుతున్న ఎన్నికల్లో యువత మద్ధతు ఎవరికో!

cm_cheat_youth
cm_cheat_youth (ETV Bharat)

CM Jagan Cheating Youth in AP : విద్యార్థులు చిన్నప్పటి నుంచీ పుస్తకాలతో కుస్తీపట్టి ఎన్నో పరీక్షలు రాసుంటారు. ఒక్కో పరీక్ష పాసవుతూ చదువులు పూర్తి చేసుకుని ఉంటారు. అలాంటి లక్షల మంది యువతీయువకుల భవిష్యత్‌కు ఇప్పుడు అసలు సిసలు పరీక్ష ఎదురవుతోంది. 2024 ఎన్నికల పరీక్షకు తెలుగుదేశం, వైఎస్సార్సీపీ మేనిఫెస్టోల్లోని హామీలే సిలబస్‌! నవ్యాంధ్రకు రాజధాని కావాలా? వద్దా? రాష్ట్రానికి కంపెనీలు తెచ్చేవారు కావాలా? తరిమేసేవారు కావాలా? నైపుణ్య శిక్షణతో ఏపీని ముందుకు తీసుకెళ్లే నాయకుడు కావాలా? నైపుణ్యాభివృద్ధిని నాశనం చేసి ఆంధ్రను బిహార్‌ కన్నా దారణంగా దిగజార్చిన పాలకుడు కావాలా? తేల్చుకోవాల్సింది యువతే! భవిష్యత్‌ను నిర్ణయించుకోవాల్సింది యువతే.

కొలువుల కల్పన VS జాబ్‌ క్యాలెండర్‌ జాబ్‌లెస్‌ క్యాలెండర్‌ : ఏటా జనవరిలో జాబ్‌ క్యాలెండర్‌ అంటూ 2019లో మోసగించిన జగన్‌ 2024 ఎన్నికల మేనిఫెస్టోలో కొత్త వల పన్నారు. క్రమం తప్పకుండా గ్రూప్స్‌ నోటిఫికేషన్‌ ఇచ్చి, UPSC తరహాలో నిర్దిష్ట సమయంలో పరీక్షలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఐతే జగన్‌ను నమ్మేదెలా? 2019 ఎన్నికల ముందు మెగా డీఎస్సీ అంటూ మోసం చేసిన జగన్‌ ఎన్నికలకు నెల ముందు కేవలం 6,100 పోస్టులతో నోటిఫికేషన్‌ ఇచ్చారు! ఎన్నికల కోడ్‌తో అదీ వాయిదా పడింది. ఆశావహులు తీవ్ర నిరాశనిస్పృహల్లో మునిగిన వేళ మెగా డీఎస్సీ పైనే మొదటి సంతకమని తెలుగుదేశం ప్రకటించింది! తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి, ఉద్యోగ కల్పనకు ప్రత్యేక ఎంప్లాయిమెంట్‌ జోన్‌ క్రియేట్‌ చేస్తామని భరోసాఇచ్చింది. వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలో ఆ ఊసే లేదు.

చేనేత కార్మికుల పొట్టకొట్టిన జగన్​ సర్కార్​ - షరతులతో నేతన్న నేస్తానికి కోత - CM Jagan Neglect Handloom Workers

పీజీ పిల్లలకూ ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ VS పీజీ పిల్లలకు ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ లేదు : జగన్‌ ఐదేళ్లలో ప్రైవేటు కళాశాలల్లో పీజీ కోర్సులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను నిలిపివేశారు. పీజీలోపు విద్యార్థులకూ ఫీజు రీఎంబర్స్‌మెంట్‌లో గందరగోళం సృష్టించారు. ఓట్ల కోసం తల్లుల ఖాతాల్లో వేస్తామని చెప్పి, డబ్బులు ఇవ్వకుండా పేదలపై రూ. 3,174 కోట్లు బకాయిపెట్టారు. 2023-24 సంవత్సరానికి ఒక్క రూపాయి కూడా జగన్‌ ఇవ్వలేదు! విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేసి, ఫీజులు కట్టారు. ఆ కష్టాలన్నీ లేకుండా కళాశాలలకే ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ చెల్లించి, సర్టిఫికెట్ల మంజూరు విషయంలో విద్యార్థులకు చిక్కుల్లేకుండా చేస్తామని తెలుగుదేశం మేనిఫెస్టోలో తెలిపింది. ఎయిడెడ్, ప్రైవేటు కళాశాలల్లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని పునరుద్దరిస్తామనీ హామీ ఇచ్చింది.

