ETV Bharat / state

ప్రచారంలో వైఎస్సార్సీపీ నేతలకు నిరసన సెగ - ఐదేళ్లుగా ఏం చేశారని నిలదీస్తున్న ప్రజలు - ap Election

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 11, 2024, 12:38 PM IST

AP People Deposed YSRCP Leaders : ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్సీపీ నేతలకు అడుగడుగున నిరసన సెగ తగులుతోంది. గత ఎన్నికల్లో తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన తరవాతే ఓట్లు అడగాలని తేల్చి చెబుతున్నారు. స్థానికులు అడిగినా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వెనుతిరుగుతున్నారు.

people_deposed_ysrcp
people_deposed_ysrcp (ETV Bharat)

AP People Deposed YSRCP Leaders : ఎన్నికల ప్రచారంలో అధికార నేతలకు అడుగడుగున ప్రశ్నల వర్షంతో స్థానికులు స్వాగతం పలుకుతున్నారు. ఒక్క ఛాన్స్​ అంటూ గత ఎన్నికల్లో గెలిచి, ఈ ఐదేళ్ల తమకు ఏం చేశారని వైఎస్సార్సీపీ నాయకులను నిలదీస్తున్నారు. గతంలో ఇచ్చిన హామీలను తీర్చిన తరవాతే ఓట్లు అడిగేందుకు రావాలని తేల్చి చెప్పారు. స్థానికులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలేక సంఘటన స్థలం నుంచి మెల్లగా జారుకుంటున్నారు.

వైఎస్సార్​సీపీ నేత అదీప్‌రాజ్‌కు నిరసన సెగ - సమస్యలపై నిలదీసిన గ్రామస్థులు - Villagers Deposed On Issues

Railway Kodur People Fire on YSRCP Leaders in Annamayya District : అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొరముట్ల శ్రీనివాసులకు చేదు అనుభవం ఎదురైంది. మైసూర్‌వారిపల్లి గ్రామంలో కొరముట్ల శ్రీనివాసుల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ పార్టీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. దీంతో స్థానిక మహిళలు ఎమ్మెల్యే అనుచరులతో వాగ్వాదానికి దిగారు. గ్రామ పరిధిలోని హరిజనవాడకు పార్టీ శ్రేణులు ద్విచక్ర వాహనాలపై ర్యాలీగా వెళ్లారు. ఇష్టారీతిన జగన్​ పాటలు పెట్టడంతో స్థానికులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అంతలోపే ఎమ్మెల్యే తన వాహనంలో అక్కడికి చేరుకుని సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి షాకిచ్చిన గ్రామస్తులు- ఐదేళ్లలో గ్రామానికి ఏం చేశారో చెప్పాలని నిలదీత - People Fire On Tellam Balaraju

ప్రచారంలో వైఎస్సార్సీపీ నేతలకు నిరసన సెగ - ఐదేళ్లుగా ఏం చేశారని ప్రశ్నిస్తున్నా స్థానికులు (ETV Bharat)

Kurnool People Fire on YSRCP MLA : కర్నూల్‌ జిల్లా కోసిగిలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన వైఎస్సార్సీపీ నాయకులకు స్థానికుల నుంచి నిరసన సెగ తగిలింది. మా కాలనీకి అయిదేళ్లుగా తాగునీటి సమస్య తీర్చి ఓట్లు అడిగేందుకు రావాలని ఎన్నికల ప్రచారానికి వచ్చిన వైఎస్సార్సీపీ మండల ఇన్​ఛార్జీ మురళీ మోహన్​ రెడ్డిని కోసిగి దుర్గానగర్​ కాలనీవాసులు నిలదీశారు. స్థానికులు అడిగినా ప్రశ్నలకు సమాధానం చెప్పాలేని వైఎస్సార్సీపీ నేతలు అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. కోసిగిలో మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే నాడిగేని గేరిలో ప్రచార రథంపై వస్తుండగా ముందుగా దుర్గానగర్​ కాలనీవాసులు ప్రధాన రోడ్డుపై ఖాళీ బిందెలతో బైఠాయించారు. స్థానిక ఎస్సై సతీశ్​ కుమార్​ వచ్చి వారిని చెదరగొట్టారు. అయినా కాలనీవాసులు పట్టుబడటంతో వైఎస్సార్సీపీ మండల ఇన్​ఛార్జీ మురళీమోహన్​ రెడ్డి ఘటనా స్థలానికి రాగా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మురళీ వారికి సర్దిచెప్పడంతో వెనుదిరిగారు.

సొంత ఇలాకాలో జగన్​కు ఊహించని కలవరం - వైఎస్ భారతికి నిరసనలపర్వం - Protest To YS Bharathi

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.