ETV Bharat / state

విఫలమైనా పట్టుబట్టారు - సివిల్స్​ సాధించారు - AP Candidates in UPSC civils

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 18, 2024, 12:09 PM IST

AP Rankers in UPSC Civils Results 2024 : లక్షల్లో వేతనాలు అందుకుంటున్నా అంతటితో వారు ఆగలేదు. ప్రజలకు సేవ చేయాలని ఒకరు, తండ్రి లక్ష్యాన్ని నెరవేర్చాలని మరొకరు సివిల్స్​ వైపునకు అడుగులు వేశారు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు సివిల్స్​కు సిద్ధమయ్యారు. ఎన్నో అటుపోటులను ఎదుర్కొని చివరికి సివిల్స్​లో విజయ కేతనం ఎగురవేశారు.

upsc_rankers
upsc_rankers

AP Rankers in UPSC Civils Results 2024 : కంప్యూటర్ ఇంజినీరింగ్ చదువు. నాలుగో సంవత్సరంలోనే క్యాంపస్​ ఇంటర్వ్యూలో మైక్రో సాఫ్ట్​వేర్​ కంపెనీలో జాబ్​. లక్షల్లో జీతం. అంతటితో ఆగలేదు ఆమె. సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఉద్యోగం చేస్తూనే సివిల్స్​కు సిద్దమైంది. మూడు సార్లు విఫలమైనా అధైర్యపడలేదు. నాలుగో ప్రయత్నంలో లక్ష్యం చేరుకున్నారు రాజమహేంద్రవరానికి చెందిన అడుసుమిల్లి మౌనిక. సివిల్స్​లో 487వ ర్యాంకు సాధించిన ఆమెను పలకరించగా తన అనుభవాలను వివరించారు.

ఇంజినీరింగ్ చదువుతుండగానే కొలువు : మౌనిక స్వస్థలం విజయవాడ అయినా రాజమహేంద్రవరంలో స్థిరపడ్డారు. తండ్రి ఎ. వెంకట ప్రేమ్​చంద్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు. తల్లి సునీత గృహిణి. టెన్త్​, ఇంటర్ వరకు విజయవాడలో ఆమె విద్యాభ్యాసం సాగింది. అనంతరం హైదరాబాద్​లోని బిట్స్ పిలానీ కళాశాలలో కంప్యూటర్ ఇంజినీరింగ్ (2014-18) లో చేరారు. నాలుగో ఏడాదిలోనే మైక్రోసాఫ్ట్ (బెంగళూరు) లో కొలువు సాధించారు. వారాంతపు సెలవు దినాల్లో మొక్కలు నాటడం, వృద్ధాశ్రమాలు సందర్శించడం, ఉద్యోగం చేస్తూనే ఏడాది పాటు సివిల్స్​ శిక్షణ తీసుకున్నారు.

ఎంచుకున్న లక్ష్యంపై దృష్టి - మొక్కవోని దీక్షతో సివిల్స్​లో విజయం - AP CANDIDATES IN UPSC CIVILS

తొలి ప్రయత్నాలు విఫలమైనా : మొదటి మూడు ప్రయత్నాల్లో విఫలమైనా కుంగిపోలేదు. సొంతంగా సాధన చేస్తూనే ఆన్​లైన్​లో మాక్​టెస్ట్​లు రాయడం, గతంలో చేసిన తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగింది. సివిల్స్​లో అడిగే ప్రశ్నలకు కొత్తదనంగా, సమగ్ర సమాచారాన్ని జోడించి జవాబులు ఏ విధంగా రాయాలో నేర్చుకొని నాలుగో ప్రయత్నంలో సఫలమయ్యారు.

ఇంటర్వ్యూలో ప్రశ్నలు ఇలా : 20 నిమిషాల ఇంటర్వ్యూ సమయంలో అతి క్లిష్టమైన ప్రశ్నలను ఎదుర్కొన్నారు. లక్షలు వచ్చే కొలువును వదిలి సివిల్ సర్వీసెస్​కు ఎందుకు వచ్చావని, ఏపీ విభజనతో వచ్చే లాభ నష్టాలు వంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వచ్చిందని మౌనిక పేర్కొన్నారు. ఇకపై ప్రజలకు సేవ చేయటమే లక్ష్యంగా చెబుతున్నారు.

యూపీఎస్సీ తుది ఫలితాలు విడుదల - సత్తా చాటిన తెలుగు తేజాలు - UPSC CIVILS RESULTS

Jeenu Jaswant Civils Journery : సివిల్స్​లో ర్యాంకే లక్ష్యంగా మొదటిసారి పరీక్ష రాస్తే ఆశించిన ఫలితం రాలేదని అతడు దిగులు పడలేదు. రెండోసారి ప్రయత్నిస్తే 314 ర్యాంకుతో ఇండియన్ పోస్టల్ సర్వీసులో ఉద్యోగం సాధించారు. మరోసారి ప్రయత్నిస్తే ఇండియన్ రైల్వే మేనేజ్​మెంట్​ సర్వీసు ఉద్యోగం సాధించారు. అదే సంవత్సరంలో ఇండియన్ ఫారెస్ట్ సర్వీసుకు ఎంపికయ్యారు. తాజా ఫలితాల్లో 162వ ర్యాంకు సాధించిన జీను జశ్వంత్ 'న్యూస్​టుడే'తో తన అనుభూతులను పంచుకున్నారు. మూడేళ్లు బెంగళూర్​లో శాంసంగ్​ కంపెనీలో ఉద్యోగం చేస్తూ 2020 నుంచి సివిల్స్​ ప్రయత్నాలను మొదలు పెట్టారు. చివరికి అనుకున్నట్లు విజయం సాధించారు.

తండ్రి లక్ష్యమే తన లక్ష్యంగా : రెండు సార్లు సివిల్స్​లో ఉత్తీర్ణత సాధించినా సంతృప్తి లేదు. సివిల్ సర్వెంట్ కావాలనే తండ్రి జీను మాణిక్యాల రావు లక్ష్యాన్ని నెరవేర్చాలనే సంకల్పంతో ముందుకు సాగారు. ఇటీవల విడుదలైన సివిల్స్​ ఫలితాల్లో 162 ర్యాంకును సాధించి తన తండ్రి చిరకాల కలను నెరవేర్చాడు. జగ్గంపేటకు చెందిన ఆయన ప్రస్తుతం కాకినాడలో నివాసం ఉంటున్నారు. అయితే ఈ ఆనందాన్ని పంచుకోవడానికి తన తండ్రి లేడు. 2021లో అనారోగ్యంతో మరణించారు.

Interview With IFS First Ranker: సామాజిక మాధ్యమాలకు దూరం.. ఫలితంగా ఐఎఫ్ఎస్ ఫస్ట్ ర్యాంక్..!

బాల్యమంతా కాకినాడలోనే : జీను జశ్వంత్ బాల్యం అంత కాకినాడలోనే సాగింది. తల్లి జీను నాగలక్ష్మి కాకినాడలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలు. తాతయ్య గొల్లపల్లి లక్ష్మణరావు విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుడు. ఆయన కాకినాడ ఆశ్రమ్ పబ్లిక్ స్కూల్ లో 10వ తరగతి వరకు చదువుకున్నాడు. ఐఐటీ కాన్పూర్​లో కంప్యూటర్ సైన్సు చేసి 2018లో పట్టభద్రులు అయ్యారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.