చితికిన కౌలు రైతు బతుకు - గడిచిన ఐదేళ్లుగా ధీమా లేదు, బీమా రాదు! - Jagan Neglect Tenant Farmers

కంపెనీలకు ఆహ్వానం VS కంపెనీలకు పొగ : ఇక అత్యధిక ఉద్యోగ కల్పన చేసే సూక్ష్మ, స్థూల, మధ్యతరహా కంపెనీలు, సంస్థలకు ప్రోత్సహకాలిస్తామని తెలుగుదేశం మేనిఫెస్టోలో ప్రకటించగా వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలో ఆ ప్రస్తావనేలేదు. అంటే ఉపాధి కోసం యువత పక్క రాష్ట్రాలకు వలసపోవాల్సిందేనేమో! వైఎస్సార్సీపీ ప్రభుత్వం మూసేసిన నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్ని తిరిగి తెరిపించి మరింత విస్తరిస్తామని తెలుగుదేశం యువతకు భరోసా ఇచ్చింది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఉద్యోగ కల్పనకు తోడ్పాటు అందిస్తామని మేనిఫెస్టోలో పెట్టింది. వైఎస్సార్సీపీ సర్కార్‌కు అవేమీ పట్టలేదు. రాష్ట్రంలో ప్రపంచ స్థాయి సదుపాయాలతో క్రీడల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలుగుదేశం హామీ ఇవ్వగా వైఎస్సార్సీపీ మాత్రం ఎన్నికల ముందు ప్రచారం కోసం వాడుకున్న 'ఆడుదాం ఆంధ్రా'’ కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపింది! ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు చేయకుండా ప్రతి జిల్లాలోనూ క్రీడా మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ పెడతామని వైఎస్సార్సీపీ 2024 మేనిఫెస్టోలో చెప్పుకొచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన 10 శాతం ఈడబ్యూఎస్​ రిజర్వేషన్లను ప్రతీ ఐదేళ్లకు ఒకసారి ఆర్థిక సర్వే చేసి అమలు చేస్తామని తెలుగుదేశం మేనిఫెస్టోలో చేర్చగా వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలో ప్రయత్నమే కనిపించలేదు.

రాజధానుల పేరిట జగన్​ మూడు ముక్కలాట - బలైన భవన నిర్మాణ కార్మికులు - CM Jagan Neglect Labours


నైపుణ్య శిక్షణ VS శిక్షణ భక్షణ : తెలుగుదేశం హయాంలో యువత, విద్యార్థులకు నైపుణ్యం అందించేందుకు కొత్తగా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏర్పాటు చేశారు. శిక్షణల కోసం రూ.200 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. అత్యధిక ఉపాధి అవకాశాలున్న రాష్ట్రాల జాబితాలో ఏపీని మొదటి స్థానంలో నిలిపారు. సీమెన్స్‌ సంస్థ సహకారంతో శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆరు సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లు, 34 సాంకేతిక నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు నెలకొల్పారు. పదోతరగతి, ఇంటర్మీడియట్‌ ఫెయిల్‌ అయిన వారికీ ప్రత్యేక శిక్షణలిచ్చారు. మూడేళ్లలో 2,72,198 మందికి నైపుణ్య శిక్షణ ఇవ్వగా 64,444 మందికి ఉద్యోగాలు లభించాయి. అందులో కొందరు స్టార్టప్‌లు కూడా ఏర్పాటు చేశారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖ కంపెనీలతో కలిసి జాబ్‌ మేళాలూ నిర్వహించారు. తద్వారా బీఎస్సీ చేసిన వారికీ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు లభించాయి.

