ETV Bharat / state

టీడీపీ శ్రేణులపై అక్రమ కేసులు - గవర్నర్‌కు చంద్రబాబు లేఖ

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 1, 2024, 4:05 PM IST

Chandrababu Naidu Letter to Governor: టీడీపీ నేతలు, కుటుంబసభ్యులే లక్ష్యంగా ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతోందంటూ గవర్నర్‌కు చంద్రబాబు లేఖ లేఖ రాశారు. సీఐడీని జేబుసంస్థగా మార్చుకుని ప్రత్యర్థులను వేధిస్తున్నారని, ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీడీపీ నేతలను టార్గెట్ చేశారని లేఖలో పేర్కొన్నారు.

Chandrababu_Naidu_Letter_to_Governor
Chandrababu_Naidu_Letter_to_Governor

Chandrababu Naidu Letter to Governor: టీడీపీ శ్రేణులపై అధికార పార్టీ అక్రమంగా కేసులు పెడుతోందని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్​కు (Justice Abdul Nazeer) చంద్రబాబు లేఖ రాశారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెడుతున్నారని లేఖలో వెల్లడించారు. అణచివేతే లక్ష్యంగా అధికార పార్టీ అక్రమ కేసులు పెడుతోందని, వ్యవస్థలను కక్షలు తీర్చుకునేందుకు వాడుకుంటూ తమను వేధిస్తోందని లేఖలో పేర్కొన్నారు. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు అక్రమ అరెస్టును ప్రస్తావిస్తూ ఏపీఎస్​డీఆర్​ఐ (Andhra Pradesh State Directorate of Revenue Intelligence ) దుర్వినియోగాన్ని లేఖలో చంద్రబాబు తెలియపరిచారు.

ప్రభుత్వ విభాగాల ద్వారా టీడీపీ (TDP) నేతలు, కార్యకర్తలపై జగన్ (CM YS Jagan Mohan Reddy) అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నాడని చంద్రబాబు (Chandrababu Naidu) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ఎస్​డీఆర్​ఐ ద్వారా తెలుగుదేశం నేతలను బెదిరించి ఆర్థికంగా, రాజకీయంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ప్రతిపక్షాలను వేధించేందుకు ఆయుధంగా ప్రభుత్వం వాడుకుంటోందని లేఖలో స్పష్టం చేశారు.

శరత్​ అరెస్టు అక్రమం - ముమ్మాటికి ప్రభుత్వ కక్ష సాధింపు చర్య: టీడీపీ

అధికార పార్టీకి విధేయుడైన చిలకల రాజేశ్వరరెడ్డిని ఆ సంస్థకు ప్రత్యేక కమిషనర్‌గా నియమించుకుని తెలుగుదేశం నేతలను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును కూడా ఈ విభాగం ద్వారా కేసుల పెట్టి ఇబ్బందులు పెట్టారన్న చంద్రబాబు, మళ్లీ ఇప్పుడు ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్​ను కేసులో ఇరికించి అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. శరత్ పని చేసిన సంస్థలో కేవలం 68 రోజులు మాత్రమే అడిషనల్ డైరెక్టర్‌గా విధులు నిర్వహించారని గుర్తు చేశారు.

ఏపీఎస్​డీఆర్​ఐ డిప్యూటీ డైరెక్టర్ సీతారామ్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో జరిమానా విధించి విచారణ జరుపుతోందన్నారు. కేంద్ర సంస్థ అయిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటలిజెన్స్ విచారణ చేస్తుండగానే మళ్లీ అదే అంశాన్ని ఏపీఎస్‌డీఆర్‌ఐ విచారణకు స్వీకరించడం ఆశ్చర్యంగా ఉందని ప్రశ్నించారు. తెలుగుదేశం నేతలు, కుటుంబ సభ్యులే లక్ష్యంగా తప్పుడు కేసులను ప్రభుత్వం బనాయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలీసుల అదుపులో ప్రత్తిపాటి కుమారుడు - విజయవాడ సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

కేవలం టీడీపీ నేతలను వేధించడమే ఏపీఎస్​డీఆర్​ఐ పనా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏపీఎస్​డీఆర్​ఐ ఏర్పడ్డాక ఎన్ని కేసులు నమోదు చేసిందని అన్నారు. ప్రభుత్వం సీఐడీని జేబు సంస్థగా మార్చుకుని ఇప్పటికే ప్రత్యర్థి పార్టీ నేతలను కేసుల పెట్టి వేధిస్తోందన్నారు. రాష్ట్రంలో ఏపీఎస్​డీఆర్​ఐ వేధింపులు భరించలేక పలువురు వ్యాపారవేత్తలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారని గుర్తు చేశారు.

వచ్చే ఎన్నికల్లో వైసీపీ (YSRCP) ఓడిపోతుందనే భయంతో టీడీపీ నేతలను టార్గెట్ చేసి వేధిస్తున్నారని, ఇలాంటి చట్టవ్యతిరేక పనులు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హితవుపలికారు. ఏపీఎస్​డీఆర్​ఐని దుర్వినియోగం చేసే ప్రభుత్వ చర్యను నిలువరించాలని గవర్నర్​కి రాసిన లేఖలో చంద్రబాబు కోరారు.

టీడీపీ నేతలపై కొనసాగుతున్న కక్ష సాధింపు చర్యలు- పత్తిపాటి కుమారుడి అరెస్టులో జగన్ సర్కార్ అత్యుత్సాహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.