ETV Bharat / state

ఎన్నికల్లో సరైన నిర్ణయం తీసుకోండి - ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు చంద్రబాబు లేఖ - Chandrababu Letter to Employees

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 3, 2024, 7:00 PM IST

Updated : May 3, 2024, 7:29 PM IST

Chandrababu Wrote  Letter to the Employees Pensioners and Teachers
Chandrababu Wrote Letter to the Employees Pensioners and Teachers (ETV BHARAT)

Chandrababu Wrote Letter to the Employees Pensioners and Teachers : ఎన్నికల్లో ఉద్యోగులు, పింఛనర్లు, టీచర్లు సరైన నిర్ణయం తీసుకోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు కోరారు. ఉద్యోగులకు తెలుగుదేశం, వైసీపీ ఏం చేసిందో వివరిస్తూ చంద్రబాబు లేఖ రాశారు. ఎవరిది ప్రజాస్వామ్యం? ఎవరిది అప్రజాస్వామ్యం? ఎవరిది ఉద్యోగుల సంక్షేమ ప్రభుత్వం? ఎవరిది అణచివేత ప్రభుత్వమో ఆలోచించుకోవాలని సూచించారు.

Chandrababu Wrote Letter to the Employees Pensioners and Teachers : ఎన్నికల్లో ఉద్యోగులు, పింఛనర్లు, టీచర్లు సరైన నిర్ణయం తీసుకోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు కోరారు. వచ్చే ఎన్నికల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలంటూ ఉద్యోగులు, ఫించనర్లు, టీచర్లకు ఆయన బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అందించి, సకాలంలో జీతాలు, పెన్షన్లు, ఇతర అన్ని ఆర్థిక ప్రయోజనాలను చెల్లించే ఏర్పాటు చేస్తామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. ఉద్యోగులకు ఏ ప్రభుత్వం ఏం చేసిందో వివరిస్తూ నాడు-నేడు అంశాలను లేఖలో ప్రస్తావించారు. ఎవరిది ప్రజాస్వామ్యమో -ఎవరిది అప్రజాస్వామ్యమో ఆలోచించాలని కోరారు. ఎవరిది ఉద్యోగుల సంక్షేమ ప్రభుత్వం - ఎవరిది ఉద్యోగుల అణచివేత ప్రభుత్వమో గుర్తించాలన్నారు.

మే 13న వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు కూలదోస్తారు- జగన్​ నాటకాలు హాలీవుడ్​నే తలదన్నేలా ఉన్నాయి: చంద్రబాబు

ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి : భయం గుప్పిట్లో నుంచి బయటకు వచ్చి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు. గత 5 సంవత్సరాలుగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు, ఇబ్బందులను కళ్లరా చూశానని చెప్పారు. నెలల తరబడి జీతాలు రాక, ఆర్ధిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్యలు చేసుకున్న ఉద్యోగ కుటుంబాల దీనగాధలు చూసి చలించిపోయినట్లు తెలిపారు. జీవితాంతం కష్టపడి దాచుకున్న డబ్బులు చేతికందక ఎందరో ఉద్యోగుల పిల్లల చదువులు, పెళ్లిళ్లు ఆగిపోవడం వంటి కన్నీటి గాధలు, తమ హక్కుల కోసం ఉద్యమించిన వారిపై పగబట్టి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు చూసి సహించలేకపోయానని చంద్రబాబు వెల్లడించారు.

