ETV Bharat / state

"ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు తెలుపవచ్చు"

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 25, 2024, 9:53 AM IST

AP High Court in Machilipatnam Voter list Dispute: ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణ నిరంతరం జరిగే ప్రక్రియ అని కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) తరఫు సీనియర్‌ న్యాయవాది అవినాశ్‌ దేశాయ్‌ హైకోర్టుకు నివేదించారు. ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లవచ్చని అన్నారు.

AP_High_Court_on_Machilipatnam_Voter_list_Dispute
AP_High_Court_on_Machilipatnam_Voter_list_Dispute

AP High Court on Machilipatnam Voter list Dispute : ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణ నిరంతరం జరిగే ప్రక్రియ అని కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) తరఫు సీనియర్‌ న్యాయవాది అవినాశ్‌ దేశాయ్‌ హైకోర్టుకు నివేదించారు. ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లవచ్చని అన్నారు. తుది ఓటర్ల జాబితాను విడుదల చేశామని తెలిపారు. అయినా అభ్యంతరాలు తెలపవచ్చని అన్నారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం మచిలీపట్నం ఓటరు జాబితాపై అభ్యంతరాలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాలని పిటిషనర్‌కు సూచించింది. పిల్‌ను పరిష్కరించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరస్‌సింగ్‌ ఠాకుర్, జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది.

ఒకే పోలింగ్‌ బూత్‌లో ఓటు హక్కు కల్పిచాలి : మచిలీపట్నం శానససభ నియోజకవర్గం పరిధిలో ఓటర్ల నమోదు ప్రక్రియను పారదర్శకంగా జరపాలని, అర్హులకు ఓటు నిరాకరించకుండా ఎన్నికల అధికారులను ఆదేశించాలని కోరుతూ మచిలీపట్నానికి చెందిన ఇమదాబత్తుల దిలీప్‌ కుమార్‌ హైకోర్టులో పిల్‌ వేశారు. ఈసీ నిబంధనలను అధికారులు అనుసరించేలా ఆదేశించాలని కోరారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది ఎంవీ రమణ కుమారి వాదనలు వినిపించారు. ఓటర్ల నమోదు నిబంధన 6 ప్రకారం ఒకే ఇంట్లో నివశిస్తున్న ఓటర్లకు ఒకే పోలింగ్‌ బూత్‌లో ఓటు హక్కు కల్పిచాల్సి ఉందని అన్నారు. ఇంటి నంబరు లేదా ఓటరు పేరు అక్షర వరుస క్రమం ఆధారంగా జాబితా సిద్ధం చేయాలని తెలిపారు. అందుకు భిన్నంగా ఓటరు జాబితా తయారు చేశారని అన్నారు. పోలింగ్‌ బూత్‌లను 2కి.మీ దూరంగా నిర్ణయిస్తున్నారని పేర్కొన్నారు.

ఓటర్ల జాబితా విషయంలో ఏపీలోనే ఎందుకు ఇన్ని ఫిర్యాదులు ?

విచారణ అవసరం లేదు : సీఈసీ తరఫున సీనియర్‌ న్యాయవాది అవినాశ్‌ దేశాయ్‌ వాదనలు వినిపిస్తూ ఓటరు జాబితాపై అభ్యంతరాలను సమర్పించవచ్చని తెలిపారు. తుది జాబితా విడుదల చేసిన నేపథ్యంలో ప్రస్తుత పిల్‌పై విచారణ కొనసాగించాల్సిన అవసరం లేదని అన్నారు.

ఓటర్ల జాబితాలో అక్రమాలపై సీఈసీ బృందం సమీక్ష - ఏం చర్యలు తీసుకున్నారని కలెక్టర్లకు ప్రశ్న

ఓటర్ల జాబితా సవరణపై ప్రతీ వారం సమీక్ష : ఓటర్ల తుది జాబితాలో అభ్యంతరాల పరిష్కారానికి సచివాలయంలో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా తెలిపారు. ఓటర్ల నమోదు, తొలగింపు ప్రక్రియకు సంబంధించి పోలింగ్‌ తేదీకి పది రోజుల ముందుగా అందే వివరాలను మాత్రమే పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని అన్నారు. ఓటర్ల జాబితా సవరణపై ప్రతి వారం జిల్లా ఎన్నికల అధికారి, ఈఆర్వో స్థాయిలో సమీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత అధికారులకు తెలియజేయాలని ముకేశ్‌కుమార్‌ మీనా కోరారు.

ఓటర్ల జాబితా సవరణ దరఖాస్తుల్లో తప్పుడు సమాచారం ఇస్తే క్రిమినల్‌ కేసులు : ఈఆర్వో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.