ETV Bharat / state

మూడు గుంతలు పూడ్చలేరు గానీ, మూడు రాజధానులు కడతారా?: చంద్రబాబు - Vuyyuru Praja Galam meeting

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 8, 2024, 8:54 AM IST

Chandrababu fired on CM Jagan: ఐదేళ్ల తర్వాత ప్రజల్లోకి వస్తున్న సీఎం జగన్‌ని ప్రజలంతా బాయ్‌కాట్‌ చేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో వైసీపీని కట్టకట్టి బంగాళఖాతంలో కలపాలని తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు, ప్రజలంతా కూటమితో కలిసి రావాలని చంద్రబాబు కోరారు.

Chandrababu fired on CM Jagan
Chandrababu fired on CM Jagan

మూడు గుంతలు పూడ్చలేరు గానీ, మూడు రాజధానులు కడతారా?: చంద్రబాబు

Chandrababu fired on CM Jagan: 2014లో ఒక్క ఛాన్సంటూ, ముద్దులు పెట్టిన జగన్‌ ఐదేళ్లగా పిడిగుద్దులు గుద్దారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రజాగళం కార్యక్రమంలో భాగంగా కృష్ణాజిల్లాలో చంద్రబాబు పర్యటించారు. పెనమలూరు నియోజకవర్గంలోని ఉయ్యూరులో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. తెలుగుదేశం శ్రేణులు, జనసైనికులు, కమలం కార్యకర్తలు పెద్దఎత్తున ఉత్సాహంగా తరలివచ్చారు.

అందరికీ అండగా ఉంటా: మంత్రి జోగి రమేష్‌, పెడన నియోజకవర్గం మొత్తాన్ని దోచుకుని, ఇప్పుడు పెనమలూరుకి వచ్చారంటూ చంద్రబాబు మండిపడ్డారు. రోగి లాంటి జోగికి, బోడే ప్రసాద్ మెడిసిన్‌ అని తెలిపారు. అన్యాయానికి ప్రజాచైతన్యమే విరుగుడని చంద్రబాబు తెలిపారు. అంతా కలిసి, కూటమి గెలుపించాలని కోరారు. యువతకు జాబ్‌ క్యాలెండర్‌, డీఎస్సీ అని జగన్‌ మోసగించారని ఆరోపించారు. మీ అందరికీ నేను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అయిదేళ్లలో 20 లక్షల కొలువులు అందిస్తానని చంద్రబాబు భరోసా కల్పించారు. మీ ఇంట్లో పిల్లలకు ఉద్యోగాలు కావాలా? గంజాయి కావాలా? అనేది తల్లిదండ్రులు ఆలోచించుకోవాలని పేర్కొన్నారు. పిల్లలకు ఉద్యోగాల్లేక, మీరు కూలి చేసి వారికి డబ్బులు ఇవ్వాల్సిన దుస్థితికి జగన్‌ తీసుకొచ్చారని చంద్రబాబు అని ధ్వజమెత్తారు.
దివ్యాంగులకు 6 వేల పింఛన్‌- చంద్రబాబు భరోసా - CBN meeting with divyang people

వైసీపీని వదిలేసి బయటకొస్తున్నారు: జగన్‌ దెబ్బకు అమరావతి పోయింది, పోలవరం పోయిందని చంద్రబాబు విమర్శించారు. అందుకే వైసీపీ తరఫున లోక్‌సభ టికెట్‌ ఇస్తామన్నా, వ్యక్తి బాలశౌరి వద్దని బయటకొచ్చినారని పేర్కొన్నారు. కొలుసు పార్థసారథి వైసీపీలో ఉంటే జాతికి ద్రోహం చేసినట్టేనని భావించి బయటకొచ్చారని తెలిపారు. మనకు ఇలాంటి మంచి నేతలు కావాలని తెలిపారు. కానీ, సీఎం జగన్‌కు గంజాయి బ్యాచ్‌, బ్లేడ్‌ బ్యాచ్‌ కావాలని ఎద్దేవా చేశారు. అందుకే, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వైసీపీని వదిలేసి బయటకొస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. కొన్ని కారణాల వల్ల ఈసారి కొనకళ్ల నారాయణరావు, దేవినేని ఉమా లాంటి నేతలకు టికెట్లు ఇవ్వలేకపోయామని చంద్రబాబు తెలిపారు. అయినా, వాళ్లు ఏమీ మాట్లాడకుండా పార్టీ జెండా మోస్తూ, సైనికుల్లా పనిచేస్తున్నారని, అటువంటి వాళ్లను తాను నేను మరచిపోనని చంద్రబాబు హామీ ఇచ్చారు.
ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు - స్వయంగా వడ్డించిన బాలకృష్ణ - MLA Balakrishna Gives IFTAR Party

జగన్‌ ఒక్కసారైనా మాట్లాడారా?: తులసివనం లాంటి కృష్ణా జిల్లా గడ్డపై, ప్రస్తుతం గంజాయి మొక్కలు మొలిచాయని చంద్రబాబు ఆరోపించారు. పవిత్రమైన ఈ మట్టిని మలినం చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఈ అయిదేళ్లలో అభివృద్ధి గురించి జగన్‌ ఒక్కసారైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు. అమరావతి నిర్మాణం జరిగితే, కృష్ణాజిల్లాలో భూములకు విలువ పెరిగేదని. కానీ, అమరావతి రాజధానితో ఈ గంజాయి బ్యాచ్‌ ఆడుకుందని విమర్శలు గుప్పించారు. మూడు గుంతలు పూడ్చలేరు గానీ, మూడు రాజధానులు కడతారా? అంటూ ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వానికి ఓటు వేసే ముందు ప్రజలంతా ఆలోచించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

పామర్రులో ఐటీ టవర్-రైతు కూలీల కోసం ప్రత్యేక కార్పొరేషన్: చంద్రబాబు - CHANDRABABU PRAJA GALAM MEETING

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.