ETV Bharat / state

ప్రొద్దుటూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై పోలీసు కేసు - POLICE Case Against MLA Rachamallu

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 19, 2024, 10:06 PM IST

Case Registered Against Proddutur MLA Rachamallu: ప్రొద్దుటూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించారన్న సీఐ ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదైంది.

Case_Registered_Against_Proddutur_MLA_Rachamallu
Case_Registered_Against_Proddutur_MLA_Rachamallu (ETV Bharat)

Case Registered Against Proddutur MLA Rachamallu: వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డిపై కేసు నమోదైంది. సీఐ శ్రీకాంత్‌ను బెదిరించి విధులకు ఆటంకం కలిగించడంతో రాచమల్లుతో పాటు ఆయన బావమరిది బంగారు మునిరెడ్డిపై ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. శనివారం ప్రొద్దుటూరు పోలీసులు ట్రబుల్‌ మాంగర్స్‌కు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇందులో భాగంగా వైఎస్సార్సీపీ కార్యకర్త నవీన్‌ కుమార్‌రెడ్డిని ఒకటో పట్టణ పోలీసులు కౌన్సిలింగ్‌కు పిలిపించారు.

మైనార్టీ యువతిపై లైంగిక వేధింపులు- ఎమ్మెల్యే రాచమల్లు అనుచరుడిపై పోక్సో కేసు - POCSO Case Filed On YSRCP Leader

నవీన్‌కుమార్‌రెడ్డి కోసం పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, ఆయన బావమరిది బంగారు మునిరెడ్డి వైఎస్సార్సీపీ కార్యకర్తను స్టేషన్‌కు పిలిపిస్తారా అంటూ సీఐని బెదిరించారు. కౌన్సిలింగ్ జరుగుతుండగా నవీన్‌ను స్టేషన్‌ నుంచి తీసుకెళ్లిపోయారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించారన్న సీఐ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే, ఆయన బావమరిదిపై కేసులు నమోదు చేశారు.

వైఎస్సార్సీపీ కనుసన్నల్లో అరాచక 'చైతన్యం' - DSP Chaitanya Violence

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.