జగన్‌ వచ్చాక నైపుణ్య శిక్షణే లేకుండా చేశారు. చంద్రబాబుపై కక్షతో సీమెన్స్‌ కేంద్రాలను మూసేశారు. హెచ్​సీఎల్​తో కలిసి విశాఖలో నైపుణ్య విశ్వవిద్యాలయ ఏర్పాటుకు తెలుగుదేశం ప్రభుత్వం ఒప్పందం చేసుకుని భూములూ కేటాయించింది. జగన్‌ దాన్ని విశాఖలో కాదని తిరుపతి జిల్లా కోబాక సమీపంలో నైపుణ్య వర్సిటీ అంటూ నాలుగున్నరేళ్ల క్రితం 50 ఎకరాలు కేటాయించారు. దానిపేరు చెప్పుకుని తిరుపతి వైఎస్సార్సీపీ నేతలు స్థిరాస్తి వ్యాపారాలు చేసుకున్నారేగానీ ఇంతవరకూ వర్సిటీ పనులే చేపట్టలేదు. లోక్‌సభ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 25 నైపుణ్య కళాశాలలంటూ ఊదరగొట్టిన జగన్‌ కనీసం ఒక్కో భవన నిర్మాణానికి రూ.20 కోట్ల నిధులు కూడా ఇవ్వలేదు. నాలుగు ట్రిపుల్‌ ఐటీల్లో ఒక్కో నైపుణ్య కళాశాల ఏర్పాటు చేస్తామన్న హామీకీ అతీగతీలేదు.

జగన్​ హామీల డ్రామాలకు నిదర్శనం వరికపూడిశెల- పల్నాడు గడ్డకు వైఎస్సార్సీపీ తీరని ద్రోహం - Varikapudishela Project

స్టార్టప్‌లకు పచ్చజెండా VS స్టార్టప్‌లకు ఎర్రజెండా : ఇక ఔత్సహిక పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించేందుకు విశాఖలోని మిలినీయం టవర్స్‌లో ప్రత్యేకంగా ఇన్నోవేషన్‌ సొసైటీని తెలుగుదేశం సర్కార్‌ నెలకొల్పింది. కొత్త ఆలచనలతో ముందుకొచ్చిన స్టార్టప్‌లకు మిలీనియం టవర్స్‌లో రాయితీపై స్థలం కేటాయించారు! ఆర్థిక సాయం అందేలా సహకారం ఇచ్చేవారు. జాతీయ స్థాయిలో స్టార్టప్‌ల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపే సంస్థలతో స్టార్టప్‌లను అనుసంధానం చేశారు. అలా విశాఖకు అనేక అంకురాల్ని రప్పిస్తే వాటిని జగన్‌ గాల్లో కలిపేశారు. ఇన్నోవేషన్‌ సొసైటీకి నిధులుఇవ్వకుండా నాశనం చేశారు. విద్యార్థుల సృజనాత్మక ఆలోచనలను పట్టించుకోని జగన్ తెలుగుదేశం హయాంలో ఏర్పాటైన స్టార్టప్‌లపై కక్షసాధింపులకు పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ సర్కార్‌ చర్యలతో విశాఖలో సుమారు 100 అంకుర సంస్థలు మూతపడ్డాయి.

ఉత్తరాంధ్రపై మాటల్లోనే జగన్​ ప్రేమ - అభివృద్ధిలో ఉత్త చేయే


ఐటీకి ప్రోత్సాహం VS ప్రోత్సాహం బంద్‌ : తెలుగుదేశం ప్రభుత్వం ఐటీ కంపెనీలను ఏపీకి తెచ్చేందుకు డిజిగ్నేటెడ్‌ టెక్నాలజీ పార్కు విధానాన్ని తెచ్చింది. ఏపీలో కంపెనీ నెలకొల్పిన వారికి సగం అద్దెకే కార్యాలయ స్పేస్ ఇచ్చారు. ఇంటర్నెట్‌, విద్యుత్తు సౌకర్యం కల్పించారు. అయా సంస్థలు కల్పించే ఉద్యోగాల సంఖ్యకు తగ్గట్లు నగదు ప్రోత్సాహకాలు అందించారు. ఫలితంగా గన్నవరం, మంగళగిరి, విశాఖల్లో అనేక స్టార్టప్‌లు, చిన్న సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు ముందుకొచ్చి ఇంజినీరింగ్, బీఎస్సీ పూర్తి చేసిన వారికి ఉద్యోగాలు కల్పించాయి. హెచ్​సీఎల్​ వంటి దిగ్గజ సంస్థ కూడా క్యాంపస్‌ నెలకొల్పింది. అదే ప్రోత్సాహం కొనసాగించి ఉంటే మరికొన్ని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు ఏపీకి వచ్చేవి.