చరిత్రలో లేనివిధంగా రివర్స్‌ పీఆర్సీ : వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐఆర్ కన్నా ఫిట్‌మెంట్‌ తగ్గించి ఉద్యోగుల చరిత్రలో ఎన్నడూలేని విధంగా రివర్స్‌ పీఆర్సీ ప్రకటించిందని మండిపడ్డారు. పెన్షనర్లకు అదనపు క్వాంటం పెన్షన్‌ తగ్గించి వృద్ధుల జీవితాల్లో ఆనందాన్ని దూరం చేసిందని దుయ్యబట్టారు. వారం రోజుల్లో సీపీఎస్‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఆ హామీని తుంగలో తొక్కి ఉద్యోగులను మోసగించడమే కాకుండా వారి ఆత్మహత్యలకు కారణమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యారంగంలో జీవో నెం.117 తీసుకువచ్చి పాఠశాలల విలీనంతో ఉపాధ్యాయ పోస్టులు రద్దుచేసి, 12,600 పాఠశాలలను ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మార్చిందని ధ్వజమెత్తారు.

రాజకీయం అంటే అధికారం కాదు, ప్రజలకు సేవ చేయడం- టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో చంద్రబాబు

ఆర్టీసీ ఉద్యోగులను గాలికి వదిలేశారు : విద్యావ్యవస్థను అస్తవ్యస్తం చేసి విద్యా ప్రమాణాల స్థాయిని దిగజార్చిందని విమర్శించారు. పదవీ విరమణ ఉద్యోగులకు రావలసిన బకాయిలన్నింటినీ 2029లో చెల్లిస్తామని, పెన్షనర్లు ఎంతగానో వేచిచూసే గ్రాట్యూటీ అందుకోకుండా జీవో ఇచ్చిందని ఆక్షేపించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశామంటూ వారిని గాలికి వదిలేసిందని ఆరోపించారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను వైసీపీ నాయకులు అవమాన పరుస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

ఉద్యోగుల గౌరవాన్ని కాపాడుతాం : తాము అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల గౌరవాన్ని కాపాడుతామని ఉద్యోగులందరికీ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించి స్నేహపూర్వక పరిస్థితులు నెలకొల్పుతామని హామీ ఇచ్చారు. ఉద్యోగులు తమ పోస్టింగ్‌లు, బదిలీల కోసం రాజకీయ నాయకుల చుట్టూ తిరగకుండా, వారి గౌరవాన్ని పెంచేందుకు రాష్ట్రంలో మొదటిసారిగా కౌన్సిలింగ్‌ విధానాన్ని తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చిందని గుర్తుచేశారు. ఉద్యోగులపై పనిభారాన్ని తగ్గించేందుకు వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా కానిస్టేబుల్‌, ఎస్‌ఐ ఉద్యోగ ఖాళీలను కూడా భర్తీ చేసిందని వివరించారు.

ఎన్నికల్లో సరైన నిర్ణయం తీసుకోండి - ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు చంద్రబాబు లేఖ (ETV BHARAT)

ఎంతటి ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఒకటో తేదీన జీతాలు : విద్యలో నాణ్యత పెంచేందుకు 11 డీఎస్సీల ద్వారా లక్షలాది ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. అంగన్‌వాడీ ఉద్యోగుల జీతాలను 4,200 నుంచి 10,500కు పెంచిందని గుర్తుచేశారు. ఉద్యోగులకు పండుగ అడ్వాన్సు అందించి, ఉద్యోగ సంఘనాయకులతో స్నేహపూర్వక చర్చలు జరిపి వారి సమస్యలు పరిష్కరించిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన జరిగిన అనంతరం ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉన్నప్పటికీ 2015 వేతన సవరణలో 43శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చామని గుర్తుచేశారు. రిటైర్డ్‌ ఉద్యోగులకు ఇవ్వాల్సిన అన్ని ఆర్థిక ప్రయోజనాలను కల్పించటం, ఎంతటి ఆర్ధిక ఇబ్బందులలో ఉన్నప్పటికీ 1వ తేదీన జీతాలు ఇవ్వడంలో ఏనాడూ వెనకాడలేదని చంద్రబాబు స్పష్టం చేశారు.

పింఛనర్ల మరణాలు ప్రభుత్వ హత్యలే - జగన్ సీఎం పదవి నుంచి తప్పుకోవాలి: చంద్రబాబు

Last Updated :May 3, 2024, 7:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.