ETV Bharat / state

జగన్‌కు అభ్యర్థులు దొరకడం లేదు- వై నాట్ పులివెందుల అనేదే మా నినాదం: చంద్రబాబు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 17, 2024, 9:27 PM IST

Chandrababu Comments on CM Jagan: నాలుగేళ్లగా మూడు రాజధానుల పాట పాడిన సీఎం జగన్‌, ఇప్పుడు నాలుగో రాజధాని అంటున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. రాజధానికి కేంద్రం సాయం చేస్తానన్నా, జగన్‌ పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. పర్చూరు నియోజకవర్గంలో 'రా కదలిరా' సభలో పాల్గొన్న చంద్రబాబు, తెలుగుదేశం, జనసేన కూటమిని గెలిపించి రామరాజ్యాన్ని తీసుకురావాలని పిలుపునిచ్చారు.

Chandrababu Comments on CM Jagan
Chandrababu Comments on CM Jagan

Chandrababu Comments on CM Jagan: బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని ఇంకొల్లులో తెలుగుదేశం నిర్వహించిన 'రా కదలిరా' సభలో పార్టీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. జిల్లాతో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఈ సభకు తెలుగుదేశం శ్రేణులు, జనసైనికులు భారీగా తరలివచ్చారు. విభజన హామీల కోసమే, తాను నాడు బీజేపీతో విభేదించానని చంద్రబాబు పునరుద్ఘాటించారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రం మెడలు వంచుతానన్న జగన్‌ మాత్రం రాష్ట్రాన్ని నాశనం చేశారని ధ్వజమెత్తారు.

ఆమంచి ఇంటికి, కథ కంచికి: వైఎస్సార్సీపీ నేతలు పర్చూరులో భారీగా ఓట్ల అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. నియోజకవర్గంలో 14 వేల ఫామ్‌-7 దరఖాస్తులు పెట్టారని, దొంగఓట్లు నమోదు చేసి గెలుద్దాం అనుకున్నారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు హీరోలా పోరాడారని కితాబిచ్చారు. ఏలూరి సాంబశివరావు వల్ల ఆమంచి ఇంటికి, కథ కంచికి అని ఎద్దేవా చేశారు. బాపట్ల ఎంపీతో పాటు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల అరాచకాలపై చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ ఫ్యాను మూడు రెక్కలని , మూడు ప్రాంతాల ప్రజలు విరగొట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 52 రోజుల పాటు విరామం లేకుండా పనిచేసి రావణాసురుడి వధ చేయాలన్నారు.
ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు ముందుకు రాని ప్రభుత్వం, పార్టీ కార్యాలయాలకు మాత్రం!

టీడీపీ-జనసేన ప్రభుత్వానికే సాధ్యం: నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారని, మద్యపాన నిషేధంపై జగన్‌ ఎందుకు బటన్ నొక్కలేదని చంద్రబాబు ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చాక నాణ్యమైన మద్యం సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. వారంలోగా సీపీఎస్ రద్దు అన్నారు, ఆ బటన్ ఎందుకు నొక్కలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ పాలనలో ప్రజల తలసరి ఆదాయం పడిపోయిందని ఏటా రూ.30 వేల కోట్ల ఆదాయం తగ్గిందని చంద్రబాబు ఆరోపించారు. చెరకు తోటలు కాల్చడం తప్ప బాపట్ల ఎంపీకి ఏం తెలుసని చంద్రబాబు ఎద్దేవా చేశారు. రైతును రాజు చేయటం, టీడీపీ-జనసేన ప్రభుత్వానికే సాధ్యమని తెలిపారు.

బూతులు తిట్టనందుకేనా మహీధర్‌రెడ్డి సీటులో మార్పు - ఎడం బాలాజీకి ఎందుకు బాధ్యతలు


దొంగఓట్లు, గ్రానైట్, గ్రావెల్ దోపిడీ: మీరు చొక్కాలు మడతపెడితే, మా వాళ్లు కుర్చీలు మడతపెడతారని వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా పులివెందుల పంచాయితీ తీసుకువచ్చారని, నేను అనుకుంటే జగన్‌ పాదయాత్ర చేసేవారా? అని ప్రశ్నించారు. రాజకీయాల ముసుగులో రౌడీయిజం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. పర్చూరులో దొంగఓట్లు, గ్రానైట్, గ్రావెల్ దోపిడీ, అక్రమ వసూళ్లపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్చూరు గ్రానైట్ వ్యాపారులపై కేసులు పెట్టి వేధించారని చంద్రబాబు ఆరోపించారు. అధికారులు వైఎస్సార్సీపీ మూకలతో వెళ్లి గ్రానైట్ వ్యాపారులను బెదిరించారన్నారు. యువతపైనే నా ఆశ, అందుకే యువగళం ప్రకటించానని చంద్రబాబు తెలిపారు. యువత వర్క్ ఫ్రం హోమ్‌ చేసుకునేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గతంలో తాను హైదరాబాద్‌ను సింగపూర్‌ చేస్తానంటే ఆనాడు ఎగతాళి చేశారని పేర్కొన్నారు. నేను విజనరీ, జగన్‌ ప్రిజనరీ ఉన్న నేత అంటూ ఎద్దేవా చేశారు.

బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ - కడప,గుంటూరు టీడీపీలో భారీగా చేరికలు

నేను విజనరీ, జగన్‌ ప్రిజనరీ: చంద్రబాబు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.