పొరుగు రాష్ట్రలతోపోటీపడి అనంతపురం జిల్లాకు చంద్రబాబు తెచ్చిన కియా పరిశ్రమ ఇప్పుడు కరవు నేలపై కొలువుల కల్పతరువైంది! అక్కడ ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు లక్ష మంది ఉపాధి పొందుతున్నారు! శ్రీసిటీలోనూ తెలుగుదేశం హయాంలో అనేక కంపెనీలు ఏర్పాటయ్యాయి. మరి జగన్‌ చేసిందేంటి? కంపెనీల్ని తరిమేసి కొలువులకు గండికొట్టారు. అధికారంలోకి రాగానే విశాఖ నుంచి ఐబీఎమ్​, హెచ్​ఎస్​బీసీ లాంటి సంస్థల్ని వెళ్లగొట్టారు. అమరరాజా కంపెనీని వేధించడంతో విస్తరణ ప్లాంట్‌ తెలంగాణకు తరలిపోయింది. చిన్నచిన్న సాఫ్ట్‌వేర్‌ కంపెనీలూ మూతపడ్డాయి! ఫలితంగా యువతకు నైపుణ్యం, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ అట్టడుగుకు దిగజారింది. భారత ఉపాధి నివేదికలో ఈ విషయం వెల్లడైంది.

జలాశయాల నిర్వహణను పట్టించుకోని జగన్​ - ఐదేళ్లలో తొమ్మిది దుర్ఘటనలు - JAGAN NEGLECTED IRRIGATION PROJECTS

అంతా గర్వించే అమరావతి VS 3ముక్కలాటతో అధోగతి : రాజధాని లేని రాష్ట్రానికి తెలుగుదేశం ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసి దాన్నీ హైదరాబాద్‌ తరహాలో కొలువుల కల్పనాకేంద్రంగా మార్చేందుకు నాటి సీఎం చంద్రబాబు శ్రమించారు. అనేక నిర్మాణాలు చేపట్టారు. రాజధాని పనుల ద్వారా దాదాపు 30 వేల మంది నాడు ఉపాధి పొందారు. జగన్‌ వచ్చి రాజధానితో మూడుముక్కలాట ఆడారు.

ఏపీకి రాజధాని ఏదంటే బుర్రగోక్కోవాల్సిన పరిస్థితి కల్పించారు. పోనీ విశాఖనైనా అభివృద్ధి చేశారా అంటే అదీ లేదు. రాజధానిపై జగన్‌ సృష్టించిన గందరగోళానికి పరిశ్రమలు, కంపెనీలు ఏపీ అంటనే ఆమడదూరం జరిగాయి. ఇలా అవకాశాలన్నీ దెబ్బతీసి ఉద్యోగాలు, ఉపాధి కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తరలిపోవాల్సిన దుస్థితిలోకి నెట్టిన జగన్‌ కావాలో మన రాష్ట్రానికే కంపెనీలు తెచ్చి స్థానికంగా కొలువులు కల్పించే ప్రభుత్వం కావాలో తేల్చుకోవాల్సింది యువతరమే.

ఐదేళ్లుగా భూ సర్వే, డిజైన్లకే పరిమితం ​- జీడిపల్లి పేరూరు ప్రాజెక్టు ఊసెత్తని జగన్ - Jeedipally Peruru Project

ఉద్యోగాల విప్లవమా, నిరుద్యోగమా? ఎవరు కావాలో తేల్చుకో యువతా! (ETV Bharat)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.